కమెడియన్ ని ప్రేమగా ఇంటికి తీసుకెళ్లిన సిల్క్ స్మిత, దెబ్బకి షాక్.. వేలకోట్ల ఆస్తి ఉన్నా సాధ్యం కాదు
సిల్క్ స్మిత వెండి తెరపై ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ఆమె జీవితం అంత విషాదకరంగా ముగిసింది. 35 ఏళ్ళ చిన్న వయసులోనే సిల్క్ స్మిత మరణించారు. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీనే.
సిల్క్ స్మిత వెండి తెరపై ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ఆమె జీవితం అంత విషాదకరంగా ముగిసింది. 35 ఏళ్ళ చిన్న వయసులోనే సిల్క్ స్మిత మరణించారు. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఒక మిస్టరీనే. వెండి తెరపై సిల్క్ స్మిత ఎలాంటి పాత్రలు చేసినా రియల్ లైఫ్ లో మాత్రం మంచి మనసున్న వ్యక్తి అట. కష్టాలు దాటుకుని సిల్క్ స్మిత గ్లామరస్ నటిగా ఎదిగింది.
తన అందంతో సౌత్ సినీ రంగాన్ని ఒక ఊపు ఊపింది. అప్పట్లోనే భారీ పారితోషికం అందుకునే నటిగా సిల్క్ స్మిత సంచలనం సృష్టించింది. చాలా మంది నటీనటులతో సిల్క్ స్మితకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె వెండి తెరపై చేసిన చేసిన పాత్రలపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. శృంగార తారగా సిల్క్ పై ముద్ర పడింది. అయితే సిల్క్ స్మిత మంచి మనసు గురించి ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Silk Smitha
ఒక రోజు చెన్నైలో షూటింగ్ జరుగుతోంది జరుగుతోంది నేను కనిపించగానే హే బాస్ ఇలా రా.. అంటూ చిలిపిగా పిలిచింది. సిల్క్ స్మితకి ఎప్పుడూ సరదాగా చిలిపిగా ఉండడం ఇష్టం. మా ఇల్లు ఇక్కడే పక్కనే. షూటింగ్ అయ్యాక వెళదాం అని చెప్పింది. షాట్ పూర్తి కాగానే బాబు మోహన్ చేయి పట్టుకుని సిల్క్ స్మిత తన ఇంటికి తీసుకెళ్ళిందట.
అప్పట్లో సిల్క్ స్మిత మంచి అవకాశాలు అందుకుంటూ ఆమె కెరీర్ పీక్ స్టేజిలో ఉంది. ఆమె ఇంటి ఎంట్రన్స్ చూడగానే బాబు మోహన్ ఆశ్చర్యపోయాడట. ఎంట్రన్స్ ఎంతో అండగా డిజైన్ చేసి ఉంది. ఇక లోపల ఇంటిని చూడగానే ఇంద్రభవనం అనే ఫీలింగ్ వచ్చిందట. వేల కోట్లు సంపాదించిన వారికి కూడా ఇంటిని అంత అందంగా పెట్టుకోవడం సాధ్యం కాదు అని బాబు మోహన్ అన్నారు.
నన్ను ప్రేమగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. తన చేత్తో కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. ఎంతో గౌరవంగా మాట్లాడింది. సిల్క్ స్మిత తాను నటించిన ముఖ్యమైన చిత్రాలలోని కాస్ట్యూమ్స్ ని ఎంతో జాగ్రత్తగా దాచుకునేది. కొన్ని డ్రెస్సులని బొమ్మలకు అలంకరించి చూసుకుంటూ మురిసిపోయేది. ఆమెకి తన వృత్తి అంటే అంత ఇష్టం అని బాబు మోహన్ అన్నారు. కానీ చిన్న వయసులోనే సిల్క్ స్మిత మరణించడం జీర్ణించుకోలేని విషాదం అని బాబు మోహన్ తెలిపారు.