MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ డైరెక్టర్ తండ్రికి అవమానం, సిగరెట్ తాగాడని జబర్దస్త్ కమెడియన్ కెరీర్ నాశనం చేశారుగా..

స్టార్ డైరెక్టర్ తండ్రికి అవమానం, సిగరెట్ తాగాడని జబర్దస్త్ కమెడియన్ కెరీర్ నాశనం చేశారుగా..

జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి కెరీర్ లో కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. అందుకే చంటికి ప్రస్తుతం అంతగా అవకాశాలు రావడం లేదు. ఆ సంఘటనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 06 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జబర్దస్త్ కమెడియన్లు
Image Credit : Asianet News

జబర్దస్త్ కమెడియన్లు

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్లు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్ యాంకర్ గా, హీరోగా రాణిస్తున్నాడు. హైపర్ ఆది, గెటప్ శ్రీను కమెడియన్స్ గా రాణిస్తున్నారు. బలగం వేణు క్రేజీ డైరెక్టర్ అయ్యారు. ఇలా చాలా మంది జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో చలాకి చంటి ఒకరు. 

25
వెనుకబడిన చలాకీ చంటి
Image Credit : @ChalakiChantiOfficial

వెనుకబడిన చలాకీ చంటి

జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపుతో చంటి అనేక చిత్రాల్లో నటించారు. భీమిలి కబడ్డీ జట్టు చిత్రం చంటికి కమెడియన్ మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ షో చేస్తూ అనేక సినిమాల్లో నటించాడు. కొన్ని షోలకు యాంకర్ గా కూడా చేశారు. కానీ ఆ తర్వాత చంటి నెమ్మదిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చారు. కెరీర్ జోరు మీద ఉన్న టైంలో చంటి సడెన్ గా ఎందుకు మాయం అయ్యాడు అనే అనుమానాలు రావడం సహజం. 

Related Articles

Related image1
Ram Charan: తొలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది.. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై అబద్దాలు, చిరంజీవి ఏం చేశారంటే
Related image2
OTT Movies: చిరంజీవి, ప్రభాస్ లలో ఈసారి పైచేయి ఎవరిది.. ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు, ఏది ఎక్కడ చూడాలంటే
35
డైరెక్టర్ తో క్లోజ్ గా..
Image Credit : @ChalakiChantiOfficial

డైరెక్టర్ తో క్లోజ్ గా..

దీనికి కారణాలు చెబుతూ చంటి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఆర్టిస్ట్ ని పక్కన పెట్టడానికి ఇండస్ట్రీలో పెద్దగా కారణాలు అవసరం లేదు. ఒక సారి ఓ దర్శకుడు నన్ను చంటి భయ్యా అని పిలిచారు. ఆ డైరెక్టర్ పలకరించినప్పుడు మనం కూడా తిరిగి పలకరించడం సంస్కారం. అందుకే నేను కూడా ఎలా ఉన్నారు భయ్యా అని అడిగా. నన్ను భయ్యా అనాల్సిన అవసరం లేదు. పేరు పెట్టి పిలవొచ్చు అని చెప్పారు. దీనితో నేను ఆ డైరెక్టర్ ని పేరు పెట్టి పిలిచేవాడిని. 

45
ఆయన పక్కన సిగరెట్ తాగా
Image Credit : @ChalakiChantiOfficial

ఆయన పక్కన సిగరెట్ తాగా

కానీ అది ఆ డైరెక్టర్ చుట్టుపక్కల ఉన్నవారికి నచ్చేది కాదు. కానీ ఆ డైరెక్టర్ నాతో ఏం మాట్లాడారో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి నేను నచ్చలేదు కాబట్టి ఏదో విధంగా సినిమాలోనుంచి తొలగించారు. ఇంకొక ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఒక సినిమా షూటింగ్ లో ఓ వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తి సిగరెట్ తాగుతున్నారు. అతడికి కాస్త దూరంలో నేను కూడా సిగరెట్ తాగుతున్నా. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కట్ చేస్తే ఆ వ్యక్తి డైరెక్టర్ కి తండ్రి అట. 

55
సినిమాలో నుంచి తీసేశారు
Image Credit : Asianet News

సినిమాలో నుంచి తీసేశారు

ఆయనెవరో తెలియకపోవడం వల్లే ఆ పక్కన నేను సిగరెట్ తాగాను. ఆయనేం తన మెడలో నేను డైరెక్టర్ తండ్రి అని బోర్డు వేసుకోలేదు కదా. నేను సిగరెట్ తాగినందుకు ఆ వ్యక్తి హర్ట్ అయ్యారు. నా పక్కనే సిగరెట్ తాగుతున్నాడు వీడేం ఆర్టిస్ట్ అని కంప్లైంట్ చేశాడు. దీనితో నన్ను సినిమా నుంచి తీసేశారు. ఇలాంటి సంఘటనలు తన కెరీర్ లో చాలా జరిగాయి అని చలాకి చంటి తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika: దేశ వ్యాప్తంగా అన్నదానం, స్వీట్ల పంపిణి.. అభిమానులకు విజయ్‌ దేవరకొండ, రష్మిక సర్‌ప్రైజ్‌
Recommended image2
Renu Desai: రాత్రికి రేటెంతా అని అడుగుతున్నారు, ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ రేణు దేశాయ్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
నిర్మాతలది మామూలు ధైర్యం కాదు, మెగా హీరో మూవీ క్లైమాక్స్ కోసం 20 కోట్ల బడ్జెట్.. మహాభారతాన్ని తలపించేలా
Related Stories
Recommended image1
Ram Charan: తొలి దెబ్బ చాలా గట్టిగా తగిలింది.. రాంచరణ్ పర్సనల్ లైఫ్ పై అబద్దాలు, చిరంజీవి ఏం చేశారంటే
Recommended image2
OTT Movies: చిరంజీవి, ప్రభాస్ లలో ఈసారి పైచేయి ఎవరిది.. ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు, ఏది ఎక్కడ చూడాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved