రేఖాని ఇంటికి పిలిచి వార్నింగ్ ఇచ్చిన జయా బచ్చన్.. `బచ్చన్ ఎప్పటికీ నా వాడే`
Jaya Bachchan-Rekha: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ తన భర్తను ప్రేమిస్తున్న రేఖాని ఇంటికి భోజనానికి పిలిచి అమితాబ్ ఎప్పటికీ నా వాడే అని చెప్పారట.

rekha, jaya bachchan
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, రేఖ మధ్య ప్రేమకథ బాలీవుడ్లో బాగా చర్చనీయాంశమైంది. ఇప్పటికీ వాళ్ల ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. రేఖ ఇంకా అమితాబ్ ప్రేమలోనే ఉందంటారు.
rekha, jaya bachchan
మేరీ సహేలీ పాడ్‌కాస్ట్‌లో సీనియర్ రచయిత హనీఫ్ జవేరి, రేఖ అమితాబ్ జీవితంలోకి ఎలా వచ్చారు, జయా ఎలా స్పందించారు అనే విషయాలు చెప్పారు.
amitabh, jaya bachchan
హనీఫ్ జవేరి ప్రకారం, `దో అంజనే` సినిమా షూటింగ్ సమయంలో రేఖ, అమితాబ్ బచ్చన్ స్నేహితులయ్యారు. వాళ్లిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెలీదు కానీ ప్రేమలో ఉన్నారని మాత్రం కచ్చితంగా చెప్పగలను" అని హనీఫ్ అన్నారు.
amitabh, rekha
1982లో `కూలీ` సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్‌కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో జయా బచ్చన్ ఆసుపత్రిలో ఆయన పక్కనే ఉండి సేవ చేశారు. రాత్రింబవళ్లు ఆయనతో ఉండి, చూసుకున్నారు.
jaya bachchan, rekha
అమితాబ్ బచ్చన్‌కు స్పృహ వచ్చాక, జయా ప్రేమను చూసి ఆమెపై మరింత అభిమానం పెంచుకున్నారు. బచ్చన్ తన భార్య వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు, ఆ తర్వాత అన్నీ మారిపోయాయి" అని జవేరి చెప్పారు.
jaya bachchan, rekha
అమితాబ్, రేఖ మధ్య టెన్షన్ పెరగడంతో, జయా బచ్చన్ ఒక నిర్ణయం తీసుకున్నారట. అమితాబ్ ఇంట్లో లేనప్పుడు రేఖాని భోజనానికి పిలిచారట.
amitabh, jaya bachchan
రేఖకి జయా రకరకాల వంటలు వడ్డించి, బాగా చూసుకున్నారు. అంతేకాదు రేఖతో చాలాసేపు మాట్లాడారట. సాయంత్రం రేఖ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు, జయా రేఖతో 'అమితాబ్ నావాడు. ఎప్పుడూ నావాడే' అని చెప్పారట. ఆ మాటలకి రేఖ షాక్ అయి అమితాబ్‌కు దూరంగా ఉందట.
also read: ఎన్టీఆర్, నెల్సన్ మూవీ లేదా? షాకిచ్చిన నిర్మాత.. త్రివిక్రమ్‌తో బన్నీ, తారక్ మూవీస్ ఎప్పుడంటే?