MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో

విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో

ఈ ఏడాది ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు ఓ ఇంటివారు అయ్యారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పాటు అల్లు శిరీష్ కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. ఈక్రమంలో మరో టాలీవుడ్ యంగ్ హీరో త్వరలో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 07 2026, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ లో పెళ్లి బాజాలు..
Image Credit : Asianet News

టాలీవుడ్ లో పెళ్లి బాజాలు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. యంగ్ హీరోలంతా తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి..ప్రేమించిన ప్రియురాళ్లను పెళ్లాడుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. విజయ్ దేవరకొండ తన హీరోయిన్ రష్మిక మందన్నను పెళ్లాడగా.. అల్లు శిరీష్ కూడా తాను ప్రేమించిన నైనికతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు. ఇక మరో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బెల్లంకొండ హీరో ప్రేమలో పడ్డాడా?
Image Credit : our own

బెల్లంకొండ హీరో ప్రేమలో పడ్డాడా?

యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల మార్చి 8న ఆయన నిశ్చితార్థ వేడుక జరగనుందని తెలుస్తోంది. 

కొన్నేళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆ యువతినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.

Related Articles

Related image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Related image2
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
34
విజయ్ బాటలోనే..
Image Credit : our own

విజయ్ బాటలోనే..

విజయ్ దేవరకొండ మాదిరిగానే బెల్లంకొండ కూడా నిశ్చితార్థ వేడుకను అత్యంత సన్నిహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కాకుండా, కుటుంబ సభ్యులు , అత్యంత దగ్గరి మిత్రులతో మాత్రమే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

వధువు వివరాలను ప్రస్తుతం సీక్రెట్ గా ఉంచినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరు, ఏ రంగానికి చెందినవారు అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడావచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

44
బెల్లంకొండ కెరీర్..
Image Credit : Asianet News

బెల్లంకొండ కెరీర్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నిలబడటం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. అన్ని జానర్లలో సినిమాలు ట్రై చేశాడు. కానీ.. ఇంత వరకూ అతనికి సాలిడ్ సక్సెస్ మాత్రం రాలేదు. యాక్షన్ ప్రధానమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బెల్లంకొండ.. బాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Related Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved