MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?

ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?

ANR: తెలుగు ఇండస్ట్రీని బ్రతికించిన హీరోలలో అక్కినేని నాగేశ్వరావు పాత్ర చాలా ఉంది. చెన్నైలో ఎన్నో కష్టాలు పడి.. సినిమా అవకాశాలు తెచ్చుకుని.. ఆతర్వాత స్టార్ గా మారాడు ఏఎన్నారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 06 2026, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు
Image Credit : IBtimes India

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు

తెలుగు చిత్రసీమలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) గడిపిన జీవితం తరతరాలకు ఆదర్శప్రాయం. ఆయన సాధించిన విజయాలు, పొందిన కీర్తి వెనుక ఎంతో కష్టం, ఆత్మనిగ్రహం, క్రమశిక్షణ ఉన్నాయి. నటుడిగా అత్యున్నత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా, తన తొలినాటి కష్టాలను ఆయన ఏమాత్రం దాచుకోకుండా ఎంతో నిజాయితీగా చెప్పుకునేవారు. మద్రాసు (చెన్నై)లో సినీ జీవితం ప్రారంభించిన కొత్తలో ఆయన ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆ రోజుల్లో ఆయన పాటించిన పొదుపు సూత్రాలు ఆయనలోని గొప్ప వ్యక్తిత్వాన్ని చాటిచెబుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెన్నైలో అక్కినేని కెరీర్ బిగినింగ్ డేస్ లో..
Image Credit : Facebook/Allu Arjun

చెన్నైలో అక్కినేని కెరీర్ బిగినింగ్ డేస్ లో..

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరరావు కి ప్రముఖ నిర్మాత, దర్శకుడు బలరామయ్య గారు మాత్రమే తెలుసు. ఆయనే ఒక సారి నాగేశ్వరరావును రైల్వే స్టేషన్ లో చూసి.. సినిమాల్లో అవకాశం కల్పించారు. ఆయన పుణ్యమా అని నెలకు 250 రూపాయల జీతం తో పాటు మధ్యాహ్నం ఫుడ్డు, ఉండటానికి ప్లేస్ కూడాలభించేది. అయితే ఒక పేద కుటుంబం నుండి వచ్చిన ఎఎన్నాఆర్, తన భవిష్యత్తు అవసరాల కోసం, కుటుంబం కోసం ఆ వచ్చిన జీతంలో 200 రూపాయలను దాచుకునేవారు. మిగిలిన 50 రూపాయలతోనే ఆయన నెల మొత్తం ఖర్చు చేసుకునేవారు.

Related Articles

Related image1
Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
Related image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
35
50 రూపాయలతో చెన్నైలో బ్రతికి చూపించిన ఏఎన్నార్..
Image Credit : Asianet News

50 రూపాయలతో చెన్నైలో బ్రతికి చూపించిన ఏఎన్నార్..

అక్కినేని  నాగేశ్వరావు వచ్చిన జీతంలో 200 దాచుకోగా మిగిలిన కేవలం 50 రూపాయల బడ్జెట్‌లోనే నెల అంతటికి సర్ధుకునేవారు. ఆయనకు కావలసిన తిండి, మురుకులు సినిమాలు చూడటం.. ఇతర వ్యక్తిగత ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది. ఈ పరిమిత బడ్జెట్‌తో మద్రాసు వంటి నగరంలో నెల నెట్టుకురావడం నిజంగా పెద్ద సవాళ్లతో కూడుకున్న విషయమే. అందుకే ఆయన ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.

45
'సాంబార్‌గాడు వచ్చాడురా' అంటూ.. అవమానాలు
Image Credit : Asianet News

'సాంబార్‌గాడు వచ్చాడురా' అంటూ.. అవమానాలు

మద్రాసులోని 'పాండీ బజార్' హోటళ్లలో టిఫిన్ తినడానికి వెళ్లినప్పుడు ఎదురైన ఒక అనుభవాన్ని అక్కినేని గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో అక్కడ ఇడ్లీ కొనుక్కోవాల్సి వచ్చేది కానీ సాంబార్ మాత్రం ఉచితంగా (ఫ్రీగా) పోసేవారు. ఆకలిగా అనిపించి కడుపు నిండా తినాలంటే రెండో ప్లేట్ ఇడ్లీ కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ అలా కొంటే తాను కేటాయించుకున్న 50 రూపాయల బడ్జెట్ దాటిపోతుందనే భయం ఆయనకు ఉండేది.ఇడ్లీలో కేవలం స్టార్చ్ (పిండి పదార్థాలు) మాత్రమే ఉంటాయని, సాంబారులో పప్పు ఉంటుంది కాబట్టి అందులో ప్రొటీన్ దొరుకుతుందని ఆయన ఆలోచించేవారు.అందుకని ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రమే ఆర్డర్ చేసి, ఉచితంగా ఇచ్చే సాంబార్‌నే రెండు, మూడు సార్లు అడిగి తాగేసేవారు.వరుసగా రెండు, మూడు రోజులు అక్కినేని అలా ఉచిత సాంబార్ ఎక్కువగా తాగడం చూసి హోటల్ సర్వర్లు, చుట్టుపక్కల వారు "వీడెవడో సాంబార్‌గాడు వచ్చాడురా" అని చూడటం, అనుకోవడం మొదలుపెట్టారు.

55
లక్ష్యం కోసం అవమానాలు దిగమింగి...
Image Credit : google

లక్ష్యం కోసం అవమానాలు దిగమింగి...

అక్కడి వారు తనను "సాంబార్‌గాడు వచ్చాడురా" అని ఎగతాళి చేసినా, అక్కినేని ఏమాత్రం పట్టించుకోలేదు, తన అలవాటును వదులుకోలేదు . "వారు ఏమనుకున్నా సరే, నేను నా బడ్జెట్ హద్దులు దాటకూడదు, ఇడ్లీలు ఎక్కువ కొంటే డబ్బులు అయిపోతాయి" అని భావించి సాంబార్ తోనే కడుపు నింపుకునేవారు. ఈ చిన్న ఉదంతం కేవలం ఒక నటుడి ఆహారపు అలవాటు గురించి మాత్రమే కాదు.. ఒక సామాన్య స్థాయి నుంచి ఇండియన్ సినిమా చరిత్రలోనే దిగ్గజ నటుడిగా ఎదిగిన ఒక మహానటుడి క్రమశిక్షణ అందరికి తెలిసేలా చేస్తుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Recommended image2
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Recommended image3
Bigg Boss 10: ఈ సారి బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున, ఎందుకో తెలుసా.. లెక్కలన్నీ మారిపోతాయ్
Related Stories
Recommended image1
Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
Recommended image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved