MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్

Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్

Dhurandhar 2 Trailer Review: ఇండియన్‌ సినీ ఆడియెన్స్ ఎదురుచూస్తోన్న `ధురంధర్ 2` మూవీ ట్రైలర్‌ వచ్చేసింది.  3.21 నిమిషాల నిడివి ఉన్నఈ ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ తో సాగింది. ఇందులో డైలాగ్‌లు గూస్‌ బంమ్స్‌ తెప్పించాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 07 2026, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ధురంధర్‌ 2 మూవీ ట్రైలర్‌ వచ్చింది
Image Credit : Asianet News

ధురంధర్‌ 2 మూవీ ట్రైలర్‌ వచ్చింది

రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్: ది రివెంజ్' ట్రైలర్ విడుదలైంది. పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగ్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. ఈ రెండో భాగం పూర్తిగా ప్రతీకారం, సంఘర్షణ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. రణ్‌ వీర్‌ సింగ్‌ ఇందులో కొత్తలుక్‌లో కనిపిస్తున్నారు. యంగ్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఆయన యాక్షన్‌తో రెచ్చిపోయారు. ప్రారంభం నుంచి, ఎండింగ్‌ వరకు యాక్షన్‌ ప్రధానంగానే ట్రైలర్‌ సాగింది. ఓ రకంగా ఊచకోత అని చెప్పొచ్చు. రణ్‌ వీర్‌ విధ్వంసం వేరే లెవల్‌లో ఉంది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి పెద్ద స్టార్లు కూడా ఉన్నారు. దీంతో సినిమా స్కేల్ మరింత పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ధురంధర్‌ 2లో 5 డైలాగులు
Image Credit : Youtube@B62 Studios

ధురంధర్‌ 2లో 5 డైలాగులు

‘ధురంధర్ : ది రివెంజ్’ ట్రైలర్‌లో యాక్షన్‌తోపాటు మధ్యలో అదిరిపోయే డైలాగ్‌లు ఉన్నాయి. అవి ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ప్రధానంగా ఐదు డైలాగ్‌లు హంట్‌ చేస్తున్నాయి. అంచనాలు పెంచుతున్నాయి. అవేంటో చూస్తే,  సంజయ్ దత్.. ల్యారీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన చౌదరి అస్లాం పాత్రలో నటిస్తున్నారు. ఒక సీన్‌లో ఆయన 'ఎందుకు ఏడుస్తున్నావ్ బ్రదర్.. నువ్వు వినలేదా... ఎక్కడ నొప్పి ఉంటుందో, అక్కడే మగాడు ఉంటాడు' అని అంటారు.

36
రక్తం మరిగించే డైలాగ్‌
Image Credit : Youtube@B62 Studios

రక్తం మరిగించే డైలాగ్‌

ISI మేజర్ ఇక్బాల్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన డైలాగ్ కూడా ఉంది. 'హిందుస్థానీ తల నరికి ముషారఫ్ డైనింగ్ టేబుల్‌పై పెట్టాడు మేజర్ ఇక్బాల్... దేవుడి మీద ఒట్టు, ఇప్పుడు మరో హిందుస్థానీ తల నరికి మురిద్కే మినార్‌కు వేలాడదీస్తాను' అని ఆయన చెప్పడం రక్తం మరిగించేలా ఉంటుంది.

46
ఇన్‌స్పైర్‌ చేసే డైలాగ్‌
Image Credit : Youtube@B62 Studios

ఇన్‌స్పైర్‌ చేసే డైలాగ్‌

'ధురంధర్ : ది రివెంజ్'లో ఆర్. మాధవన్.. IB డైరెక్టర్ అజయ్ సన్యాల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ అజిత్ దోవల్ నుండి ప్రేరణ పొందింది. ట్రైలర్‌లో ఆయన చెప్పిన 'ధైర్యమే ఇంధనం, ప్రతీకారమే లక్ష్యం' అనే డైలాగ్ చేర్చారు. ఇది ఇన్‌స్పైరింగ్‌గా, ధైర్యాన్ని నింపేలా ఉంటుంది. 

56
గూస్‌ బంమ్స్ తెప్పించే రణ్‌వీర్‌ సింగ్‌ డైలాగ్‌
Image Credit : Youtube@B62 Studios

గూస్‌ బంమ్స్ తెప్పించే రణ్‌వీర్‌ సింగ్‌ డైలాగ్‌

'ధురంధర్ : ది రివెంజ్'లో రణ్‌వీర్ సింగ్.. జస్కీరత్ సింగ్ రంగీ అలియాస్ హమ్జా అలీ మజారీ పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్‌లో ఆయన ఒక డైలాగ్ చెప్తారు. "పాకిస్థాన్ భవిష్యత్తును ఇకపై హిందుస్థాన్ నిర్ణయిస్తుంది" అంటారు.  ఇది గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. విజిల్స్ వేయిస్తుంది. 

66
మార్చి 19న ధురంధర్‌ 2
Image Credit : Youtube@B62 Studios

మార్చి 19న ధురంధర్‌ 2

పాకిస్థాన్ సీనియర్ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి పాత్రలో రాకేష్ బేడీ నటిస్తున్నారు. 'ధురంధర్ : ది రివెంజ్' ట్రైలర్‌లో ఆయన డైలాగ్ కూడా వినిపించింది. "జర్వారీ సాహెబ్... మీ ఫామ్‌హౌస్‌లో చాలా తెల్లటి బాతులను పెంచుతున్నారు... ఈ బాతులు చాలా తెల్లగా ఉన్నాయి` అని ఆయన అంటారు. ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలా ఈ ఐదు డైలాగ్‌లో `ధురంధర్‌ 2` ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. అంచనాలు పెంచుతున్నాయి. మార్చి 19న ఈ మూవీ విడుదల కాబోతుంది. అదిత్యధర్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Dhurandhar 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్‌ 2 సంచలనం.. యానిమల్‌, జవాన్‌ రికార్డులు బ్రేక్‌?
Recommended image2
Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు.. కమల్‌కి పైడి జయరాజ్‌ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్‌ అవార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved