వయసుకన్నా గౌరవం ఇవ్వాల్సింది, లెజెండ్రీ నటిని ఆ జంతువుతో పోల్చి దారుణంగా అవమానించిన జమున
తెలుగు చిత్ర పరిశ్రమలో జమున తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగు వారికి సత్యభామ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జముననే. అంతగా జమున సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించారు.
Jamuna
తెలుగు చిత్ర పరిశ్రమలో జమున తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగు వారికి సత్యభామ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జముననే. అంతగా జమున సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆ పాత్రకి అవసరమైన గడసరి తనం జమున దగ్గర ఉంది. జమున రియల్ లైఫ్ లో కూడా ముక్కుసూటిగా ఉంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
Actress Jamuna
ఒకసారి జమున, సూర్యకాంతం, కెవి చలం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారట. జమున తన బ్యాగులో ఏదో వెతకండం మొదలుపెట్టారు. సూర్యకాంతం చూసి ఏంటి అమ్మాయ్ వెతుకుతున్నావ్ అని అడిగారట. హైదరాబాద్ లో ఒక ఏనుగు బొమ్మ కొన్నాను. అది కనిపించడం లేదు అని జమున తెలిపింది.
ఏనుగు అంటే గుర్తుకు వచ్చింది నేను ఒకసారి ఏనుగు ఎక్కాను సరదాగా అనిపించింది అంటూ సూర్యకాంతం తన అనుభవాన్ని చెప్పారట. దీనితో జమున.. సూర్యకాంతమే పెద్ద ఏనుగు అని అర్థం వచ్చేలా అవమానించారట. దానికన్నా బరువైన దానిని ఏనుగు ఎలా మోసింది.. ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటి అని సెటైర్ వేశారట. వెంటనే పక్కనే ఉన్న కెవి చలం.. ఏనుగు సంగతి పక్కన పెట్టండి.. ఇప్పుడు ఈ విమానం సంగతి ఏంటో అంటూ సూర్యకాంతం బరువుపై ఆయన కూడా సెటైర్లు వేశారు.
జమున, చలం ఇద్దరూ సరదాగా సూర్యకాంతంని ఆట పట్టించినప్పటికీ ఆమె మాత్రం బాధపడ్డారట. కనీసం తన వయసుకి కూడా మర్యాద ఇవ్వలేదని ఫీల్ అయ్యారట. కానీ జమున, సూర్యకాంతం రిలేషన్ పాడలేదు. ఆమె క్రమశిక్షణ, డబ్బుల విషయంలో జాగ్రత్త తనకి ఆదర్శం అని జమున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.