- Home
- Entertainment
- ఆ సంగతి తెలిసి ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేవాడిని, శివాజీ కామెంట్స్..హౌస్ లో అలాంటి పనులు..
ఆ సంగతి తెలిసి ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేవాడిని, శివాజీ కామెంట్స్..హౌస్ లో అలాంటి పనులు..
నటుడు శివాజీ గతంలో టాలీవుడ్ లో హీరోగా రాణించారు. ఆ తర్వాత కెరీర్ విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఊహించని విధంగా శివాజీకి బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హీరోగా రాణించిన శివాజీ
నటుడు శివాజీ గతంలో టాలీవుడ్ లో హీరోగా రాణించారు. ఆ తర్వాత కెరీర్ విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఊహించని విధంగా శివాజీకి బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ తనదైన ముద్ర వేసి అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ షో తో శివాజీకి మళ్ళీ క్రేజ్ పెరిగింది.
బిగ్ బాస్ 7లో టాప్ 3గా శివాజీ
శివాజీ సీజన్ 7 లో టైటిల్ గెలుచుకోనప్పటికీ టాప్ 3గా నిలిచారు. ఆ సీజన్లో పల్లవి ప్రశాంత్ విజేత కాగా,అమర్ దీప్ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ షో తర్వాత శివాజీ సినీ కెరీర్ కూడా వేగం పుంజుకుంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఆ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా శివాజీ.. నాని నిర్మించిన కోర్ట్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.
మంగపతి పాత్రలో విలక్షణ నటన
మంగపతి పాత్రలో శివాజీ కోర్టు మూవీలో విలక్షణ నటన కనబరిచారు. ఈ చిత్రంతో శివాజీకి మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం శివాజీకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. శివాజీ తరచుగా రాజకీయాల పట్ల కూడా తన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన అరెస్టు అయినట్లు మీకేమైనా సమాచారం అందిందా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
ఆ సంగతి తెలిసి ఉంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసేవాడిని
శివాజీ సమాధానం ఇస్తూ.. ఆ సంగతి నాకు తెలిసి ఉంటే నేను బిగ్ బాస్ హౌస్ లో ఎందుకుంటాను? వెంటనే వచ్చేసేవాడిని అని అన్నారు. చంద్రబాబు అరెస్టు సంగతి నాకు తెలిసి ఉంటే ఒక్క క్షణం బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాడిని కాదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. బయట ఏం జరుగుతుందో ఏమీ తెలియదు అని శివాజీ తెలిపారు.
బిగ్ బాస్ గురించి అవన్నీ నిజాలు కాదు
బిగ్ బాస్ హౌస్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో బూతు జరుగుతుందని, ఇంకేదో జరిగిపోతుందని ఊహించుకుంటారు. కానీ అదంతా నిజం కాదు.. మీకు కెమెరాలు చూపించేదే నిజం అని శివాజీ అన్నారు.