- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 8: పెళ్లిచూపుల్లో తికమక.. అమూల్యకు బదులు కామాక్షిని చూపించిన వల్లీ, భాగ్యం
Illu Illalu Pillalu Today Episode Jan 8: పెళ్లిచూపుల్లో తికమక.. అమూల్యకు బదులు కామాక్షిని చూపించిన వల్లీ, భాగ్యం
Illu Illalu Pillalu Today Episode Jan 8: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో అమూల్యకు పెళ్లిచూపులు జరుగుతాయి. కానీ పెళ్లికూతురు విషయంలో వల్లి, భాగ్యం ప్లాన్ వేస్తారు. అమూల్యకు బదులు కామాక్షిని చూపిస్తారు. అసలేం జరిగిందో తెలుసుకోండి.

ఊహల్లో ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఒకవైపు అమూల్య పెళ్లి చూపులకు ఇల్లు సిద్ధమవుతూ ఉంటే తాను మాత్రం ధీరజ్‌తో పెళ్లిచూపులు చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుంది. సేనాపతి కుటుంబం, రామరాజు కుటుంబం కలిసి కనిపిస్తారు. రామరాజు కుటుంబం పెళ్లి చూపులకు సేనాపతి ఇంటికి వస్తారు. ప్రేమ తను ఏ పని చేయనని, అన్ని పనులు ధీరజ్ చేయాలని కండిషన్ పెడుతుంది. దానికి కూడా ధీరజ్ ఒప్పుకొని పెళ్లి చేసుకోమని తన వెంట పడుతున్నట్టు ఊహించుకుంటుంది ప్రేమ. ఈ ఊహలే చాలాసేపు ఎపిసోడ్ లో నడుస్తాయి.
ఇక కాసేపటికి నిజంలోకి వచ్చేస్తుంది ప్రేమ. తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంటే.. పక్కనున్న నర్మద ఎందుకలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. దానికి ప్రేమ నాకు ధీరజ్ కు పెళ్లి చూపులు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను అని చెబుతుంది. ఆ విషయం ధీరజ్ విని తిట్టుకుంటాడు.
కామాక్షిని రెచ్చగొట్టిన భాగ్యం, వల్లీ
ఇక వల్లి.. కామాక్షిని తీసుకుని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. ఈ లోపు భాగ్యం, ఇడ్లీ బాబాయి ఎదురొచ్చి కామాక్షిని మరింతగా రెచ్చగొడతారు. పక్కకు తీసుకెళ్లి నువ్వు మీ నాన్నతో కాదు, మీ అమ్మ వేదవతితో మాట్లాడు, ఏది తేల్చుకోవాలనుకున్న తల్లి దగ్గరే తేల్చుకో అని రెచ్చగొట్టి పంపిస్తుంది. మరోపక్క వేదవతి అమూల్యను రెడీ చేస్తుంది. అమూల్యతో మాట్లాడుతూ ‘కన్నవాళ్ళు ఏం చేసినా ఏ నిర్ణయాలు తీసుకున్నా అది పిల్లల మంచి కోసం, జీవితాంతం సంతోషంగా ఉండడం కోసమే. మేము తీసుకున్న ఈ నిర్ణయం కూడా నువ్వు బాగుండాలనే. మనసులో పిచ్చిపిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా నోరు మూసుకొని పెళ్లి చేసుకో. నువ్వు, నేను అందరం ప్రశాంతంగా ఉంటాం’ అంటుంది వేదవతి.
ఈలోపు కామాక్షి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. నువ్వు ఎప్పుడు వచ్చావే అని అడుగుతుంది వేదవతి. ‘నీ పెద్ద కూతురు లేదనుకుంటున్నావా? లేక పోయిందనుకుంటున్నావా? నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నన్ను పిలవకుండా నా చెల్లెలికి పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తావా?’ అని అడుగుతుంది.
దానికి వేదవతి ‘నిన్ను పిలవాలనే ఉంటుంది. కానీ వచ్చినప్పుడు కట్నాలు కానుకలు అని చంపుకు తింటావు. ఎక్కడా లేని విధంగా అక్కకు కట్నం ఇవ్వాలని పెళ్లి వాళ్ళని అడిగావ్ అనుకో.. వాళ్ల ముందు మా పరువు పోతుంది. అందుకే పిలవలేదు’ అని గట్టిగానే సమాధానం చెబుతుంది వేదవతి. దానికి కామాక్షి తెగ బాధ పడిపోతూ ‘కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తుందని కన్న కూతురిని పిలవకుండా ఉంటావా, నీకు కూతురు కన్నా డబ్బులే ఎక్కువ అయిపోయాయా, నీకు కూతురే వద్దనుకున్నప్పుడు నాకు అమ్మే అక్కరలేదు ఇంకోసారి నేను ఇంట్లో అడుగుపెడితే చెప్పుతో కొట్టు’ అని పొగరుగా వెళ్ళిపోతుంది.
ఇంట్లోంచి ఏడుచుకుంటూ వస్తున్న కామాక్షిని చూసి భాగ్యం ఆపుతుంది. అందరూ కలిసి కామాక్షికి లేనిపోని విషయాలన్నీ చెప్పి రెచ్చగొడుతూ ఉంటారు. ఇలా పెళ్లి చూపులప్పుడు నువ్వు అలిగిపోతే, నిన్ను పెళ్లికి కూడా పిలవరు, అప్పుడు పట్టు చీరలు నగలు కూడా కొనరు అని అంటుంది. మళ్ళీ దాంతో కామాక్షి నిజమే అనేసి మళ్లీ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది.
వల్లి, భాగ్యం వరస్ట్ ప్లాన్
వేదవతి ‘అలిగి వెళ్లిపోయావుగా మళ్లీ ఎందుకు వచ్చావు’ అని అడుగుతుంది. దానికి కామాక్షి ‘నా పుట్టిల్లు నా ఇష్టం నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఆ హక్కు అధికారం నాకు ఉన్నాయి. నా చెల్లిని నేను రెడీ చేస్తాను కానీ నువ్వు బయటికి వెళ్ళు’ అని అంటుంది. దీంతో వేదవతి బయటికి వెళ్లిపోతుంది. ఈ లోపు కామాక్షి అమూల్యతో మాట్లాడుతూ ‘నువ్వయినా అక్కకి కట్నం ఇవ్వమని చెప్పొచ్చు కదా. అయినా నీకు ఇంత త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేశారేంటి? నువ్వు చదువుకుంటున్నావు కదా’ అంటుంది.
ఈలోపు భాగ్యం, వల్లి కూడా అక్కడికి వచ్చేస్తారు. కామాక్షితో మాట్లాడుతూ నిన్ను కూడా బాగా మేము రెడీ చేస్తాము కూర్చో అని చెప్పి ఆమెకు బాగా మేకప్ చేస్తారు. వాళ్లు అమూల్యకు బదులు కామాక్షిని పెళ్లి కూతురిగా చూపించాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా అమూల్యను వల్లి, కామాక్షి తీసుకొస్తారు. అయితే మధ్యలో అమూల్యను వదిలేసి కామాక్షి చేయి పట్టుకొంటుంది వల్లి. అమూల్య, వల్లి మధ్యలో కామాక్షి ఉండడంతో ఆమెనే పెళ్లికూతురు అనుకుంటాడు పెళ్ళికొడుకు.
కామాక్షిని చూసి మైమరచిపోయిన పెళ్లి కొడుకు
పెళ్ళికొడుకు కామాక్షిని చూసి మైమరిచిపోతూ ఉంటాడు అమ్మాయి చాలా అందంగా ఉంది అని పొగుడుతూ ఉంటాడు. సన్నజాజి తీగలా ఉందని అంటాడు. అమూల్య బొద్దుగా ఉంటుంది కాబట్టి అలా అంటున్నాడేంటని అందరూ ఆశ్చర్యపడతారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఏం చదువుకున్నారు అని అడుగుతాడు. కానీ అమూల్య సమాధానం చెప్పదు. కానీ కామాక్షి నీ తరఫున నేను చెబుతాలే అని చెప్పి డిగ్రీ అండి అని అంటుంది. పెళ్ళికొడుకు కామాక్షి పెళ్లికూతురని ఫిక్స్ అయిపోతాడు. అమూల్య తరపున కామాక్షి మాట్లాడేస్తూ ఉంటుంది. పెళ్ళికొడుకు ఏది అడిగినా కూడా కామాక్షినే సమాధానం చెబుతుండడంతో ఇక ఆమెనే పెళ్లికూతురని ఫిక్స్ అయిపోతాడు పెళ్లి కొడుకు.
వేదవతి కామాక్షిని వంటగదిలో కూల్ డ్రింకులు ఉన్నాయి వెళ్లి తీసుకురమ్మని చెబుతుంది. కామాక్షి వెళ్లగానే పెళ్ళికొడుకు అలా కామాక్షి వైపే చూస్తూ ఉంటాడు. దాంతో నర్మద, ప్రేమ మిగతా వారికి కూడా సందేహం వస్తుంది. కామాక్షి కూల్ డ్రింకులు పట్టుకుని వస్తుంది. అమూల్యను ఆ కూల్ డ్రింకులు అందరికీ ఇమ్మని చెబుతాడు రామరాజు. అయితే పెళ్లికొడుకు కామాక్షిని ఇస్తే బాగుంటుంది, కాబోయే భార్య చేతితో అందుకోవాలని ఉంటుంది కదా అంటాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇదంతా చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయ్ , వల్లి మాత్రం ఆనందంతో నవ్వుకుంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

