- Home
- Entertainment
- 15 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ వాడినట్టు ఆరోపణలు ఫేస్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
15 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ వాడినట్టు ఆరోపణలు ఫేస్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఈ బ్యూటీ 15 ఏళ్ళకే హీరోయిన్ అయ్యింది. 18 ఏళ్లకు స్టార్ డమ్ చూసింది. 30 ఏళ్లకు ఆఫ్ సెంచరీ సినిమాలు కంప్లీట్ చేసింది. కాని హార్మోన్ ఇంజెక్షన్స్ వాడిందంటూ ఆరోపణలు ఫేస్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆతరువాత చాలా చిన్నవయస్సులోనే హీరోయిన్ అవతారంఎత్తింది. స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. ఎన్నో ఆరోపణలు కూడా ఫేస్ చేసి.. ఇండస్ట్రీలో నిలబడ్డ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?
Also Read: 5 వేలతో ఇండస్ట్రీకి వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు తీసుకుంటుంది.. ఎవరా హీరోయిన్
బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అల్లు అర్జున్ జంటగా దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది హన్సిక. చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చిన హన్సికకు తక్కువ సమయంలోనే పేరు వచ్చింది. దీంతో వరుసగా తెలుగు తమిళ భాషల్లో ఆఫర్లు అందాయి. స్టార్ హీరోల సరసన వెంట వెంటనే సినిమాలు చేసింది.
Also Read: సాయం చేసేంత డబ్బుంది.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఏం చేయబోతోంది.
బొద్దుగా ముద్దుగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ కంటే తమిళ ఆడియన్స్ హన్సికాను ఆదరించారు. ఆమెకు స్టార్ డమ్ ఇచ్చారు. అక్కడ ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ బ్యూటీ శింబుతో ప్రేమాయణం కూడా నడిపించినట్టు సమాచారం. తమిళంలో కూడా చాలా సినిమాలు చేసిన ఆమె. 30 ఏళ్ళకే 50 సినిమాలు కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎంత స్టార్ డమ్ సంపాదించిందో అన్నివిమర్శలు కూడా ఎదుర్కుని నిలబడింది హన్సికా.
Also Read: మగాడితో పనేంటి.. ఒంటరి జీవితమే హాయిగా ఉంది, సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?
బరువు పెరగడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి దాంతో బరువు తగ్గించుకుని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది హన్సక. దాంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 2022లో తన ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది.సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలి భర్తే ఈ సోహైల్. మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత హన్సికతో ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పెళ్లి జైపూర్‌లో జరిగింది.
Also Read: చెల్లి తో పెళ్లి.. అక్క తో శోభనం.. ఇదెక్కడి సినిమా రా బాబు, ఎక్కడ చూడాలంటే..?
అయితే హన్సికా కొన్ని ఆరోపణలు ఫేస్ చేయాల్సి వచ్చింది. బన్నీతో దేశముదురు మూవీ చేసే నాటికి హన్సిక వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. 1991లో జన్మించిన హన్సిక టీనేజ్ లోనే హీరోయిన్ అయ్యారు. వయసు పెద్దదిగా కనిపించేందుకు, ఫిజిక్ కూడా పెరిగేందుకు ఆమె హార్మోన్స్ ఇంజక్షన్ తీసుకున్నారనే వాదన వినిపించింది.
హన్సిక తల్లి మోనా మోత్వానీ డాక్టర్ కావడం.. అందులోనే ఆమె స్కిన్ స్పెషలిస్ట్ అవ్వడంతో.. ఆమె కూతురిని హీరోయిన్ చేసేందుకు హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇచ్చారని రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై హన్సిక స్వయంగా స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమే అని క్లారిటీ కూడా ఇచ్చారు.
అంతే కాదు ఇలాంటి ఆరోపణలు చేసేప్పుడు వారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా..? నేను ఈ వార్తలను అస్సలు పట్టించుకోలేదు. కాని మా అమ్మ వీటిపై చాలా బాధపడింది. ఆమెను మేము ఓదార్చాము. ఇటువంటివి తెలియకుండా ఎలా రాస్తారంటూ.. గతంలోనే స్పందించింది హన్సికా. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూ హ్యాపీగాఉంది. నటించడానికి కూడా రెడీగా ఉంది. మంచి పాత్రలు వస్తే.