పెళ్ళి చేసుకోబోతున్న జబర్థస్త్ కమెడియన్లు..? వీళ్లెప్పుడు ప్రేమలో పడ్డారంటున్న నెటిజన్లు..?
ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీ లో పెళ్ళిళ్లు ఎక్కువై పోయాయి. ఇండస్ట్రీలోనే ఎవరో ఒకరిని చూసి పెళ్ళాడుతున్నారు. ఇటు బుల్లితెరపై కాడా ఇలాంటిపెళ్లిళ్ళు పెరిగిపోయాయి. అయితే ఈ విషయంలో కొంత మంది మాత్రం ఫ్రాంక్ వీడియోలు కూడా మొదలు పెటటారు. ఇలానే ఓవీడియో చేశారు జబర్థస్త్ కమెడియన్లు తేజా, పవిత్ర.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుకు మంచి గుర్తింపు వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తెరపై స్టార్లుగా మారారు. ఈక్రమలోనే జబర్థస్త్ ద్వారా రీసెంట్ గా బాగా పాపులర్ అయ్యింది పవిత్ర. ఆమెతో పాటు అంతకు ముందు నుంచీ అభి టీమ్ లో.. తేజ కూడా బాగా పాపులర్ అయ్యాడు.
దాదాపు దశాబ్ధం కాలంగా నాన్ స్టాప్ గా టెలికాస్ట్ అవుతున్న ఈ షో అన్నీంటికంటే టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ షోద్వారా తేజ - పవిత్ర పాపులర్ అయ్యారు. ఈక్రమంలో వీరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో తెలియదు కాని... ఇద్దరు సడెన్ గా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా పాపులర్ అయిన పవిత్ర ఈ కామెడీ షోలో తన పంచులతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి. ఈ షోలోనే వారి పెళ్లి సందడికి సబంధించి అప్ డేట్ ను ఇచ్చారు ఇద్దరు.
అయితే జబర్దస్త్ పవిత్ర, తేజ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మా పెళ్లి షాపింగ్ అంటూ హెడ్డింగ్ పెట్టి, జబర్దస్త్ తేజ తో కలిసి వీడియోలో కనిపించింది. పవిత్ర మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరల కోసం షాపింగ్ చేయడం కోసం వచ్చామంటూ తేజ చెప్పగా, ఊరికే అంటూ సైగలు చేసింది పవిత్ర.
షాపింగ్ చేసినంత సేపు తన వరుస పంచులతో పవిత్రను ఓ ఆటాడుకున్నాడు తేజ. తన కామెడీతో ఎంత చిరాకు తెప్పించిన పవిత్ర ఓపికతో షాపింగ్ చేసి, తేజకు తెలియకుండా అతని కార్డుతోనే బిల్లు కట్టింది. అయితే తేజ కామెడీ, పవిత్ర రియాక్షన్స్ చూస్తే మాత్రం ఇది కేవలం ప్రమోషన్ వీడియో అని, వీరిద్దరికీ పెళ్లి అనేది నిజం కాదని అర్థమవుతుంది. దీంతో వీరిద్దరూ తీరుపై విమర్శలు చేస్తున్నారు