- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Illu Illalu Pillalu Today Episode Dec 24: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో అమూల్య, విశ్వ ప్రేమ విషయం నర్మద, ధీరజ్, ప్రేమలకు తెలిసిపోతుంది. ధీరజ్ కోపంతో విశ్వక్ ను, ప్రేమను కొడతాడు. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి.

తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చిన వల్లి
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి ఇంగ్లీష్ టీచర్ గా క్లాసులోకి ఎంట్రీ ఇస్తుంది. పిల్లలందరూ ఇంగ్లీషులో మాట్లాడమని అడిగినా కూడా మాట్లాడలేక పోతుంది. పిల్లలు ఏదో ఒక పాఠం చెప్పమని అడుగుతారు. దానితో తనకొచ్చిన ట్వింకిల్ ట్రింకిల్ లిటిల్ స్టార్ ఒక్కటే చెబుతుంది. దానికి పిల్లలు అది ఎప్పుడో మేము నర్సరీలోనే నేర్చుకున్నామని చెబుతారు. ఈ లోపు ఒక అమ్మాయి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ డౌట్ అడుగుతుంది. ఆ డౌట్ చెప్పలేక వల్లి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన భాగ్యం, ఇడ్లీ బాబాయి ఉంటారు. భాగ్యం ఉద్యోగం ఎలా ఉంది? జీతం ఎంత మాట్లాడావు? నాకు అందులో సగం ఇస్తావా? అని అడుగుతుంది.
దీంతో వల్లికి కోపం వచ్చి అమ్మ నాన్నను కొట్టేందుకు పరిగెడుతుంది. ఇక కాసేపు ఈ ఫన్నీ సీన్ అయ్యాక ముగ్గురు ఒకచోట కూర్చుంటారు. తన బాధలన్నీ తల్లిదండ్రులకి చెబుతుంది వల్లి. ప్రేమ, నర్మద నన్ను ఇరికించేసారని బాధపడుతుంది. మధ్యలో భాగ్యం మాట్లాడుతూ ఆ విశ్వక్ గాడు రౌడీలను పంపించి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడని అంటుంది. భాగ్యం దీంతో వల్లికి ఇంకా చిరాకు వస్తుంది. నా టెన్షన్ లో నేను ఉంటే మీ గోల నాకెందుకు అని అంటుంది. మీ ఇద్దరూ నా దగ్గరికి రాకండి, నా బతుకు నేను బతుకుతాను, ఇక నా విషయంలో మీరు జోక్యం చేసుకోకండి అని చెప్పేస్తుంది. దానికి భాగ్యం సరేనని చెప్పి మరి పది లక్షలు విశ్వ కి ఎలా ఇవ్వడం అని అడుగుతుంది? వల్లి కోపంతో అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళుతుంది.
వల్లికి కొత్త తలనొప్పి
ఈలోపు వల్లి దగ్గరికి విశ్వక్ వస్తాడు. విశ్వక్ ను చూడగానే చిరాకు పడుతుంది వల్లి. ఈలోపు విశ్వక్ మాట్లాడుతూ తనను అమూల్యను ధీరజ్ చూసేశాడని చెబుతాడు. దీంతో వల్లి వణికి పోతుంది. నేను ఏం పాపం చేశాను నాకు ఎందుకు ఇంత టార్చర్? ఒక పక్కన నర్మద, ప్రేమ బాధపడలేక పోతుంటే ఇప్పుడు ధీరజ్ కూడా విశ్వ అమూల్యను చూసేసాడు.. ఇంట్లో ఎంత గొడవ అవుతుందోనని వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపు భాగ్యం విశ్వకు బుద్ధులు చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో కోపం వచ్చిన విశ్వ బెల్ట్ తీసి అందరినీ బెదిరిస్తాడు. ఈ గండం నుంచి గట్టెక్కెలా ఏదైనా సలహా చెప్పమని అడుగుతాడు. భాగ్యం వెంటనే వెళ్లి ప్రేమను కలవమని చెబుతుంది.
దీంతో విశ్వ వెళ్లి ప్రేమతో మాట్లాడతాడు. ప్రేమ మాత్రం అతనితో మాట్లాడేందుకు ఇష్టపడదు. అయితే ప్రేమను రోడ్డు పక్కకు తీసుకువెళ్లి ‘నువ్వు ధీరజ్ ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావని, నిన్ను ఎలాగైనా మన ఇంటికి తీసుకువెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేసాం. కానీ నువ్వు చేసినది తప్పు కాదు అని నాకు తర్వాత అర్థమైంది’ అని తన అమూల్య తో తన ప్రేమ మేటర్ చెప్పేస్తాడు విశ్వ.
ప్రేమకు చెప్పిన విశ్వక్
అమూల్య విశ్వక్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసి ప్రేమ షాక్ అవుతుంది. కోపంతో తన అన్నయ్య షర్టు పట్టుకుంటుంది. అమూల్య తనని ఎంతో ప్రేమిస్తోందని, నేను లేకపోతే బతకలేదని చెబుతాడు విశ్వ. అమూల్య తన వెంటడపి ప్రేమించినట్టు కథ మొత్తం తిప్పి చెబుతాడు. మొత్తం అమూల్య మీదికి తోసేస్తాడు. తన తప్పు ఏదీ లేదన్నట్టు మాట్లాడతాడు. అమూల్యకి ఎంత నచ్చజెప్పినా తనని ప్రేమిస్తోందని అంటాడు. అమూల్యతో మాట్లాడి మన కుటుంబాల మధ్య పరిస్థితుల్ని అర్థమయ్యేలా చెప్పమని అంటాడు. ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాల్లో ఎవరో ఒకరు మరణించే అవకాశం ఉందని, అది జరగకుండా నువ్వే ఆపాలని ప్రేమతో తెలివిగా చెబుతాడు విశ్వక్. ఈలోపు అక్కడికి ధీరజ్ వస్తాడు.
విశ్వను కొట్టిన ధీరజ్
ధీరజ్ కోపంతో విశ్వాను కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ‘నా చెల్లిని ట్రాప్ చేస్తావా’ అంటూ చితక్కొడతాడు. ప్రేమ అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ధీరజ్ ఆగడు. దీంతో కోపంలో ప్రేమ ధీరజ్ చెంపపై కొడతాడు. దీంతో ధీరజ్ కూడా ప్రేమను కొడతాడు. అక్కడినుంచి విశ్వక్ వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడి నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద నడుచుకుంటూ వస్తుంటే విశ్వ, అమూల్య కలిసి బైక్ పై వెళ్లడం చూస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఫోన్ తీసి ఆ విషయాన్ని సాగర్ కు చెప్పేందుకు వెంటనే రమ్మని అంటుంది. మరోపక్క ధీరజ్, ప్రేమ మాత్రం కోపంతో చెరో వైపు నిలుచుని ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది.

