స్టార్ హీరోలని సైతం డమ్మీ పీస్ లుగా మార్చేసే హీరోయిన్లు.. ఇండస్ట్రీలో అలాంటి వారు ఎవరెవరో తెలుసా ?
టాలీవుడ్ సినిమాల్లో హీరోల డామినేషన్ ఉంటుంది. చాలా చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలో కేవలం పాటలకు మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉంటాయి. ఇలాంటి చోట కూడా హీరోలని పక్కకి నెట్టి మేమూ ఉన్నాము అంటూ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టే హీరోయిన్లు కొందరు ఉన్నారు.
టాలీవుడ్ సినిమాల్లో హీరోల డామినేషన్ ఉంటుంది. చాలా చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలో కేవలం పాటలకు మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉంటాయి. ఇలాంటి చోట కూడా హీరోలని పక్కకి నెట్టి మేమూ ఉన్నాము అంటూ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టే హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఈ హీరోయిన్లు తలుచుకుంటే స్టార్ హీరోలని సైతం తమ నటనతో డమ్మీలుగా మార్చేస్తారు. అంత ట్యాలెంట్ ఉన్న నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి :
సాయి పల్లవి అద్భుతమైన నటి. అందులో తిరుగులేదు. అదే విధంగా సాయి పల్లవి తన డ్యాన్స్ తో మైమరపించగలదు. డ్యాన్స్, నటన రెండింటిలో తిరుగులేదు అని నిరూపించుకున్న రేర్ హీరోయిన్ సాయి పల్లవి. చాలా చిత్రాల్లో సాయి పల్లవి తన పెర్ఫామెన్స్ తో హీరోలని సైతం పక్కకి నెట్టేసింది. ఫిదా, శ్యామ్ సింగ రాయ్ లాంటి చిత్రాలలో సాయి పల్లవి ఎలా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సమంత :
ప్రస్తుతం సమంత పాన్ ఇండియా స్టార్. సినిమాలు, వెబ్ సిరీస్ లతో రాణిస్తోంది. సమంతకి మంచి రోల్ పడితే తన పక్కన ఎంత పెద్ద స్టార్ ఉన్నప్పటికీ డమ్మీ అయిపోతారు. ఓ బేబీ, అ..ఆ, మజిలీ చిత్రాలతో పాటు ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
అనుష్క శెట్టి :
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి బాహుబలి లాంటి చిత్రంలో కూడా పక్కన ప్రభాస్ ని పెట్టుకుని తన మార్క్ చాటుకుంది. భాగమతి, అరుంధతి చిత్రాల్లో అనుష్క కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. అనుష్కకి కూడా మంచి రోల్ పడితే ఆమె స్టార్ హీరోలని సులభంగా డామినేట్ చేసేస్తుంది.
నిత్యా మీనన్ :
కళ్ళతోనే హావ భావాలు పలికించగల కొద్దిమంది నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల్లో నిత్యామీనన్ హీరోలని డామినేట్ చేసేలా నటించింది. నిత్యా మీనన్ మంచి సింగర్ కూడా.
విజయశాంతి :
90 వ దశకం హీరోయిన్లలో స్టార్ హీరోలని డామినేట్ చేస్తూ నటించిన వారిలో విజయశాంతి ఒకరు. ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి గుర్తింపు తెచ్చుకుంది అంటే అందుకు కారణం ఆమె పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. కానీ వారిని డామినేట్ చేసేలా సోలో హీరోయిన్ గా కూడా విజయశాంతి ఎదిగింది.
సావిత్రి :
హీరోలని డామినేట్ చేసే వారిలో పాతతరం నటీమణుల గురించి చెప్పాలంటే ముందుగా మహానటి సావిత్రి గురించే చెప్పాలి. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ, దేవదాసు లాంటి చిత్రాలు సావిత్రి నటనకు కొన్ని ఉదాహరణలు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లని సైతం డామినేట్ చేసేలా సావిత్రి చాలా చిత్రాల్లో నటనతో మెప్పించారు.