- Home
- Entertainment
- Gossips
- మహేష్ బాబు ను హీరోయిన్ ఎంగిలి తాగమన్న దర్శకుడు, కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్..
మహేష్ బాబు ను హీరోయిన్ ఎంగిలి తాగమన్న దర్శకుడు, కోపంతో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సూపర్ స్టార్..
మహేష్ బాబు చాలా కూల్ గా ఉంటాడు, పెద్దగా మాట్లాడడు. కానీ కోపం వస్తే మాత్రం అది వేరే లెవల్ ఉంటుందట. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్ డైరెక్టర్ పై అలిగి షూటింగ్ నుంచి వెళ్లిపోయాడట మహేష్. కారణం ఏంటో తెలుసా? అసలు నిజమెంత?

డిసిప్లిన్ ఉన్న నటుడు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆడియన్స్ కు బాగా తెలిసిన విషయం ఏమిటంటే.. ఆయన చాలా కూల్, డిసిప్లిన్ ఉన్న నటుడు. రీసెంట్ గా రాజమౌళి కూడా వారణాసి షూటింగ్ లో ఈ విషయం వెల్లడించాడు. షూటింగ్ సమయంలో వివాదాలకు దూరంగా ఉంటూ, తన పనిపై మాత్రమే దృష్టి పెడతాడని, ఫోన్ కూడా దగ్గరకు రావివ్వడని రాజమౌళి అన్నాడు. ఇండస్ట్రీలో కూడా మహేష్ కు అదే పేరు ఉంది. అయితే ఒక సందర్భంలో మాత్రం మహేష్ బాబు ఓ దర్శకుడిపై తీవ్రంగా కోపగించుకున్నారట. అంతేకాదు, షూటింగ్ మధ్యలోనే అలిగి బయటకు వెళ్లిపోయారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? కారణం ఏంటి..? ఆ దర్శకుడు ఎవరు..?
సూపర్ స్టార్ వారసుడిగా ఎంట్రీ
కృష్ణ గారి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. హీరోగా మాత్రం 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అదే సినిమాలో బాలీవుడ్ నటి ప్రీతీ జింటా హీరోయిన్‌గా నటించారు.
డైరెక్టర్ పై అలిగి, షూటింగ్ నుంచి వెళ్లిపోయిన మహేష్
అయితే రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ తీయ్యడంలో రాఘవేంద్రరావుది స్పెషల్ మార్క.. అదే శైలిలో ‘రాజకుమారుడు’ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్‌ను రూపొందించాలనుకున్నారు. అందులో భాగంగా ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు పెట్టి, మహేష్ బాబు, ప్రీతీ జింటా కలిసి తాగాలని సూచించారట. ఈ సీన్ ను మహేష్ బాబు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారట. హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్‌ను తాను తాగాలా అంటూ దర్శకుడు రాఘవేంద్రరావుపై కోపగించుకున్నారని సమాచారం. అంతటితో ఆగకుండా, షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారట.
దర్శకుడితో ఉన్నచనువు కారణంగా..
అయితే ఈ కోపానికి కారణం దర్శకుడితో ఉన్న చనువే అని చెబుతారు. మహేష్ బాబు, రాఘవేంద్రరావును మావయ్య అని పిలుస్తారట. ఆ సన్నిహిత సంబంధం వల్లే మహేష్ బాబు తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా ఒక సందర్భంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే ఆ సీన్ ను రెండు సెపరేట్ షాట్స్ తీసినట్టు తెలుస్తోంది. సినిమాల్లో ఒకే కూల్ డ్రింక్, రెండు స్ట్రాలు పెట్టినట్టు చూపించినా.. అది వారు తాగరు. కానీ మహేష్ మాత్రం నిజంగా తాగాలేమో అనికుని అలిగారట. సూపర్ స్టార్ కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఈ సంఘట.. నిజమా కాదా తెలియదు కానీ... సోషల్ మీడియాలో మాత్రం గతంలో వైరల్ అయ్యింది.
వారణాసి బిజీలో మహేష్ బాబు..
ఇక కెరీర్ విషయానికి వస్తే, మహేష్ బాబు గెలుపోటములు లెక్కచేయకుండా ముందుకు సాగుతూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా, ఆ తర్వాత హిట్ల బాట పట్టారు. ప్రస్తుతం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ, కథ , దర్శకుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా చేస్తున్నాడు మహేష్. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈసినిమా లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

