- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 9: సక్సెస్‌ఫుల్‌గా పెళ్లిచూపులు చెడగొట్టేసిన భాగ్యం, వల్లి
Illu Illalu Pillalu Today Episode Jan 9: సక్సెస్‌ఫుల్‌గా పెళ్లిచూపులు చెడగొట్టేసిన భాగ్యం, వల్లి
Illu Illalu Pillalu Today Episode Jan 9: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అమూల్య పెళ్లి చూపుల్లో కామాక్షిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు పెళ్ళికొడుకు. దీంతో రామరాజు వారిని పంపించేస్తాడు. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

పెళ్లి చూపులు ఫెయిల్
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య పెళ్లిచూపులు జరుగుతూ ఉంటాయి. భాగ్యం, వల్లీ కలిసి ప్లాన్ చేసి కామాక్షిని అందంగా రెడీ చేసి పెళ్లికూతురులా కనిపించేలా చేస్తారు. దీంతో పెళ్లి కొడుకు కామాక్షినే పెళ్లికూతురు అనుకొని ఆ అమ్మాయి నాకు చాలా నచ్చిందని, పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. రామరాజు కూడా కోప్పడతాడు. కామాక్షికి పెళ్లి అయి ఒక కూతురు ఉందని చెబుతారు. పెళ్ళికొడుకు తల్లి తన కొడుకు పొరపాటు పడ్డాడని, మీ చిన్నమ్మాయి మాకు బాగా నచ్చిందని పెళ్లి చేసుకుంటామని అడుగుతుంది. దానికి రామరాజు కోప్పడి ఇంట్లోంచి బయటికి పొండి అని అరుస్తాడు. దీంతో వారు బయటకు వెళ్ళిపోతారు. తాము వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వడంతో వల్లి, భాగ్యం చాలా సంతోషపడతారు. పెళ్లిచూపులను చెడగొట్టి విశ్వక్ బారి నుంచి తప్పించుకున్నామని ఆనందపడతారు. వేదవతి చాలా బాధపడుతూ మొదటి పెళ్లి చూపులే ఇలా అయ్యాయి, మా ఇంటి మీద ఏ దిష్టి పడిందో ఏంటో అని అంటుంది.
అందరూ వెళ్లిపోయాక హాల్లో వల్లీ, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ మిగులుతారు. ముగ్గురూ కలిసి ఆనందంలో తేలిపోతారు. విశ్వక్ ఏం జరిగిందోనని బయటే ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక బయటికి వెళ్లి భాగ్యం, ఇడ్లీ బాబాయి, వల్లి వచ్చి విశ్వక్ కు సైగలు చేసి పెళ్లిచూపులు చెడగొట్టామని చెబుతారు. దాంతో విశ్వక్ ఆనందపడతాడు.
తిరుపతి స్వప్నసుందరి
ఇక పెళ్లిచూపుల్లో అలా జరగడంతో రామరాజు కుటుంబమంతా కూర్చుని బాధపడుతూ ఉంటారు. ప్రేమ మాట్లాడుతూ ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఎందుకలా ప్రవర్తించారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. సాగర్ తనకు కొట్టాలనంత కోపం వచ్చిందని అంటాడు. ఈలోపు ఏవో శబ్దాలు వారికి పాటలు వినిపిస్తూ ఉంటాయి. అది ఎవరా అని చూస్తూ వెతుక్కుంటూ వెళ్తారు. తిరుపతి తన స్వప్న సుందరితో మాట్లాడుతూ ఫోన్లో పాటలు పాడుతూ ఉంటాడు.
స్వప్న సుందర్ని తన కళ్ళ ముందుకు రమ్మని అడుగుతాడు తిరుపతి. స్వప్న సుందరి వస్తానని చెబుతుంది. దీంతో ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా సాగర్ ధీరజ్, ప్రేమ, వల్లి అందరూ వింటారు. తిరుపతితో నీ స్వప్న సుందరిని మేము కూడా చూస్తాము, ఒకసారి రమ్మని పిలవమని చెబుతారు. తిరుపతి అదే విషయాన్ని స్వప్న సుందరికి చెబుతాడు. ఒక అమ్మాయి ముసుగు వేసుకొని అక్కడికి వస్తుంది. ఆ ముసుగు తీసి ముఖం చూపించమని అడుగుతారు ధీరజ్, సాగర్, పెద్దోడు. తిరుపతి తన స్వప్న సుందరి ముసుగుని తానే తీస్తానని ఆ ముఖాన్ని నేనే చూస్తానని అంటాడు. కానీ తీసేలోపే ఆ అమ్మాయి పారిపోతుంది. మనం పట్టుకోడానికి అందరూ పరిగెడతారు. ఆమెను పట్టుకుంటారు. తిరుపతి మెల్లగా ముసుగు తీసి ఆమె ముఖాన్ని చూస్తాడు. ఇక్కడితో ఆగిపోతుంది.
అమూల్యకు కొత్త సంబంధం
ఇకనుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. రామరాజు సేనాపతి కుటుంబంతో అమూల్య విషయంలో జరిగిన గొడవను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది. ‘నా చిన్న కూతురు పెళ్లి గురించి ఎంత అనుకున్నానో. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వైభవంగా దాని పెళ్లి చేయాలనుకున్నాను. కానీ దాని పెళ్లి గురించే ఇప్పుడు నేను భయపడుతున్నాను. జరుగుతున్నవన్నీ చూస్తుంటే నా కూతురు వెనక ఏదో జరుగుతున్నట్టు, దాని జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది. కూతురు పెళ్లి అంటే ఏ తండ్రికైనా మనసులో సంతోషం ఉంటుంది. కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కూడా ఒక గండంలా తయారయింది’ అని బాధపడుతూ ఉంటాడు.
వేదవతి రామరాజుని ఊరుకోబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని చెబుతుంది. అప్పుడు వేదవతి ‘ఒకసారి మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చి మీ చిన్నమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగారు కదా, అప్పుడు మనము చదువుకుంటుంది వద్దని చెప్పాము కదా ఆ సంబంధం మళ్ళీ అడిగితే బాగుంటుంది ’ అని సలహా ఇస్తుంది. దానికి రామరాజు పెళ్లి సంబంధం అడిగేందుకు ఒప్పుకుంటాడు.
సీక్రెట్ గా కలిసిన విశ్వక్, అమూల్య
ఇక ఇక్కడి నుంచి సీన్ అమూల్య, విశ్వక్ దగ్గరికి మారుతుంది. వారిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అమూల్య మాట్లాడుతూ పెళ్లిచూపులు టెన్షన్ ఇంకా తగ్గలేదు. పెళ్లిచూపులు చెడిపోయాయి కనుక సరిపోయింది లేకుంటే ఆ సంబంధం కుదురుంటే నాకు భయమేస్తుంది అని అంటుంది. అప్పుడు విశ్వక్ మీ వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నేను ఇలాగే చెడగొడతాను. ఎందుకంటే నువ్వు లేకుండా బతకడం నావల్ల కాదు, నువ్వు పెళ్లి పీటల మీద కూర్చున్నా సరే అక్కడినుంచి నీ మెడలో తాళి కడతాను అని అంటాడు విశ్వక్. అమూల్య ఆ మాటలు నిజమేనని నమ్మి సంతోషిస్తుంది అక్కడి నుంచి అమూల్య వెళ్ళిపోతుంది.
ఇక ఇక్కడి నుంచి సీను ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ ధీరజ్ ను తనతో మాట్లాడేలా చేయడం కోసం అతని షర్టు, వాచ్, ఫోన్ వంటివి దాచేస్తుంది. ధీరజ్ తన తల్లిని తన వస్తువుల గురించి అడుగుతాడు. ఈ లోపు నర్మదా వచ్చి అత్తయ్య గారు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు తనకి ఏంం అవసరం వచ్చినా తన భార్యను అడుగుతాడు లెండి అని చెబుతుంది. వేదవతికి విషయం అర్థమై కామ్ గా ఊరుకుంటుంది. ధీరజ్ బయటకు వచ్చేసరికి ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ తన వస్తువులు దాయడం చూసి ఈ పనులన్నీ చేసింది ఇదా అనుకుంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

