- Home
- Entertainment
- Jana Nayakudu Trailer: `భగవంత్ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్
Jana Nayakudu Trailer: `భగవంత్ కేసరి`ని మక్కీకి మక్కీ దించేసిన విజయ్.. కొత్తగా చూపించింది ఇదే.. వాళ్లకి వార్నింగ్
Jana Nayakudu Trailer: హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ నటించిన `జన నాయకుడు` సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది బాలయ్య సినిమాని మక్కీకి మక్కీ దించేయడం గమనార్హం.

దళపతి విజయ్ చివరి మూవీ `జన నాయకుడు`
హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయకుడు` సంక్రాంతి పండుగకు రాబోతోంది. `వలిమై`, `తునివు`, `నేర్కొండ పార్వై` లాంటి చిత్రాలు తీసిన హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.
`జన నాయకుడు` ట్రైలర్ వచ్చింది
`జన నాయకుడు` సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ప్రియమణి, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, మమితా బైజు లాంటి పెద్ద తారాగణం ఉంది. ఇది విజయ్ చివరి సినిమా. దీని తర్వాత అతను సినిమాలకు గుడ్ బై చెప్పి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. `జన నాయకుడు` ట్రైలర్‌ని శనివారం సాయంత్రం విడుదల చేశారు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. విజయ్ అభిమానులకు ట్రీట్ లాగా ఉంది.
`భగవంత్ కేసరి`ని మక్కీకి మక్కీ దించేశారు
`జన నాయకుడు` ట్రైలర్ చూస్తుంటే అచ్చుగుద్దినట్టు బాలకృష్ణ నటించిన `భగవంత్ కేసరి` మూవీని తలపిస్తుంది. మక్కీకి మక్కీ దించేశారు. పోలీస్ ఆఫీసర్‌గా, ఆ తర్వాత రాజకీయ నాయకులకు వార్నింగ్ ఇవ్వడం, మరోవైపు ఫ్రెండ్ కూతురుని జవాన్‌ని చేయడం, అడవిలో విలన్లతో ఫైట్ చేయడం, ఆ తర్వాత ఓ బడా బిలియనీర్‌ని ఢీ కొట్టడం, ఇద్దరి మధ్య ఫైట్, వార్నింగ్‌లు, అనంతరం రాజకీయాల వైపు టర్న్ తీసుకోవడం, రాజకీయ నాయకులకు వార్నింగ్ ఇవ్వడం వంటివి అన్నీ మక్కీకి మక్కీ దించారు. ఇందులో కొత్తగా ఏదైనా ఉందంటే రాజకీయాలపై విజయ్ మార్క్ డైలాగ్‌లు మాత్రమే.
రాజకీయ నాయకులకు విజయ్ వార్నింగ్
`జనానికి మంచి చేస్తానని ఇందులోకి రాకు, నిన్ను నువ్వు కాపాడుకొని పారిపో` అని విలన్ బాబీ డియోల్ వార్నింగ్ ఇవ్వగా, `అర్హత లేని వారంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు` అని విజయ్ తన అనుచరులకు చెప్పగా, `నువ్వేం చేయలేవ్, బయలు దేరు` అని రాజకీయ నాయకుడైనా ప్రకాష్ రాజ్ విజయ్‌ని హెచ్చరిస్తాడు. `నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అని ఎవడు చెప్పినా, సరే తిరిగి వెళ్లే ఐడియానే లేదు. నేను వస్తున్నా`. చివరగా ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాలకు రమ్మంటే, హత్యలు చేయడానికి, దోచుకోవడానికారా రాజకీయాల్లోకి వచ్చేది` అని చివరగా రాజకీయ నాయకులను బరిసెతో కొడుతూ విజయ్ చెప్పడం ఆకట్టుకుంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాలను అద్దం పట్టేలా, తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఉన్నవాళ్లు హత్యా రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని ఈ మూవీ ద్వారా విజయ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. రాజకీయాల్లోకి తన పూర్తిస్థాయి ఎంట్రీకి సంబంధించిన ఈ మూవీ ద్వారా క్లారిటీ ఇచ్చాడు విజయ్.
`జన నాయకుడు`పై ట్రోలింగ్
ఇక ట్రైలర్ ప్రారంభం నుంచి యాక్షన్, ఎలివేషన్లు, వార్నింగ్‌లు, కూతురు సెంటిమెంట్, ఫ్యామిలీ అంశాలతో సాగింది. మధ్యలో కామెడీ పాళ్లు కూడా ఉన్నాయి. ఇలా అన్ని అంశాల మేళవింపుగా ఈ సినిమాని రూపొందిస్తున్నారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మరి సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇది తెలుగు లో వచ్చిన `భగవంత్ కేసరి` రీమేక్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ కన్ఫమ్ చేయలేదు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ట్రైలర్‌లోనూ ఎక్కడ కూడా అనిల్ రావిపూడి వేయలేదు. ఈ నేపథ్యంలో కథతోపాటు అన్ని రైట్స్ కొనుక్కొని ఈ మూవీని చేశారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. మరి దీనికి టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

