MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

చిరంజీవి తన కెరీర్ లో ఎదురైన కష్టాలు, అవమానాలని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఓ సన్నివేశంలో తాను సరిగ్గా నటించలేకపోవడం వల్ల రోజంతా సమయం వేస్ట్ అయింది అని తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 06 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అందుకున్న మైలురాళ్ళు ఒకెత్తయితే కెరీర్ బిగినింగ్ లో పడ్డ కష్టాలు మరో ఎత్తు. ఎన్నో ఆటంకాలు అధికమిస్తూ టాలీవుడ్ లో చిరంజీవి అగ్ర స్థానానికి ఎదిగారు. ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ తన కెరీర్ బిగినింగ్ లో పడ్డ కష్టాల గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇది కథ కాదు మూవీ
Image Credit : Asianet News

ఇది కథ కాదు మూవీ

నా కెరీర్ బిగినింగ్ లో కె బాలచందర్ గారి దర్శకత్వంలో నటించాను. ఆ మూవీ ఇది కథ కాదు. అందులో ఒక కాంప్లికేటెడ్ షాట్ ఉంటుంది. ట్రాలీపై కెమెరా రన్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాలీని ఫాలో కావాలి.. డైలాగ్ చెబుతూ ఉండాలి.. ఎమోషన్ పండాలి.. అన్నీ ఒకే సందర్భంలో జరగాలి. బాలచందర్ గారు అలాంటి షాట్ పెట్టారు.

Related Articles

Related image1
Bigg Boss 10: ఈ సారి బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున, ఎందుకో తెలుసా.. లెక్కలన్నీ మారిపోతాయ్
Related image2
Nani: నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలేంటో తెలుసా ? ఫ్లాప్ హీరోతో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మూవీ
35
11 టేక్స్ అయినా చేయలేకపోయా
Image Credit : Asianet News

11 టేక్స్ అయినా చేయలేకపోయా

బాలచందర్ గారు షాట్ రెడీ అన్నారు. నేను డైలాగ్ మొదలు పెట్టాను. కెమెరా మూమెంట్ కి నా డైలాగ్ కి సెట్ కావడం లేదు. బాలచందర్ గారు కట్ చెప్పి.. కెమెరాని ఫాలో కావా ? రిహార్సల్స్ చేశావు కదా అని తిట్టారు. మళ్ళీ సెకండ్ టేక్.. అయినా సరిగ్గా చేయలేకపోయా.. 3, 4, 5 ఇలా 11 టేక్స్ అయ్యాయి. మధ్యాహ్నం అయిపొయింది. ఆ షాట్ కంప్లీట్ కాలేదు. నాలో నెర్వస్ నెస్ పెరిగిపోతోంది. బాలచందర్ గారు తిడుతున్నారు. బ్రేక్ ఇచ్చి.. చిరంజీవికి కాస్త ట్రైనింగ్ ఇవ్వండి అని కో డైరెక్టర్స్ కి చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెడదాం అని అన్నారు.

45
సాయంత్రానికి పూర్తి చేశా
Image Credit : Asianet News

సాయంత్రానికి పూర్తి చేశా

మధ్యాహ్నం కూడా అదే తంతు. చేయలేకపోతున్నాను.. ఆ గ్రిప్ దొరకట్లేదు. నిరాశ ఎక్కువవుతోంది. నాకు నటన రాదా ? డైలాగులు చెప్పలేనా ? ఇలా నాలో నాకే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సాయంత్రం 6 అవుతోంది. రోజంతా నా వల్ల టైం వేస్ట్ అయిపోయింది అనే బాధ ఎక్కువవుతోంది. ఆ టైంలో బాలచందర్ గారు షాట్ ఓకె అన్నారు. అది కూడా మొక్కుబడిగా ఓకె చెప్పారు. హమ్మయ్య అనుకున్నా. కానీ ఆయన పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో నాకు నిరాశ అయితే అలాగే ఉంది.

55
రజినీకాంత్ చేయలేక చేతులెత్తేశారు
Image Credit : Asianet News

రజినీకాంత్ చేయలేక చేతులెత్తేశారు

నేను చాలా డిస్సప్పాయింటెడ్ గా ఉండడం చూసి కో డైరెక్టర్ శర్మ అనే ఆయన నా దగ్గరకు వచ్చారు. ఏంటి ఇంతలా నిరాశ పడిపోతున్నావ్. నువ్వు చాలా బాగా చేశావ్. అందుకే కదా డైరెక్టర్ గారు షాట్ ఓకె చేశారు. ఆయన షాట్ ఓకె అంటే నువ్వు బాగా చేసినట్లే. కానీ ఆయన ఇంకా బాగా రావాలి అని భావిస్తారు. నీకు ఈ విషయం తెలుసా.. ఇది తమిళ సినిమా అవర్గళ్ చిత్రానికి రీమేక్. తమిళంలో నీ పాత్రలో రజినీకాంత్ నటించారు. ఇదే సీన్ ని రజనీకాంత్ రోజంతా కూడా కంప్లీట్ చేయలేకపోయారు. మరుసటి రోజు ఎప్పటికో గానీ షాట్ ఓకె కాలేదు. కనీసం నువ్వు ఒక రోజులోనే కంప్లీట్ చేశావు అని చెప్పారు. అప్పుడు నాకు ధైర్యం, కాన్ఫిడెన్స్ వచ్చాయి. రజనీకాంత్ కూడా చేయలేకపోయారా ? అంటే ఇది అంతటి కష్టమైన షాట్ అన్నమాట అని భావించా. అప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అని చిరంజీవి తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Related Stories
Recommended image1
Bigg Boss 10: ఈ సారి బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున, ఎందుకో తెలుసా.. లెక్కలన్నీ మారిపోతాయ్
Recommended image2
Nani: నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలేంటో తెలుసా ? ఫ్లాప్ హీరోతో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved