- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Jan 5: అమూల్య పెళ్లిచూపులు చెడగొట్టేందుకు ప్లాన్, వల్లిపైనే భారం
Illu Illalu Pillalu Today Episode Jan 5: అమూల్య పెళ్లిచూపులు చెడగొట్టేందుకు ప్లాన్, వల్లిపైనే భారం
llu Illalu Pillalu Today Episode Jan 5: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అంత్యాక్షరి ప్రోగ్రాం కాసేపు జరుగుతుంది. అమూల్య పెళ్లి చెడగొట్టే బాధ్యత వల్లికే ఇచ్చాడు విశ్వక్. ఇంకా ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

పొమ్మన్నా కూడా ఇంటికి వచ్చిన భాగ్యం జంట
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎసిపోడ్లో శ్రీవల్లి పెద్ద కోడలుగా ఇంట్లో ఆనందాన్ని నింపే బాధ్యత తనదేనంటూ అంత్యాక్షరి ప్రోగ్రాం పెడుతుంది. రామరాజు ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంటాడు. ఒక్కొక్కరూ ఒక్కో చీటీ తీసి అందులో ఉన్న అక్షరం ఏది వస్తే దాంతో పాటలు పాడి కాసేపు సరదాగా గడుపుతారు. ఈరోజు సగం ఎపిసోడ్ రకరకాల పాటలతోనే గడిచిపోతుంది. ఈ పాటల మధ్యలోనే ప్రేమ, ధీరజ్ పై తన ప్రేమను చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ధీరజ్ అవకాశం ఇవ్వడు.
ఈ లోపు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఎంట్రీ ఇస్తారు. వారిని చూసి శ్రీవల్లి చాలా షాక్ అవుతుంది. శ్రీవల్లి అమ్మ నాన్న ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దానికి భాగ్యం అమూల్యకు పెళ్లిచూపులు ఉన్నాయని నువ్వే కదా పిలిచావు అని అంటుంది. రామరాజుతో మాట్లాడుతూ ‘అన్నయ్య గారు మీరు పిలవకపోయినా మాకు ప్రేమ ఉంది కాబట్టి వచ్చేసాము. మీరు బిజీగా ఉండి మమ్మల్ని పిలవలేకపోయి ఉంటారు’ అని అంటుంది భాగ్యం. దానికి రామరాజు పెళ్లి చూపులే కదా అని ఎవరిని పిలవలేదు, మర్చిపోవడం ఏమీ లేదని చెబుతాడు.
అమూల్య పెళ్లి చెడగొట్టేందుకు ప్లాన్
ఈలోపు శ్రీవల్లి మా అమ్మానాన్నలతో మనస్పూర్తిగా మాట్లాడి చాలా రోజులు అయింది. కాసేపు బయట మాట్లాడి వస్తానని చెబుతుంది. దాంతో ముగ్గురూ పెరట్లోకి వెళతారు. మీకు అసలు బుద్ధుందా? కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? అమూల్య పెళ్లి అయ్యేంతవరకు మీ ఇద్దరినీ కంటికి కనిపించదు అని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చారు. అని అడుగుతుంది శ్రీవల్లి. దానికి భాగ్యం అక్కడ చూడు అంటూ విశ్వక్ ను చూపిస్తుంది. విశ్వక్ ఎదురింటి మేడ మీద నుంచి చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో భాగ్యం వల్లికి వివరిస్తుంది. భాగ్యం, ఇడ్లీ బాబాబ్ పారిపోతూ ఉంటే ఎదురుగా విశ్వక్ వస్తాడు.
విశ్వక్ మాట్లాడుతూ ఊరొదిలి పారిపోతున్నారా? మిమ్మల్ని పైకి పంపించేస్తా? మిమ్మల్ని రౌడీలతో కొట్టించమంటారా? పోలీసులకు చెప్పి అరెస్టు చేయించమంటారా? లేక ఎవరితోనైనా చంపించేయమంటారా అని వారిని బెదిరిస్తాడు. దీంతో ఇడ్లీ బాబాయి, భాగ్యం చాలా భయపడిపోతారు. తరువాత విశ్వకు అమూల్య పెళ్లిచూపులు చెడగొట్టి, ఆమె పెళ్లి జరగకుండా అడ్డుకుంటే వదిలేస్తానని అంటాడు. అందుకే తాము తిరిగి వచ్చామని వల్లికి చెబుతారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్.
స్వప్న సుందరితో ఫోన్ కాల్
అదంతా విని శ్రీవల్లికి కంగారు పెరిగిపోతుంది. దీంతో భాగ్యం ఈ పెళ్లిచూపులు ఎలాగైనా ఆపాలని చెబుతుంది. దాంతో శ్రీవల్లి ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. రామరాజుకి పెళ్లి వారు ఫోన్ చేసి తాము బయలుదేరినట్టు చెబుతారు. పావుగంటలో వచ్చేస్తామని అంటారు. ఇక తిరుపతి తన స్వప్న సుందరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అతడిని చూసి ముగ్గురు మేనల్లుళ్లు నవ్వుకుంటూ ఉంటారు. ఆ స్వప్న సుందరిని నువ్వు నేరుగా చూశావా అని అడుగుతాడు పెద్దోడు. తిరుపతి చూడలేదని కేవలం తన నడుము చూసే ప్రేమలో పడిపోయానని చెబుతాడు. దానికి సాగర్ ఎందుకైనా మంచిది, ముఖం చూడమని చెబుతాడు. దాంతో తిరుపతి స్వప్న సుందరిని నీ ముఖం చూపించవా అని అడుగుతాడు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

