- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి
Illu Illalu Pillalu Today Episode Dec 23: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో వల్లిని బలవంతంగా ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు నర్మద, ప్రేమ. మరోపక్క ధీరజ్ అమూల్య, విశ్వలను చూసేస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

ఇంటర్య్వూకి వెళ్లిన వల్లి
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద, ప్రేమ కలిసి వల్లి దొంగ జ్వరం బయట పెట్టేస్తారు. ఆమెను ఎలాగైనా ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందేనని చెబుతారు. దాంతో వల్లి తప్పేది లేక ఇంటర్వ్యూకు వెళుతుంది. వల్లితో పాటు నర్మద, ప్రేమ కూడా ఆమె వెంట వెళతారు. వల్లి ప్రిన్సిపల్ దగ్గరకి వెళ్లి ఇంటర్వ్యూ కి వచ్చానని చెబుతుంది. ప్రిన్సిపల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వల్లి ఏమీ అర్థం కానట్టు ముఖం పెడుతుంది. ప్రిన్సిపల్ సర్టిఫికెట్లను తీసుకొని చెక్ చేస్తాడు.
ఆ తర్వాత వల్లిని ఇంగ్లీషులో నీ గురించి చెప్పమని, నువ్వేం చదివావో, నీ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతాడు. దాంతో వల్లి గందరగోళంగా, అయోమయంగా ముఖం పెడుతుంది. ఇక బయట నర్మద, ప్రేమ.. వల్లి పరిస్థితి ఏమవుతుందోనని నవ్వుకుంటూ ఉంటారు. మరోపక్క ప్రిన్సిపల్ మీకు ఇంగ్లీషులో మాట్లాడటం రాదు అనుకుంటా, నువ్వు చీట్ చేస్తున్నావని అర్థం అయిపోతుంది.. ఇవన్నీ దొంగ సర్టిఫికెట్లు అయి ఉంటాయి అని ప్రిన్సిపల్ అంటాడు. దీంతో వల్లి భయపడిపోతుంది.
ఇంగ్లిష్ టీచర్ గా వల్లి
ప్రిన్సిపల్ బయట ఉన్న నర్మద, ప్రేమలను గదిలోకి పిలుస్తాడు. వెంటనే ప్రిన్సిపల్ నర్మదతో వల్లికి జాబ్ ఇస్తున్నానని చెబుతాడు. ఆమె ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతోందని మా స్కూల్ కి ఇలాంటి ఇంగ్లీష్ టీచరే కావాలి అని అంటాడు. దీంతో వల్లి ఆనందంతో నవ్వుకుంటూ ఉంటుంది. నర్మద, ప్రేమలకు మాత్రం ఏమీ అర్థం కాదు. అప్పుడు వల్లి తాను చేసిన మోసాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటుంది. తన చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉంటుంది వల్లి. కిటికీ దగ్గర భాగ్యం, ఇడ్లీ బాబాయి కలిసి ఒక ఇంగ్లీష్ టీచర్ ని తీసుకొస్తారు. అతను ఏది చెప్తాడో వల్లి విని అదే ప్రిన్సిపల్ కు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ప్రిన్సిపాల్ మాత్రం వల్లికి నిజంగానే ఇంగ్లిష్ వచ్చని నమ్ముతాడు. అలా ఇంటర్వ్యూలో మోసం చేస్తుంది వల్లి.
ఇక ప్రిన్సిపల్ వల్లితో మాట్లాడుతూ టీచర్ మీరు ఈరోజు నుంచే స్టూడెంట్స్ కి క్లాస్ తీసుకోమని చెబుతాడు. కానీ నర్మద.. ఇడ్లీ బాబాయ్, భాగ్యం చేసిన మోసాన్ని కనిపెట్టేస్తుంది. అదే విషయాన్ని వల్లికి చెబుతుంది. ‘ఇంగ్లీష్ టీచర్ ని తీసుకొచ్చి బాగా మోసం చేసావే, ఆనందంలో తేలిపోతున్నావు, కానీ నీ ఇంగ్లీష్ చదువు బండారం బయటపడి ఉంటే ఒక్కరోజు గొడవతో ముగిసిపోయేది. కానీ ఇప్పుడు నువ్వు ప్రతి రోజు పిల్లలకు క్లాస్ తీసుకోవాలి. ఇంగ్లీష్ రాదన్న విషయం బయట పడకుండా ఉండేందుకు నువ్వు ప్రతి రోజు టెన్షన్ పడుతూనే ఉండాలి. నీ అతి తెలివితేటలతో నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావ్’ అని అంటారు ప్రేమ, నర్మద.
విశ్వ బండిపై అమూల్య
ఇక ఇక్కడి నుంచి సీన్ తిరుపతి దగ్గరికి మారుతుంది. తిరుపతి ముసుగు వేసుకున్న అమ్మాయి వెంట పరుగులు పెడుతూ ఉంటాడు. ఆమె మాయం అయిపోతుంది. ఈ లోపు అక్కడికి ధీరజ్ వస్తాడు. తిరుపతి తో మాట్లాడుతూ ఉండగా అటువైపు నుంచి అమూల్య నడుచుకుంటూ వెళ్లడం చూస్తాడు. ఈ సమయంలో కాలేజీలో ఉండాల్సిన అమూల్య ఎక్కడికి వెళుతుంది అని ఆలోచిస్తాడు. ఆమె వెనకే నెమ్మదిగా బండిపై ఫాలో అవుతాడు. అలా అమూల్య నడుచుకుంటూ వెళుతుండగా విశ్వ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చివరికి ఇద్దరు కలుస్తారు. అమూల్య విశ్వ దగ్గరకి వెళ్లడం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ధీరజ్ చూసేస్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమూల్య వాడితో మాట్లాడుతుంది ఏంటి , వీడు ట్రాప్ చేశాడా అని ఆశ్చర్యపడతాడు. వాళ్లిద్దరి దగ్గరికి వెళ్లేందుకు వేగంగా నడుచుకుంటూ వెళ్తాడు. ఈలోపు బస్సు అడ్డంగా వస్తుంది. ఆ బస్సు వెళ్లే లోపు అమూల్య, విశ్వ బండిపై వెళ్ళిపోతారు. అయితే విశ్వ బండి మిర్రర్ నుంచి ధీరజ్ ను చూసేస్తాడు.
ఇక వల్లిని క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్తాడు అటెండర్. పిల్లలంతా వల్లికి గుడ్ మార్నింగ్ చెప్తారు. అటెండర్ ఏ క్లాస్ చెప్పాలో కూడా బుక్ ఇచ్చి వెళ్తాడు. కానీ అది కనీసం చదవడం కూడా రాదు వల్లికి. అటు ఇటు తిప్పి ఇబ్బంది పడుతూ ఉంటుంది. పిల్లలందరూ పాఠం చెప్పమని అడుగుతారు. కానీ వల్లి తెలుగులో మాట్లాడడంతో పిల్లలందరూ ఇంగ్లీష్ లో మాట్లాడమని చెబుతారు. వల్లి ఇరుక్కుపోయి అలా క్లాస్ రూమ్ లో ఉండిపోతుంది. పాఠం ఏం చెప్పాలో తెలియదు. ఇక ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది.

