- Home
- Entertainment
- ఇండియా రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
ఇండియా రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
భారతదేశంలోని టాప్ 10 సంపన్న తారల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో హీరోలే ఆధిపత్యం చెలాయించారు. ఒకే ఒక్క నటి మాత్రమే ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. టాప్ 10 రిచ్చ్ నటులతో తెలుగు వారు ఎంత మంది?

టాప్ 10 సంపన్న తారలు
సినిమా ప్రపంచం అంటేనే తారలకు డబ్బులు కురిపించే ప్రదేశం. ఇతర రంగాలతో పోలిస్తే జీతాల విషయంలో సినీ పరిశ్రమ ముందుంది. ప్రకటనలు, ఇతర వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం కూడా సినీ తారలను గొప్ప సంపన్నులుగా మారుస్తోంది. సొంత నిర్మాణ సంస్థలు ఉన్న తారలు కూడా భారతదేశంలో చాలా మంది ఉన్నారు. అంతే కాదు ఏ హీరో ఆస్తి ఎంత? ఎవరు ఎక్కువగా సంపాదిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవం కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
చాలా కాలం నుంచి మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్
భారతీయ తారలలో షారుఖ్ ఖాన్ అత్యంత ధనవంతుడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆస్తి 7300 కోట్లు అని ఐఎండిబి రిపోర్ట్ లు చెబుతున్నాయి. షారుఖ్ ఖాన్ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సహ యజమాని కూడా. ఐపీఎల్‌లో అతని భాగస్వామ్యమే మిగతా వారి కంటే బాలీవుడ్ నటుడి సంపద పెరగడానికి ప్రధాన కారణం. షారుఖ్‌కు సొంతంగా ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. షారుఖ్ ఒక్కో సినిమాకు రూ.250 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం.
వరుసగా బాలీవుడ్ తారలదే పై చేయి..
సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఆస్తి విలువలో భారతీయ తారలలో షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ.6270 కోట్లు. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆస్తి విలువలో మూడో స్థానంలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ రూ.5900 కోట్లు.
టాప్ 10 లో ఏకైక సంపన్న నటి
ఆస్తి విలువలో నాలుగో స్థానంలో ఎవరున్నారో తెలిస్తే సినీ అభిమానులు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం సినిమాల్లో అంతగా యాక్టివ్‌గా లేని నటి జూహీ చావ్లా నాలుగో స్థానంలో ఉంది. జూహీ చావ్లా నికర ఆస్తుల విలువ రూ.4600 కోట్లు. నటనతో పాటు, జూహీకి అనేక ఆదాయ మార్గాలు ఉండటం ఆమెను ఆస్తి విలువలో అగ్రస్థానానికి చేర్చింది.
షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని రెడ్ చిల్లీస్ గ్రూప్‌కు జూహీ సహ వ్యవస్థాపకురాలు. షారుఖ్‌తో పాటు ఐపీఎల్ క్రికెట్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆమె సహ యజమాని కూడా. జూహీ రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. భారతదేశపు అత్యంత సంపన్న నటి అనే ఘనత కూడా జూహీ చావ్లాకే దక్కుతుంది.
తెలుగు హీరోలు ఎంత మంది?
ఐదో స్థానంలో హృతిక్ రోషన్ ఉన్నాడు. హృతిక్ రోషన్ నికర ఆస్తుల విలువ రూ.4500 కోట్లు. ఆరో స్థానంలో నటుడు, నిర్మాత అక్షయ్ కుమార్ ఉన్నాడు. అక్షయ్ కుమార్ నికర ఆస్తుల విలువ రూ.4000 కోట్లు. ఏడో స్థానంలో నటుడు, నిర్మాత, దర్శకుడు అజయ్ దేవగన్ ఉన్నాడు. అజయ్ దేవగన్ నికర ఆస్తుల విలువ రూ.3850 కోట్లు.
ఎనిమిదో స్థానంలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఉన్నాడు. అమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ.3200 కోట్లు. తొమ్మిదో స్థానంలో ఓ సౌత్ ఇండియన్ స్టార్ హీరో ఉన్నాడు. తొమ్మిదో స్థానంలో ఉన్న చిరంజీవి నికర ఆస్తుల విలువ రూ.3000 కోట్లు. పదో స్థానంలో ఉన్న సౌత్ ఇండియన్ నటుడు నాగార్జున అక్కినేని నికర ఆస్తుల విలువ రూ.2200 కోట్లుగా తెలుస్తోంది.

