- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం
Illu Illalu Pillalu Today Episode March 2: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతి నర్మదను నోటికొచ్చినట్టు తిడుతుంది. నర్మద, సాగర్ ను కొడుతుంది. దీనివల్ల రామరాజు కుటుంబం ముక్కలవతుుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

విశ్వకు ఉరి వేసిన అమూల్య
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రసాదరావు రామరాజుని అవమానిస్తాడు. పిలవని పేరంటానికి రావడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటాడు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అరుస్తాడు. రామరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని వెంటే కొడుకులు కోడలు కూడా వెళ్ళిపోతారు. ఇదంతా లైవ్ లో చూసిన భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఆనందంతో పొంగిపోతారు. వల్లి ఆ ఫోన్ లైవ్ ఆపేసి.. అందరూ ఇంటికి వచ్చేస్తున్నాము అని తల్లిదండ్రులుకు చెప్పి బయలుదేరుతుంది. ఇంటి దగ్గర ఇడ్లీ బాబాయ్, భాగ్యం ఆ గొడవను లైవ్ లో చూశాక ఆనందంతో డాన్సులు వేస్తారు.ఇక్కడి నుంచి సీన్ విశ్వక్ దగ్గరికి మారుతుంది. విశ్వక్ స్నేహితులతో కలిసి తాగుతూ ఉంటాడు. అమూల్య గురించి స్నేహితులతో మాట్లాడుతాడు. అమూల్య రాక్షసిని తలుచుకుంటే తాగినదంతా దిగిపోతోంది. నేను దాని జీవితంతో ఆడుకున్నట్టు లేదు అదే నా జీవితంతో ఆడుకుంటున్నట్టు ఉంది అని చెబుతాడు.
అప్పుడు స్నేహితులు విశ్వక్ ను మరింత రెచ్చగొడతారు. నువ్వు ఆడపిల్లకు భయపడడం ఏంటి? నీలో ఉన్న పౌరుషాన్ని బయటకు తీయరా, నువ్వంటే దడ దడ లాడిపోవాలి అమూల్య.. అని చెబుతారు. దాంతో విశ్వక్ కోపంగా లేచి ఈరోజు ఈ రాత్రి అమూల్యకు నాలో ఉన్న మగాడిని చూపిస్తా అంటూ ఆవేశంగా ఇంటికి వెళ్తాడు. గదిలో అమూల్య నిద్రపోతూ ఉంటుంది. అమూల్యను టచ్ చేయబోతాడు ఈలోపు అమూల్యకు తెలివి వచ్చి విశ్వక్ ను తోసేస్తుంది. చివరికి అమూల్యను గట్టిగా పట్టుకొని గోడకు నొక్కేస్తాడు. కోపంలో అమూల్య అతడిని తన్నరానిచోట తంతుంది. దీంతో విశ్వక్ బాధతో మంచం మీద పడిపోతాడు. దీంతో ఒక చున్ని తీసి మెడకు కట్టి ఉరి వేసేందుకు ప్రయత్నిస్తుంది అమూల్య. ఇంకోసారి తన జోలికి వస్తే చంపేస్తానని బెదిరించి వదిలేస్తుంది. దాంతో విశ్వక్ భయంతో గదిలోంచి బయటికి పారిపోతాడు.
రామరాజు ఇంట్లో రచ్చ
ఇక్కడ నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. రామరాజు కుర్చీలో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భాగ్యం చిచ్చు పెట్టేందుకు మాట్లాడుతూ ‘అదికాదు సాగర్.. నువ్వు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించావని చెబితే చాలా సంతోష పడిపోయాం, కానీ డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నావా? అది కూడా వనజ ఇచ్చిన డబ్బుతో కొన్నావా? ఆ డబ్బులు తిరిగిచ్చేయడం కోసం నర్మద నగలు తాకట్టు పెట్టడమేమిటి’ అని మరింతగా రెచ్చగొడతారు. ‘అంటే నర్మద పుట్టినట్టు వాళ్ళు కూడా వచ్చేసి మీ నాన్నగారు చొక్కాను చించేసి అవమానించాలని అనుకుంటున్నారా?’ అని అంటుంది భాగ్యం. నర్మద మధ్యలో అడ్డుకుంటుంది.. ‘పిన్ని ఇది మీకు సంబంధం లేని విషయం మీరు మాట్లాడకండి’ అని అంటుంది.
ఈలోపు వేదవతి గట్టిగా ‘తప్పేముంది.. వాళ్ళు మాట్లాడే దాంట్లో తప్పేముంది? ఇందాక మీ నాన్న మాట్లాడింది కూడా అదే కదా... కోడలు నగలు తాకట్టు పెట్టి కొడుక్కి ఉద్యోగం కొనే దుస్థితికి ఈయన దిగజారిపోయారని మీ నాన్న నీచంగా మాట్లాడలేదా? ఆ వనజ వచ్చి డబ్బులు కోసం గొడవ చేస్తుంటే వీడు ఆ డబ్బులతో ఉద్యోగం కొన్న విషయం తెలిసి కూడా దొంగలా ఏమీ తెలియనట్టు నటించలేదా? నువ్వు కూడా అమాయకంగా నటించలేదా?’ అని అంటుంది వేదవతి. దాంతో నర్మద ఏడుస్తూ ‘మీ అబ్బాయి నాతో కూడా ఏమి చెప్పలేదు. డబ్బుతో కొన్న విషయం కూడా నాకు చెప్పలేదు’ అని అంటుంది. అయినా వేదవతి ఎంతకీ నమ్మదు. ఇంతవరకు నువ్వు నన్ను వెర్రి బాగుల దాన్ని చేసి ఆడించింది సరిపోలేదా? ఇంకా ఇంకా పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావా? నీ నాటకాలు ఆపవే, నీ నగలు తాకట్టు పెట్టి వనజ వాళ్లకి డబ్బులు ఎందుకు ఇచ్చావే.. అని గట్టిగా అరుస్తుంది.
నర్మదా మాట్లాడుతూ ‘నేను ఈయన భార్యను కాబట్టి అన్ని విషయాలను నాకు తెలిసి ఉంటాయని మీరు అనుమానించడంలో తప్పులేదు. ఈరోజు మీకు తెలిస్తే నాకు నిన్న తెలిసింది అంతే తేడా.అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా నాకు ముందే తెలియదు అత్తయ్య’అని నర్మద చెబుతుంది. అయినా కూడా వేదవతి వినకుండా ‘నటించింది చాలు నీకు నిన్న తెలిసిన వెంటనే నాకు చెప్పాలి కదా.. అంతేతప్ప మీ తప్పు బయట పడకుండా ఉండడం కోసం అప్పటికప్పుడు నగలు తాకట్టు పెట్టవు’ అని నోటికి వచ్చినట్టు తిడుతుంది. అదంతా చూసి వల్లి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది.
రైస్ మిల్లు డబ్బులు కొట్టేశాడని తిట్లు
నర్మద మాట్లాడుతూ ‘మీ అబ్బాయి భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే ఏం చేయాలో తెలియక నా నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను.. అంతే తప్ప వనజ గారు డబ్బులతో ఆయన జాబ్ కొన్న విషయం నిజంగా నాకు తెలియదు’ అని చెబుతుంది. దానికి సాగర్ కూడా అవునమ్మా నర్మది చెప్పింది నిజం నేను జాబ్ కొన్న విషయం తనకు తెలియదు, నా భార్యను అనవసరంగా మాటలు అనకండి అని అంటాడు. దాంతో కోపంతో వేదవతి సాగర్ ని చెంపమీద కొడుతుంది. అది చూసి వల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం ఆనందంతో పొంగిపోతారు. వేదవతి కోపంతో నువ్వు నీ భార్య కలిసి ఘనకార్యం చేశారు, మీ నాన్న పరువు తగలబెట్టారు, నువ్వు అమాయకుడి అనుకున్నాను కానీ వేరే వాళ్ళ డబ్బులు కొట్టేసి ఉద్యోగం కొనుక్కొని చాలు తెలివితేటలు ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది వేదవతి.
ఈ లోపు వల్లి వచ్చి గొడవను మరింత పెద్దగా చేస్తుంది. ‘అత్తయ్య గారు ఉద్యోగం 20 లక్షలు పెట్టి కొనలేదు, పాతిక లక్షలు పెట్టి కొన్నారు. 20 లక్షలు వనజ గారివి, మరి పైన ఐదు లక్షల సమకూర్చుకోవడానికి పాపం సాగర్ మరిది గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో’ అని నాటకాలు ఆడుతుంది వల్లి. దాంతో రైస్ మిల్లులో డబ్బులు వాడినట్టు విషయం కూడా బయటపడిపోతుంది. దానితో వల్లి తన భర్తను రెచ్చగొడుతుంది. రైస్ మిల్లు బాధ్యత నీదే కదా నువ్వే మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు చందు ముందుకు వచ్చి తమ్ముడిని తిడతాడు.
నర్మదపై చేయిచేసుకున్న వేదవతి
రామరాజు ‘స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు’ అంటూ సాగర్ ను నానా తిట్లు తిడతాడు. ‘కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే అది నీకు గర్వంగాను చూసే వారికి గౌరవంగాను ఉంటుంది. ఇలా డబ్బులతో ఉద్యోగం కొనుక్కుంటే జనాలంతా ఏమనుకుంటారో తెలుసా? డబ్బులతో ఉద్యోగం కొన్నవాడు ఆ డబ్బులు వెనకేసుకోవడానికి లంచాలు తీసుకుంటాడని కూడా అంటారు. ఇప్పటికే రామరాజు దొంగ, మోసగాడు అనే బిరుదు ఉంది. ఇప్పుడు లంచగొండి అని బిరుదు కూడా తెప్పిస్తావా? నిన్ను కన్న పాపానికి ఈ తండ్రికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా? నా కొడుకు కూలి పని చేసుకుని బతికినా కూడా నాకు ఇష్టమే ఇలా లంచంతో ఉద్యోగం తెచ్చుకుని ఆ డబ్బుతో బతికితే నాకు అంతకన్నా అవమానం ఉండదు. కాబట్టి అవి ఉద్యోగం మానేయ్’ అని చెబుతాడు రామరాజు. దానికి సాగర్ షాక్ అవుతాడు. తాను ఆ ఉద్యోగం మానలేనని చెబుతాడు సాగర్. అది విని అందరూ ఆశ్చర్యపడతారు. ‘
మీరు ఏమైనా అనుకోండి నాన్న.. నేను మాత్రం మా ఉద్యోగం మానేయను అని కచ్చితంగా చెప్పేస్తాడు సాగర్. దీంతో వేదవతి మీ నాన్నకి ఎదురు చెప్తావా అని కొట్టబోతుంది. అప్పుడు నర్మద వచ్చి అడ్డుకుంటుంది. ‘ఆగండి అత్తయ్యా.. ఆయనతో నేను మాట్లాడతాను. ఆయన ఒప్పించి ఈ జాబు మానిపించేలా నేను చేస్తాను. దయచేసి ఈ విషయం నాకు వదిలేయండి’ అని అంటుంది. దానికి వేదవతి అసలు ఇదంతా నీ వల్లే కదే అంటూ నర్మదను కొడుతుంది వేదవతి. అది చూసి వల్లి ఎంతో ఆనందపడుతుంది. సాగర్ కోపంగా నా భార్యను కొడతావేంటి అని అడుగుతాడు. ‘అసలు నీకు ఉద్యోగం చేయాలన్న ఆలోచన బుర్రలోకి రావడానికి, డబ్బులు కొట్టేసే స్థాయికి నువ్వు దిగజారడానికి.. అన్నింటికీ ఈ మహాతల్లి,ఆమె నాన్నే కదా కారణం’ అని అంటుంది. దానికి సాగర్ తల్లిని ఎదిరిస్తాడు.
‘కాసేపు తనే నన్ను జాబ్ చేయమని అడిగింది అనుకుందాం.. ఒకవేళ అడిగిందే అనుకో అందులో తప్పేముంది. తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి తన భర్త కూడా ఉద్యోగం చేస్తుందని కోరుకోవడంలో తప్పేముంది. నా భార్య ని అర్థం చేసుకోకుండా మాట్లాడడమే.. కాకుండా భార్య మీద చేయి చేసుకుంటారా’ అని అడుగుతాడు సాగర్. దానికి వేదవతి చాలా ఫీల్ అవుతుంది. భార్య మీద అంత ప్రేమ పెరిగిందా? కన్నవాళ్ళు అంతా లోకువైపోయారా అంటుంది వేదవతి. దాంతో సాగర్ కోపంగా అమ్మ నీకు దండం పెడతాను ఆపు.. మీ బాధనే మీరు కరెక్ట్ అని మాట్లాడుతున్నారు తప్ప నా బాధను మాత్రం అర్థం చేసుకోవట్లేదు అని అంటాడు సాగర్. దాంతో ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సాగర్, నర్మదను తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయినట్టు చూపిస్తారు. దీన్ని బట్టి రామరాజు కుటుంబం ముక్కలైనట్టే.

