ఇలా అవుతాడని అనుకోలేదు, చిరంజీవిపై జయసుధ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ నటి జయసుధ. షూటింగ్ లో మెగాస్టార్ ఎలా ఉండేవారో వివరిస్తూ జయసుధ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎటువంటి సినిమా బాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదిగారు. ఒక్కొమెట్టు ఎక్కుతూ ఆయన ఎదిగిన తీరు ఎంతో మంది నటీనటులకు ఆదర్శం. 45 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఎంతో మంది స్టార్స్ తో కలిసి సినీ ప్రయాణం కొనసాగించారు చిరంజీవి. మెగాస్టార్ కలిసి ఇండస్ట్రీలో కొనసాగిన ఎంతో మంది తారలు సందర్భానుసారం ఆయన గురించి ఏదో ఒక కొత్త విషయాన్ని పంచుకుంటుంటారు. ఎవరి ఎక్స్ పీరియన్స ను వారు ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ ఉంటారు. ఆ లిస్ట్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు నటించి మెప్పించారు.
చిరంజీవితో సినిమా చేసి స్టార్లుగామారిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారు కూడా పలు సందర్భాలలో ఇంటర్వ్యూలు ఇస్తూ చిరంజీవి గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే మెగాస్టార్ తో ఒకటీ రెండు సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్లు కూడా లేకపోలేదు. అలా చిరుతో చాలా తక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లలో జయసుధ కూడా ఒకరు.
మెగాస్టార్ తో రెండు మూడు సినిమాలు చేసినా కాని ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు జయసుధ. ఓ సందర్భంలో చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన జయసుధ, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే సరికి సీనియర్ హీరోయిన్ గా ఉన్నారు.
కొత్తగా వచ్చిన హీరో అయినా సరే చిరంజీవి సరసన రెండు సినిమాల్లో నటించారు జయసుధి. అంతే కాదు ఓ సినిమాలో మెగాస్టార్ కు తల్లి పాత్రలో కూడా ఆమె నటించారు. ఈక్రమంలో జయప్రద హోస్ట్ గా గతంలో నిర్వహించిన జయప్రదం స్పెషల్ ప్రోగ్రామ్ లో జయసుధ కూడా పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీ గురించి, తనతో నటించిన హీరోల గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి నేను రెండు మూడు సినిమాలు చేశాము. చిరంజీవితో నా ఫస్ట్ మూవీ ఇది కథ కాదు. తమిళంలో రజినీకాంత్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేశారు. ఈ సినిమాలో ఆయన నేను భార్య భర్తలుగా నటించాము.
ఈసినిమా తరువాత ప్రాణం ఖరీదు సినిమా తో పాటు మరో రెండు మూడు సినిమాల్లో నటించాము. రిక్షవోడు సినిమాలో కూడా చిరంజీవితో కలిసి నటించాను. కాని అన్ని సినిమాల్లో పెయిర్ గా నటించలేదు. షూటింగ్ లో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. తన పని తాను చేసుకునేవారు. అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉండేవారు.
ఆయన నటన చూసి ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతాడు అని అనుకేనేదాన్ని, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు గారు ఇలా ఒక చైన్ కొనసాగుతుంది. అందులో చిరంజీవి కూడా చేరతారు అని నమ్మకం ఉండేది. స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నాను కాని ఇంత పెద్ద మెగాస్టార్ అవుతారని మాత్రం అనుకోలేదు అని జయసుధ అన్నారు.
ఇక హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన జయసుధ, ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంతే స్టార్ డమ్ చూశారు. ఎన్టీఆర్ నుంచి మోహాన్ బాబు వరకూ ఎంతో మంది హీరోల సరసన ఆమె నటించారు. ఆతరువాత అక్క, వదిన పాత్రలు, ఆతరువాత హీరోలకు తల్లి పాత్రలు చేశారు. ఇక ఈమధ్య కాలంలో శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకు నాన్నమ్మ పాత్రలు కూడా వేశారు జయసుధ. ఇటు సినిమాలు చేస్తూనే అటు రాజకీయాల్లో కూడా రాణించారు జయసుధ. ప్రస్తుతం సినిమాలు తగ్గించి ఫారెన్ లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.