MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'సిగరెట్ తాగుతూ స్టైల్‌గా..! ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్న రజినీకాంత్..'

'సిగరెట్ తాగుతూ స్టైల్‌గా..! ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్న రజినీకాంత్..'

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్ ఆరంభంలో 'అంతులేని కథ' చిత్రంలో ఒక్క సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్నారట. అప్పట్లో ఒక తాగుబోతు అన్నయ్య పాత్రలో ఆయన పడిన కష్టం 

2 Min read
Author : Pavithra D
Published : Mar 02 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రజినీకాంత్ కెరీర్‌లో బిగ్ ఛాలెంజ్
Image Credit : Rajinikanth\Instagram

రజినీకాంత్ కెరీర్‌లో బిగ్ ఛాలెంజ్

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఆయన కెరీర్ తొలినాళ్లలో ఒక సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు. 1976లో వచ్చిన క్లాసిక్ మూవీ 'అంతులేని కథ' షూటింగ్ సమయంలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటనను నిర్మాత జి.వి. నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తాగుబోతు అన్నయ్య పాత్ర
Image Credit : instagram

తాగుబోతు అన్నయ్య పాత్ర

ఈ చిత్రంలో రజినీకాంత్ ఒక తాగుబోతు, బాధ్యత లేని జులాయి అన్నయ్య పాత్రలో నటించారు. ఈ పాత్రలో ఆయన న్యాచురల్ యాక్టింగ్ చేశారు. అల్లరి, చెల్లెలు(జయప్రద), ఇంట్లోని మిగిలిన వారిని ఇబ్బంది పెట్టే పాత్రలో రక్తికట్టించారు. అయితే, ఒక సింగిల్ షాట్ చిత్రీకరణ సమయంలో రజినీకాంత్ తీవ్రమైన సవాలును ఎదుర్కొన్నారు.

35
50 టేక్‌ల వెనుక కథ
Image Credit : instagram

50 టేక్‌ల వెనుక కథ

చిత్రంలోని పాపులర్ సాంగ్ “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి” సమయంలో ఒక సీన్ ఉంటుంది. రజినీకాంత్ రోడ్డు మీద పాట పాడుతూ వస్తుంటే, సరిత కిటికీ కర్టెన్‌ను వేసి.. మళ్లీ తీస్తూ ఉంటుంది. అదే సమయంలో రజినీకాంత్ సిగరెట్ తాగుతూ ఒక నిర్దిష్టమైన హావభావాలను పలికించాలి. ఈ షాట్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం దర్శకుడు కె. బాలచందర్ రజినీకాంత్‌తో దాదాపు 50 టేక్‌లు చేయించారట. "మొదట్లో రజినీకాంత్ చేయలేనని చెప్పారు, కానీ బాలచందర్ పట్టువదలలేదు. ఆయన నటులకు చేసి చూపించకుండా, వారి లోపల ఉన్న నటుడిని బయటకు తెస్తారు" అని నారాయణరావు గుర్తు చేసుకున్నారు.

45
బాలచందర్ మార్కు డైరెక్షన్
Image Credit : Rajinikanth\Instagram

బాలచందర్ మార్కు డైరెక్షన్

రజినీకాంత్ సిగరెట్ ఎగరేసే స్టైల్, మాస్ ఇమేజ్ వెనుక బాలచందర్ శిక్షణ ఎంతో ఉందని నారాయణరావు తెలిపారు. జయప్రదతో రజినీకాంత్ చేసే గొడవలు, సొంత కొడుకు ముఖం మీద ఉమ్మేసే దృశ్యం లాంటివి ఒక నటుడిగా రజినీకాంత్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రజినీకాంత్ జయప్రదను “పౌడర్లు రాసుకుని సాని దానలా వెళ్తున్నావా” అని తిట్టినప్పుడు ఆమె ఇచ్చే సమాధానం ఈ చిత్రంలోని హైలైట్ అని చెప్పుకొచ్చారు.

55
కష్టం, పట్టుదల..
Image Credit : Rajinikanth\Instagram

కష్టం, పట్టుదల..

అంతులేని కథ రజినీకాంత్ సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిందని.. ఆ కష్టం, పట్టుదలే నేడు ఆయనను ఈ స్థాయికి చేర్చాయని నిర్మాత నారాయణరావు అభిప్రాయపడ్డారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved