- Home
- Entertainment
- రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
ఎన్నెన్నో ఊహించుకున్న ప్రభాప్ అభిమాను నిరాశకు గురిచేసింది ది రాజాసాబ్ మూవీ. ప్రభాస్ ఎందుకు ఈ సినిమా చేశాడా అని డార్లింగ్స్ అనుకునేలా ఉంది. అయితే ప్రభాస్ కంటేముందు ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోలు తప్పించుకున్నారని మీకు తెలుసా?

రాజాసాబ్ సినిమాతో నిరాశలో ఫ్యాన్స్..
ప్రభాస్ హైట్, వెయిట్, ఇమేజ్, టోటల్ కటౌట్ కు సూట్ అయ్యేలా లేదు రాజాసాబ్ మూవీ. ఈసినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను రాజాసాబ్ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ఇలాంటి సినిమా చేశాడేంటి అనుకునేలా ఉంది. ప్రభాస్ తో కొత్త కాన్సెప్ట్ ను ట్రై చేసి.. అభిమానులకు కాస్త చేంజ్ ఓవర్ ఇవ్వాలని అనుకున్నాడు మారుతి.
కానీ అతని ప్రయోగం బెడిసికొట్టింది. సినిమా కు ప్లాప్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం భారీ నష్టాలు అయితే రావు అని తెలుస్తోంది. ఆయన నటించిన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన చాలా సినిమాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. రాజాసాబ్ కూడా ఇప్పటికే 200 కోట్ల మార్క్ కలెక్షన్స్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.
స్టార్ డైరెక్టర్లను పక్కన పెట్టి..
ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ప్రభాస్‌తో సినిమా చేయడానికి క్యూ కడితే.. వారందరిని కాదని.. మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. అప్పుడే అభిమానులు మారుతితో పాన్ఇండియా సినిమా ఎలా సాధ్యం అని అన్నారు. రకరకాల ప్రశ్నలు ఎప్పటి నుంచో ఎదురయ్యాయి. రాజాసాబ్ టీజర్, ట్రైలర్ , ప్రభాస్ లుక్స్ చూసి..మారుతి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.
ది రాజాసాబ్ రిలీజ్ తరువాత.. అందులో ప్రభాస్ తప్పించి ఇంకేమి లేదని అర్ధం అయ్యింది. ప్రభాస్ వన్ మ్యాన్ షో తప్పించి.. వేరే ఏమీ కనిపించలేదు. ప్రభాస్ మాత్రం సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.. మిగతా అంతా తుస్సుమనిపించింది. మరీ ముఖ్యంగా కథ, స్క్రీన్‌ప్లే పరంగా పెద్దగా మెప్పించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజా సాబ్ ను మిస్ అయిన ఇద్దరు హీరోలు ..
ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఎందుకు చేశావు డార్లింగ్ అని అడుగుతున్నారు.. అయితే ప్రభాస్ కంటే ముందు ఈసినిమా చేయకుండా ఇద్దరు హీరోలు తప్పించుకున్నారని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దర్శకుడు మారుతి ఈ కథను మొదట నేచురల్ స్టార్ నానితో చేయాలని అనుకున్నాడట.అందుకు తగ్గట్టుగానే కథను రెడీ చేసుకున్నాడట.
నాని, మారుతి కాంబినేషన్ లో భలే బలే మగాడివోయ్ సినిమా వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ.. యావరేజ్ గా ఆడింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది. నానితో రాజాసాబ్ చేద్దాం అనుకుంటే.. అతను ఈ కథ తనకు సూట్ అవ్వదు అనిచెప్పేశాడట.
రాజాసాబ్ ను తప్పిచుకున్న మరో హీరో
నానితో వర్కౌట్ అవ్వకపోవడంతో తమిళ స్టార్ హీరో సూర్య తో ఈమూవీని చేయాలని ప్రయత్నించాడట మారుతి. కానీ సూర్యకు ఈ కథను వినిపించే అవకాశం రాలేదని తెలుస్తోంది. ఒకవేళ వినిపించి ఉంటే ఆయన ఓకే చేసేవాడా లేక రిజెక్ట్ చేసేవాడా అనే విషయం తెలియదు. అలా ఇద్దరు హీరోలు మిస్ అయిన రాజాసాబ్ కథను.. ప్రభాస్ ఒకే చేశాడు. ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో మారుతి ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. ప్రభాస్‌కు వినిపించి సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడు సినిమా డివైడ్ టాక్ రావడంతో, మొదట మారుతి అనుకున్న హీరోలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకున్నారని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

