MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం

Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం

Illu Illalu Pillalu Today Episode Dec 22: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో నర్మద, ప్రేమ కలిసి వల్లిని ఎలాగైనా ఇంటర్వ్యూకి పంపించాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ వల్లి వాటిని అడ్డుకునేందుకు ట్రై చేస్తుంది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Dec 22 2025, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వల్లి జ్వరం ప్లాన్
Image Credit : jio hotstar

వల్లి జ్వరం ప్లాన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద, ప్రేమ పాయసం చేసి అందరికీ పంచుతారు. వేదవతి ఎందుకు పాయసం ఇస్తున్నారు అని అడిగితే.. వల్లి అక్క ఉద్యోగానికి వెళుతుంది కదా, ఆ ఆనందంతోనే ఇస్తున్నామని చెబుతారు. ఇదంతా వల్లి దొంగ చాటుగా వింటుంది. ఆ రోజు వల్లి ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంటర్వ్యూ ని తప్పించుకునేందుకు ఉల్లిపాయల ప్లాన్ తో జ్వరం వచ్చేలా నటిస్తుంది. ప్రేమ, నర్మద వచ్చి వల్లిని ఇంటర్వ్యూకు రెడీ అవ్వమని చెబుతారు. 

వల్లి తనకు జ్వరం వచ్చిందని కావాలంటే చూసుకోమని చేయిస్తుంది. చెయ్యి పట్టుకోగానే వేడిగా ఉండడంతో నిజంగానే జ్వరం వచ్చిందని అనుకుంటారు. ఈలోపు చంకల్లోంచి ఉల్లిపాయ ముక్కలు కింద పడతాయి. వాటిని చూసి వల్లి ప్లాను నర్మదకు, ప్రేమకు అర్థం అయిపోతుంది. వల్లి అమాయకంగా ఇంత జ్వరంతో ఎలా వెళ్తాను? ఇంటర్వ్యూ కి వెళ్లలేను కదా అని చెబుతుంది. దానికి నర్మద, ప్రేమ కాసేపట్లో నువ్వే ఇంటర్వ్యూకి రెడీ అవుతావు చూడు అని చెబుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భాగ్యం వెంట రౌడీలు
Image Credit : Jio hotstar

భాగ్యం వెంట రౌడీలు

ఇక ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్, భాగ్యం దగ్గరికి మారుతుంది. వీరిద్దరిని అప్పుల వాళ్ళు తరమడంతో వీధి వీధి తిరుగుతూ పరిగెడుతూ ఉంటారు. ఒకచోట దాక్కొని ఇడ్లీ బాబాయ్, భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. 10 లక్షలు అప్పు తీర్చకపోతే ఈ రౌడీలు చంపేసేలా ఉన్నారు, కానీ మనకి ఇప్పుడు పది రూపాయలు కూడా అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు ఇడ్లీ బాబాయ్. రామరాజును మోసం చేసినందుకు మనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటాడు. ఈలోపు రౌడీలు రావడంతో మళ్లీ పరుగులు పెట్టడం మొదలు పెడతారు. చివరికి ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని ఒకచోట ఆగుతారు. భాగ్యం మాట్లాడుతూ వల్లికి ఫోన్ చేస్తాను ఈ రౌడీలను వెనక్కి పంపించేలా విశ్వతో మాట్లాడుతుంది అని చెప్పి ఫోన్ చేస్తుంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ
Related image2
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద
34
తల్లిదండ్రులను చచ్చిపోమన్న వల్లి
Image Credit : Jio hotstar

తల్లిదండ్రులను చచ్చిపోమన్న వల్లి

ఇక వల్లి దుప్పటి కప్పుకొని తన దొంగ నాటకం ఎక్కడ బయటపడిపోతుందో అని భయపడుతూ ఉంటుంది. నర్మద, ప్రేమ.. డాక్టర్‌ని పిలిపించేందుకు సిద్ధమవుతారు. డాక్టర్ వస్తే తన విషయం బయట పడుతుందని వల్లి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది . ఈ లోపు భాగ్యం నుంచి వచ్చిన ఫోను తీసి మాట్లాడుతుంది. భాగ్యం కూతురుతో 10 లక్షల కోసం విశ్వక్ రౌడీలను పంపించాడని వారు మమ్మల్ని చంపేసేలా ఉన్నారని అంటుంది. దానికి వల్లి కోపంతో ‘అయితే చచ్చిపోండి, త్వరగా చచ్చిపోండి. మీరు మా అమ్మాయి ఎమ్మే చదివిందని చెప్పిన అబద్ధం పాములాగా నా మెడకి చుట్టుకుంది. నన్ను ఎలాగైనా ఇంటర్వ్యూకి పంపించాలని నర్మద, ప్రేమ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తప్పించుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ చితైపోతున్నాయి. నేను ఇంటర్వ్యూ కి వెళ్తే నా చదువు మొత్తం బయటపడుతుందని, మనం చేసిన మోసం కూడా బయట పడుతుందని, మామయ్యకి మొత్తం తెలిసిపోతుందని భయమేస్తోందని అంటుంది వల్లి. మీకు చేతనైతే నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించండి... లేదా వాళ్ళ చేతుల్లో చావండి అని చెప్పి వల్లి ఫోన్ పెట్టేస్తుంది.

ఇక్కడ నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. నర్మద, ప్రేమ కలిసి వల్లికి కొంచెం జ్వరం వచ్చిందని డాక్టర్ గారిని పిలిచామని చెబుతారు. డాక్టర్ ఇంటికి వస్తాడు. ప్రేమ, నర్మద ఆ డాక్టర్ గురించి చాలా గొప్పగా చెబుతారు. డాక్టర్ ను వల్లి దగ్గరికి తీసుకెళ్తారు. నీ జ్వరం పోగొట్టడానికి డాక్టర్ గారిని పిలిపించామని నర్మద, ప్రేమ చెబుతారు. ఇక వల్లి తనలో తాను ఎలాగో నాకు ఒళ్ళు కాలిపోతుంది కాబట్టి టాబ్లెట్లు ఇచ్చి మూడు రోజులు వేసుకోమంటారు.. నేను తప్పించుకున్నట్టే అనుకుంటుంది. వచ్చిన డాక్టర్ పెద్ద సూది ఉన్న ఇంజక్షన్ తీస్తాడు. అది చూసి వల్లి భయపడిపోతుంది.

44
విశ్వ, అమూల్యను చూసేసిన ధీరజ్
Image Credit : Jio hotstar

విశ్వ, అమూల్యను చూసేసిన ధీరజ్

కానీ డాక్టర్ మాత్రం ఆ పెద్ద ఇంజక్షన్ చేస్తానని పట్టుబడతాడు. నర్మద, ప్రేమ కూడా చేయమనే చెబుతారు. వల్లికి ఆ సూది సైజు చూసి విపరీతంగా భయం వచ్చేస్తుంది. వల్లి సూదిని చూసి భయపడి పోయి లేచి పరుగులు పెడుతుంది. ఆమెను పట్టుకునేందుకు ప్రేమ నర్మదా ప్రయత్నిస్తారు. కానీ వల్లి గాభరాలో నాకు జ్వరం తగ్గిపోయింది, ఇప్పుడు ఎంతో బాగుందని, ఇంజక్షన్ అవసరం లేదని డాక్టర్ ను కసిరేస్తుంది. దీంతో డాక్టరు వెళ్ళిపోతాడు. ప్రేమ మాట్లాడుతూ అతడు నిజమైన డాక్టర్ కాదు నీ దొంగ నాటకాలు బయట పెట్టడానికి మేమే పిలిపించాం అని వల్లితో చెబుతారు. వల్లి ఈ విషయం విని ఏడుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ధీరజ్ అమూల్య, విశ్వలను కలిసి చూస్తాడు. అమూల్య కాలేజీ ఎగ్గొట్టి మరి విశ్వను కలవడం చూసి ధీరజ్ షాక్ అవుతాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ
Recommended image2
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved