MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ

Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ

Aditya 369 Review: బాలకృష్ణ కెరీర్‌లోనే అద్భుతం చేసిన సినిమా 'ఆదిత్య 369'. టైమ్ ట్రావెల్ కథల రుచిని తెలుగువారికి చూపించిన సినిమా ఇది. ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అసలు ఈ మూవీని బాలయ్యతో కాకుండా ఏ హీరోతో చేయాలని అనుకున్నారో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 27 2026, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు ఆడియన్స్‌కు కొత్త రుచి చూపించిన సినిమా..
Image Credit : our own

తెలుగు ఆడియన్స్‌కు కొత్త రుచి చూపించిన సినిమా..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో గుర్తుండిపోయే ప్రయోగాల్లో ‘ఆదిత్య 369’ మూవీ కూడా ఒకటి. 1991లో విడుదలైన ఈ సినిమా, టాలీవుడ్ తెరపై తొలిసారిగా "టైమ్ ట్రావెల్" అనే అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రం ఒక క్లాసిక్ మాస్టర్‌పీస్.

ఆదిత్య 369 మూవీ కథ విషయానికి వస్తే..

సినిమా కథ ప్రొఫెసర్ రామ్‌దాస్ (టిన్ను ఆనంద్) తయారు చేసిన టైమ్ మెషిన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మెషిన్ సాయంతో మనుషులు భూమిపై గతంలోకి - భవిష్యత్తులోకి వెళ్లవచ్చు. రామ్‌దాస్ కూతురు హేమ (మోహిని), ఆమెను ప్రేమించిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అనుకోకుండా ఒక రాత్రి వేళ ఈ టైమ్ మెషిన్‌లోకి ప్రవేశిస్తారు. పొరపాటున మెషిన్ స్టార్ట్ అవ్వడంతో వారు క్రీస్తు శకం 1500 నాటి శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ కృష్ణదేవరాయలుగా నటించింది కూడా బాలకృష్ణే కావడం విశేషం.

అక్కడ రాయలవారి దర్బార్ సంస్కృతి, రాజకీయం, ఆపదలు ఎదుర్కొని తిరిగి వర్తమానానికి బయలుదేరుతారు. అయితే, దారిలో యంత్రం విఫలమై, వారు క్రీస్తు శకం 2500 (భవిష్యత్తు) కాలానికి వెళ్తారు. మూడో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మానవాళి భూమి లోపల ఎలా జీవిస్తుందో, ఆధునిక ప్రొఫెసర్ భట్ భట్ తయారు చేసిన రోబోలతో నిండిన ప్రపంచాన్ని చూసి తిరిగి వర్తమానానికి ఎలా వచ్చారనేదే ఈ సినిమా కథ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సినిమా ఎలా ఉంది? (విశ్లేషణ)
Image Credit : our own

సినిమా ఎలా ఉంది? (విశ్లేషణ)

‘ఆదిత్య 369’ కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు; ఇందులో సైన్స్, ఇతిహాసం, కామెడీ, యాక్షన్, రొమాన్స్ కలగలిపి అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయల సమయాన్ని చూపించిన సీన్స్ చాలా బాగున్నాయి. రాయలవారి ఆస్థానం, భువనవిజయం, అష్టదిగ్గజాల కవిత్వాలు, వజ్రాల దొంగతనం వంటి అంశాలు ప్రేక్షకులను పాతకాలానికి తీసుకెళ్తాయి. అంతే కాదు, భవిష్యత్తు ప్రపంచాన్ని చూపించడంలో సింగీతం శ్రీనివాసరావు ఊహాశక్తి అద్భుతం. కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ, రోబోలు, కొత్త రకం దుస్తులు, రాకెట్ తరహా వాహనాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాయి. ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. 'రాస లీల వేళ', 'జానవులే..' లాంటి పాటలు ఇప్పటికీ తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉన్నాయి.

36
నటీనటుల విషయానికి వస్తే..
Image Credit : Asianet News

నటీనటుల విషయానికి వస్తే..

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో రాణించారు. కృష్ణకుమార్‌గా నవయువకుడి ప్రతిభ చూపిస్తూనే, శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన పలికించిన రాజసం, సంభాషణలు నందమూరి అభిమానులను మాత్రమే కాక సగటు ప్రేక్షకుడిని మెప్పించాయి. హీరోయిన్‌గా మోహిని నటనతో ఆకట్టుకుంది. ప్రొఫెసర్ రామ్‌దాస్‌గా టిన్ను ఆనంద్ నటన అద్భుతం. అన్నపూర్ణమ్మ, చంద్రమోహన్, శుభలేఖ సుధాకర్, సిల్క్ స్మిత, చలపతిరావు, సుత్తివేలు.. ఇలా స్టార్ కాస్ట్ అంతా తమ పాత్రల పరిధి మేర అద్భుతంగా నటించి మెప్పించారు.

46
ఆదిత్య 369 సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు
Image Credit : google

ఆదిత్య 369 సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు

ఈ సినిమాను మొదట మల్టీస్టారర్ మూవీగా రూపొందించాలని సింగీతం శ్రీనివాసరావు భావించారు. వర్తమానంలో ఉండే కుర్రాడి పాత్రకు ఒక హీరోని, శ్రీకృష్ణదేవరాయల పాత్రకు మరొక సీనియర్ స్టార్ హీరోని అనుకున్నారు. అయితే రాయలవారి పాత్రకు బాలకృష్ణ అయితేనే సంభాషణలు, రాజసం సరిగ్గా సెట్ అవుతాయని భావించారు. అంతేకాకుండా, ద్విపాత్రాభినయం (Double Role) చేస్తే ప్రేక్షకులకు థ్రిల్ పెరుగుతుందని భావించి మల్టీస్టారర్ ఆలోచనను విరమించుకున్నారు.

ఏ హీరోతో చేయాలనుకున్నారు?

సింగీతం శ్రీనివాసరావు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనుకున్న కొత్తలో, బాలకృష్ణ కంటే ముందు కమల్ హాసన్‌తో ఈ సినిమా చేయాలని అనుకున్నారనే వార్తలు ప్రచారంలో ఉండేవి. అయితే, సింగీతం గారు స్వయంగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ద్వారా నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి వద్దకు ఈ కథ తీసుకెళ్లడం, బాలకృష్ణ వినగానే ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది.

56
షూటింగ్ కబుర్లు
Image Credit : Asianet News

షూటింగ్ కబుర్లు

1990ల కాలంలో ఎటువంటి గ్రాఫిక్స్ లేవు. ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా రూపొందించిన సెట్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. భవిష్యత్తు కాలం కోసం వేసిన కప్పబడిన నగర సెట్స్, పాతకాలం నాటి విజయనగర కోట సెట్స్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. శ్రీకృష్ణదేవరాయల గెటప్ కోసం బాలకృష్ణ గంటల తరబడి మేకప్ రూమ్‌లోనే గడిపేవారు. ఆభరణాలు, కిరీటం, పట్టు వస్త్రాలు ధరించి షూటింగ్ చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. అయినా కానీ నందమూరి వంశ ప్రతిష్టను నిలబెట్టేలా బాలయ్య ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తాడన్న ప్రచారం జరిగింది. బాలకృష్ణ స్వయంగా డైరెక్ట్ చేస్తాడని కూడా అంటున్నారు.

66
ఎన్టీ రామారావు మెచ్చిన కథ....
Image Credit : Asianet News

ఎన్టీ రామారావు మెచ్చిన కథ....

కథ సిద్ధమయ్యాక దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకి వినిపించారు. ఆయన కథలోని సైన్స్ ఫిక్షన్, పౌరాణిక కలయికను మెచ్చుకుని, "ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, బాలయ్యకు కొత్త ఇమేజ్ వస్తుంది" అని దీవించారు. ‘ఆదిత్య 369’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ ఒక దృశ్య కావ్యానికి తార్కాణం. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే అంతటి సాంకేతిక ప్రతిభతో, అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు సాహసానికి, బాలకృష్ణ నటనకు ఈ సినిమా నిదర్శనం. ఇప్పటికి ఎన్నో ఏళ్లు గడిచినా, ఈ సినిమా రీ-రిలీజ్ అయినా లేదా టీవీల్లో వచ్చినా ప్రేక్షకులు ఇప్పటికీ కళ్లప్పగించి చూస్తారనడంలో సందేహం లేదు. ఈ మూవీ చూడాలనుకునేవారికి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Recommended image2
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Paradise Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. నాని సినిమాలో హైలెట్స్ ఇవే, మైనస్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved