- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 6: అమూల్య పెళ్లివారికి ప్రేమ విషయం చెప్పేసిన భాగ్యం బ్యాచ్
Illu Illalu Pillalu Today Episode Jan 6: అమూల్య పెళ్లివారికి ప్రేమ విషయం చెప్పేసిన భాగ్యం బ్యాచ్
Illu Illalu Pillalu Today Episode Jan 6: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ గిల్లికజ్జాలు పడతారు. మరోపక్క భాగ్యం, ఇడ్లీ బాబాయ్ అమూల్యపెళ్లివారికి ప్రేమ విషయం చెప్పేస్తారు.ఇక ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

తిరుపతి స్వప్నసుందరి ఎవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో తిరుపతి స్వప్న సుందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు అక్కడికి సాగర్, ధీరజ్, పెద్దోడు వచ్చి ఆమెను ఎలాగైనా చూడాలని రమ్మని చెప్పమని అంటారు. దానికి తిరుపతి స్వప్న సుందరితో ఎలాగైనా నిన్ను ఈ రోజు నేను చూడాలని పట్టుబడతాడు. దాంతో ఆమె సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేయమని చెబుతుంది. ఇక్కడ నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ.. ధీరజ్ ను ఎలాగైనా మాట్లాడించాలని అనుకుంటుంది. ధీరజ్ ఫోన్ చూసుకుంటూ ఉంటే పక్కన కూర్చోవడానికి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధీరజ్ ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడు.
దీంతో ప్రేమ రామరాజుని మావయ్య మావయ్య అంటూ పిలుస్తుంది. రామరాజు వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. తనను పట్టించుకోవడంలేదని, మాట వినడం లేదని చెబుతుంది. పెళ్లి వాళ్ల కోసం స్వీట్లు తేవడానికి నేనొక్కదాన్నే వెళ్తున్నాను.. తోడుగా రమ్మని పిలిస్తే రావడం లేదు అని అంటుంది. వెంటనే రామరాజు ‘బుద్ధుందా నీకు.. తను ఒక్కతే వెళ్తుంటే తోడు వెళ్లాలన్న జ్ఞానం లేకుండా.. రానంటావా? ప్రేమను తీసుకొని సీట్లకు వెళ్ళు’ అని ధీరజ్ కు చెప్పి పంపిస్తాడు.
ప్రేమ, ధీరజ్ స్వీట్ గొడవలు
ప్రేమ, ధీరజ్ కలిసి స్వీట్ల కోసం బయలుదేరుతారు. బండి వెనక కూర్చున్న ప్రేమ మాట్లాడించేందుకు ప్రయత్నిస్తుంది. ధీరజ్ మాత్రం పట్టించుకోడు. భుజం మీద చెయ్యి వేస్తే.. భుజం మీద చెయ్యి తీయమని చెబుతాడు. దాంతో నడుము పట్టుకుంటుంది ప్రేమ. ఈలోపు బైక్ ఆగిపోతుంది. అందులో పెట్రోల్ అయిపోవడంతో ప్రేమను బండి దిగమని అంటాడు ధీరజ్. బండి మీద నుంచి దిగేందుకు ప్రేమ ఇష్టపడదు. దీంతో ఆ బండిని అలాగే తోసుకుంటూ పెట్రోల్ బంక్ వరకు వెళ్తాడు. అక్కడ ధీరజ్ పర్సును తీసేసుకుంటుంది ప్రేమ. పెట్రోల్ బంక్ వాడికి ప్రేమే డబ్బులు ఇచ్చి బైక్ తీసుకొని బయలుదేరుతుంది.
ధీరజ్ కోపంతో నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ బైక్ డ్రైవ్ చేస్తూ ధీరజ్ ని కూడా దారిలో ఎక్కించుకొని డ్రైవ్ చేస్తుంది. స్వీట్ షాప్ దగ్గర ఒక మోతీచూర్ లడ్డు తీసుకుని ధీరజ్ నోట్లో కుక్కేస్తుంది. దీంతో ధీరజ్... ప్రేమను చూసి తిడతాడు. ప్రేమ మాత్రం ఎన్నయినా తిట్టమని అలా తనతో మాట్లాడితే చాలని చెబుతుంది. వీళ్ళిద్దరి గిల్లికజ్జాలతోనే ఈరోజు ఎపిసోడ్ చాలావరకు ముగిసిపోతుంది.
పెళ్లివారికి అమూల్య గురించి చెప్పేసిన భాగ్యం
ఇక ఇక్కడి నుంచి సీన్ భాగ్యం, ఇడ్లీ బాబాయి దగ్గరికి మారుతుంది. ఇద్దరూ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు. పెళ్లి వారొచ్చే కారుకి వారు అడ్డంగా వస్తారు. ముఖానికి స్కార్ఫులు కట్టుకొని పెళ్లి చెడగొట్టేందుకు సిద్ధమవుతారు. కార్ లోంచి ఒక పెద్దాయన దిగి ఎందుకు కారు ఆపారని అడుగుతారు. దానికి భాగ్యం ‘రామరాజు గారి ఇంటికి మీరేనా పెళ్లిచూపులుకు వెళ్తున్నారు? పెళ్లి సంబంధం చూసుకునే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలని తెలియదా’ అని అంటుంది భాగ్యం.
‘ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్లే ముందు అమ్మాయి ఎలాంటిది, ఆమెకి లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. రామరాజు కూతురు ఒక వ్యక్తితో ప్రేమలో పడి తేలుతోంది. అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రేమ విషయంలోనే మొన్న పెద్ద గొడవ అయింది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఆ పిల్లకి పెళ్లి చేయడం కోసం మీ సంబంధం చూసినట్టున్నారు’ అని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఏవేవో చెబుతారు. అవన్నీ ఆ పెద్ద వ్యక్తి జాగ్రత్తగా వింటాడు.
ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ స్వీట్లు పట్టుకొని ఇంటికి వస్తారు. పెళ్లికి ఎన్ని ఏర్పాట్లు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. వల్లి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. రామరాజు, పెద్దోడు పెళ్లి వారి కోసం బయట ఎదురుచూస్తూ ఉంటారు. రామరాజు పెళ్లివాళ్ళు ఇంకా రాలేదని కంగారు పడిపోతూ ఉంటాడు. ఒకపక్క వల్లి మాత్రం ఆనందంతో మా అమ్మ నాన్న పెళ్లి వారిని ఆపేసినట్టున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోపు పెళ్లి కారు వచ్చి రామరాజు ఇంటి ముందు ఆగుతుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది. నేటితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

