- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 7: రామరాజు పెద్ద కూతురు కామాక్షి ఎంట్రీ, ప్రేమ ఇంట్లో పెళ్లిచూపులు
Illu Illalu Pillalu Today Episode Jan 7: రామరాజు పెద్ద కూతురు కామాక్షి ఎంట్రీ, ప్రేమ ఇంట్లో పెళ్లిచూపులు
Illu Illalu Pillalu Today Episode Jan 7: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అమూల్యను చూసుకునేందుకు పెళ్లి వారు వస్తారు. వల్లి రామరాజు పెద్ద కూతురు కామాక్షి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడండి.

రామరాజు ఇంటికి పెళ్లివారు
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో పెళ్లివారికి లేనిపోనివి అమూల్య మీద చెప్పేస్తారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్. ఇంటి దగ్గర శ్రీవల్లి ఇక పెళ్లి వారు రారని సంతోషంగా ఉంటుంది. ఈలోపు పెళ్లి వారు కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. పెళ్లి వారిని ఇంట్లోకి తీసుకువెళ్తారు రామరాజు, అతని ముగ్గురు కొడుకులు. ఈ లోపు భాగ్యం, ఇడ్లీ బాబాయి కూడా ఇంటికి వస్తారు. దీంతో వల్లి వారిని పక్కకు తీసుకెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది. అప్పుడు భాగ్యం అమూల్యకు లవ్ స్టోరీ ఉందని, అతనితో లేచిపోతుందని అన్ని విషయాలు చెప్పాము. అయినా సరే వారు వచ్చారు అని చెబుతుంది భాగ్యం. అసలు ఏం జరిగిందో చెబుతుంది భాగ్యం. తాము అంతా చెప్పిన తర్వాత ఆ వ్యక్తికి చెవుడని తెలిసినట్టు వివరిస్తుంది. ఆ పెద్దమనిషి వాళ్ళ భార్యకు చెబుదామంటే అప్పుడే ధీరజ్, ప్రేమ బైక్ మీద వస్తూ కనిపించారని.. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయామని వల్లికి చెబుతుంది భాగ్యం. దీంతో వల్లి బాధతో ఏడుస్తుంది.
భాగ్యం కొత్త ప్లాన్
వల్లి తన తల్లిదండ్రులను బాగా తిడుతుంది. చిన్న పని కూడా చేయలేకపోయారు అని అంటుంది. పెళ్లిచూపులు ఆపకపోతే ఆ బండోడు నా పేరు ఎక్కడ బయటపెడతాడేమోనని భయంతో చచ్చిపోతున్నానని అంటుంది. ఈలోపు విశ్వక్ ఆ ఇంటి మేడ మీద నుంచి వీరిని పిలుస్తాడు. అమూల్య కూడా కిటికీలోంచి వల్లిని సైగలు చేసి పిలుస్తుంది. వల్లి కిటికీ దగ్గరికి వెళ్లి ఏమిటని అడుగుతుంది. అప్పుడు విశ్వక్ లైన్లో ఉన్నాడు.. నువ్వే మాట్లాడు అని వల్లికి ఇస్తుంది ఫోన్. వల్లితో విశ్వక్ అక్కడ పెళ్లి చూపులు మీరు ఆపి తీరాలి.. లేదంటే మీ ఇంట్లోకి వినబడేలా మా ప్రేమకు నువ్వే రాయబారి అని చెప్పేస్తా అని బెదిరిస్తారు. ఏదో ఒకటి చేస్తానని చెప్పి వల్లి ఫోన్ పెట్టేస్తుంది. వల్లి తన తల్లిదండ్రులు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడో ఆ విషయాలు వారికి చెబుతుంది. ఈ లోపు భాగ్యం.. రామరాజు పెద్ద కూతురు కామాక్షి వచ్చిందా అని అడుగుతుంది. ఆమె రాలేదని చెబుతుంది వల్లి. ఇప్పుడు కామాక్షిని ఉపయోగించే పెళ్లిచూపులు చెడగొట్టాలని భాగ్యం ప్లాన్ చెబుతుంది. కామాక్షిని అడ్డుపెట్టుకొని పెళ్లిచూపులు చెడగొట్టడానికి ప్లాన్ మొదలు పెడతారు.
కామాక్షిని పిలిచిన వల్లి
ఇక్కడి నుంచి సీన్ కామాక్షి దగ్గరికి మారుతుంది. కామాక్షి తన భర్తను పదివేల రూపాయలు పట్టుచీరకి ఇవ్వమని అడుగుతుంది. అతను డబ్బులు లేవని చెప్పడంతో గొడవలు పడుతుంది. ఈ లోపు కామాక్షి దగ్గరికి వల్లి వస్తుంది. వల్లి ‘కామాక్షి ఇక్కడ పదివేల కోసం గొడవలు పడుతున్నావ్. అక్కడ నీకు రావాల్సిన లక్షల లక్షల పోతున్నాయి. మీ పుట్టింట్లో శుభకార్యం జరుగుతుంటే నువ్వు అక్కడ ఉండాలా? వద్దా? మీ చెల్లికి పెళ్లిచూపులు’ అని చెబుతుంది. దీంతో కామాక్షి షాక్ అవుతుంది. మా చెల్లికి పెళ్లిచూపులు అవుతుంటే నన్ను పిలవకుండా పరాయిదానిలా దూరం పెడతారా అంటూ కామాక్షి కోప్పడుతుంది. పట్టు చీరలు, నగలు పెట్టాల్సి వస్తుందని, అవన్నీ ప్రేమా నర్మదా లాగేసుకుందామని వారే పిలవకుండా అడ్డుపడ్డారు... అని లేనిపోని గొడవలు పెడుతుంది వల్లి. కామాక్షి ఆ విషయాలన్నీ నమ్మేస్తుంది.
ప్రేమ పెళ్లిచూపులు
ఇక రామరాజు ఇంట్లో పెళ్లిచూపులు జరుగుతూ ఉంటాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ఏం అడిగినా కూడా పెళ్లి కొడుకు తండ్రి నవ్వుతూనే ఉంటాడు. అతనికి చెవుడని తర్వాత తెలుస్తుంది. తర్వాత అమూల్యను తీసుకొని వచ్చేందుకు వేదవతి వెళ్లిపోతుంది. ఈలోపు ప్రేమ ఊహల్లో తేలిపోతుంది. ధీరజ్ తన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినట్టు ఊహించుకుంటుంది. ప్రేమ ఊహల్లోనే చాలాసేపు ఉండిపోతుంది. ఆ పెళ్లి చూపుల్లో ధీరజ్ అమ్మాయిని చూపించమని అడుగుతాడు. ప్రేమ అందంగా తయారై మెట్ల మీద నుంచి దిగి వస్తుంది. వెనుక నుంచి ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేస్తారు. ఇక ప్రేమ ఆధునిక అమ్మాయిలాగా పెళ్లి చూపుల్లో మాట్లాడుతుంది. ఇలా ఊహల్లోనే ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది.

