- Home
- Entertainment
- Jabardasth Naresh: ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు, పెళ్లై పిల్లలు పుడితే చాలు.. జబర్దస్త్ నరేష్ ఆవేదన
Jabardasth Naresh: ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు, పెళ్లై పిల్లలు పుడితే చాలు.. జబర్దస్త్ నరేష్ ఆవేదన
జబర్దస్త్ నరేష్ తనదైన కామెడీతో జబర్దస్త్ షోలో నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన పెళ్లిపై, పిల్లలు పుట్టడంపై స్పందించాడు. తన నవ్వుతోనే తన ఆవేదన వ్యక్తం చేశాడు.

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన నరేష్
జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. వందల మంది కమెడియన్లని తయారు చేసింది. ఈ షోకి వచ్చిన వారు ఏదో రకంగా లైఫ్‌లో సెటిల్ అయ్యారు. చాలా వరకు సినిమాలు చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా చేస్తున్నాడు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, ధన్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నరేష్. ఇప్పటికీ విశేషంగా అలరిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు.
పెళ్లిపై జబర్దస్త్ నరేష్ క్రేజీ కామెంట్స్
జబర్దస్త్ నరేష్ ఏజ్ పెరిగినా, బాడీ పరంగా చిన్నగా ఉంటాడు(మరుగుజ్జు లాగా). దీంతో తన హైట్‌పై, తన వ్యక్తిగత విషయాలపై జబర్దస్త్ లోనూ చాలా వరకు జోకులు వేస్తుంటారు. నరేష్ కూడా వాటిని స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. ఇది చూసే వారికి చాలా వరకు నవ్వులు పూయిస్తుంది. అదే తనకు అసెట్‌గా మల్చుకుని నవ్విస్తున్నాడు నరేష్. అయితే ఆయన పెళ్లి పరిస్థితి ఏంటనేది ఎప్పుడూ ఓ ప్రశ్న. ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు మ్యారేజ్ చేసుకుంటారా? అనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో తాజాగా దీనిపై ఆసక్తికర కామెంట్ చేశాడు నరేష్. ఎదురు కట్నం ఇచ్చి అయినా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం విశేషం.
అమ్మాయి అడిగితే ఎదురు కట్నం ఇస్తా -నరేష్
తాజాగా నరేష్.. జబర్దస్త్ వర్ష యాంకర్‌గా చేస్తున్న బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొన్నాడు. వర్ష.. పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించింది. సంబంధాలు చూస్తున్నామని చెప్పాడు. అదేంటి అమ్మాయి కుదిరింది, పెళ్లి చేసుకోబోతున్నావని ప్రోమోలో పడింది? అని వర్ష అడగ్గా, అందుకే ఎపిసోడ్ మొత్తం చూడాలనేది, ప్రోమోలు చూస్తే ఇంకేంటి నరేష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు, పెళ్లి అయిపోతుంది అనుకుంటారు. ఇంకా ఏ ఇంటి వాడు కాలేదు, ఒప్పుకుంటే మీ ఇంటి వాడిని అవుతా అంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు నరేష్. ఈ షోని తన పెళ్లి సంబంధాల కోసం వాడుకున్నాడు నరేష్. సంబంధాలు ఉంటే కచ్చితంగా చెప్పండి, కట్నాలు తీసుకోను, అమ్మాయి అడిగితే ఎదురు ఇస్తాను అని తెలిపాడు నరేష్.
ఆడపిల్ల పుట్టినా సరే, పెళ్లి కావాలి
ఈ సందర్భంగా వర్ష ఎంతుంది నరేష్ నీకు ఆస్తి అని అడగ్గా, ఆ పెద్దగా ఏం లేదని చెప్పాడు. దీనికి వర్ష స్పందిస్తూ, అబద్దాలు చెబితే ఆడపిల్లలు పుడతారని చెప్పగా, ఆ పుట్టని, ఎవరో ఒకరు పుట్టని అంటూ రియాక్ట్ కావడం నవ్వులు పూయించింది. మొత్తానికి పుట్టడం కావాలి అని వర్ష రియాక్ట్ కావడం విశేషం. నరేష్ నీ మీద నాకు చాలా నమ్మకం ఉందని వర్ష చెప్పగా, నాక్కూడా నమ్మకం ఉందని నరేష్ అన్నాడు. నాకు పెళ్లై పిల్లలు పుట్టాలనేది నా ఆశ, అదే కోరిక అని తెలిపాడు. అది నెరవేరుతుందని వర్ష చెప్పడం విశేషం. తాను కూడా అదే అనుకుంటున్నట్టు చెప్పాడు నరేష్.
అమ్మానాన్న బాగా చూసుకునే అమ్మాయి కావాలి- నరేష్
ఎలాంటి అమ్మాయి కావాలని వర్ష అడగ్గా, తనకంటే ఒక అడుగున్నర హైట్ ఉంటే చాలు, ముఖ్యంగా తన అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, తనని అర్థం చేసుకుంటే చాలు అని తెలిపాడు. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నరేష్ పెళ్లికి సంబంధించి చాలా ఆవేదన ఉందనేది ఇప్పుడు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. చాలా కాలంగా అమ్మాయిని చూస్తున్నామని చెప్పాడు. మరి ఆయన కోరిక త్వరలోనే నెరవేరాలని, పెళ్లి అయి పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.

