- Home
- Entertainment
- OTT Movies: చిరంజీవి, ప్రభాస్ లలో ఈసారి పైచేయి ఎవరిది.. ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు, ఏది ఎక్కడ చూడాలంటే
OTT Movies: చిరంజీవి, ప్రభాస్ లలో ఈసారి పైచేయి ఎవరిది.. ఓటీటీలోకి సంక్రాంతి సినిమాలు, ఏది ఎక్కడ చూడాలంటే
సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు సంక్రాంతికి పోటీ పడ్డ హీరోలంతా తమ సినిమాలతో ఓటీటీలో సందడి చేయబోతున్నారు.

సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్ వివరాలు
సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు కొన్ని సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. సంక్రాంతి పోటీ ముగిసింది. ఇప్పుడు ఈ చిత్రాలన్నీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు కూడా ఫిక్స్ అయ్యాయి. ఏ సినీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది ? రిలీజ్ ఎప్పుడు ? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నారీ నారీ నడుమ మురారి
శర్వానంద్ హీరోగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. హీరో తన గత ప్రేమని, బ్రేకప్ వ్యవహారాన్ని దాచిపెట్టి మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో శర్వానంద్, హీరోయిన్లతో పాటు నరేష్ కామెడీ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సంక్రాంతి సినిమాలలో చివరగా థియేటర్స్ లో రిలీజైన మూవీ ఇదే. కానీ ఓటీటీలోకి అన్నింటికంటే ముందుగా వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 4
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో (ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది)
ది రాజా సాబ్
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ చూపించబోతున్నారు అంటూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్స్ లో ఆడియన్స్ కి నిరాశ తప్పలేదు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 9న థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ నెలరోజుల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజు అంటే ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఓటీటీ లో అయినా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతుందేమో చూడాలి.
ఓటీటీ రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 6 (ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది)
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహారాజ్ రవితేజ తనలోని మాస్ ని పక్కన పెట్టి నటించిన చిత్రం ఇది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ మూవీలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 13 నుంచి జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఓటీటీ రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 13 (అంచనా)
ఎందులో చూడాలి : జీ 5
అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి, క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన రావలసి ఉంది.
ఓటీటీ రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 13 (అంచనా)
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన సునామీతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీలో వింటేజ్ మెగాస్టార్ ని ప్రెజెంట్ చేశారు. నయనతార హీరోయిన్. విక్టరీ వెంకటేష్ చివర్లో గెస్ట్ రోల్ లో సందడి చేశారు. ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయితే చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11 నుంచి మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 11
ఎక్కడ చూడాలి : జీ 5

