- Home
- Entertainment
- 5 వేలతో ఇండస్ట్రీకి వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు తీసుకుంటుంది.. ఎవరా హీరోయిన్
5 వేలతో ఇండస్ట్రీకి వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు తీసుకుంటుంది.. ఎవరా హీరోయిన్
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఊపుమీద ఉన్న స్టార్ బ్యూటీ.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఆటుపోట్లు చూసింది. 5 వేలు చేతిలో పట్టుకుని వచ్చిన ఆ బ్యూటీ ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు సంపాదిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.

ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఎటువంటి బ్యాక్ గ్రైండ్ లేకుండా ఎదిగినవారు స్టార్లు గా మారిన వారు చాలామంది ఉన్నారు. వారిలో హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా ఉన్నారు. కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కోట్లు కూడబెడుతున్నవారు కొందరైతే.. కెరీర్ బిగినింగ్ లోనే ఈ ఫీల్డ్ సెట్ అవ్వక వెళ్ళిపోయినవారు మరికొందరు. అయితే ఇప్పడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం 5 వేల రూపాయలు చేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది. ఇప్పుడు 5 నిమిషాలు నటించినందుకు కోట్లకు కోట్లు లెక్కబెడుతోంది.
Also Read:రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన స్టార్ హీరోలు, ఎన్నికోట్లు పెట్టుబడి పెట్టారో తెలుసా...?
ఇంతకీ ఆ తార ఎవరో కాదు.. నోరా ఫతేహి. అవును సినిమాల మీద పిచ్చితో.. సినిమా అంటే ప్రేమతో ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. పట్టుదలతో తాను అనుకున్నది సాధించగలిగింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు, సవాళ్ళను ఫేస్ చేసిన ఈబ్యూటీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది.
Also Read: చెల్లి తో పెళ్లి.. అక్క తో శోభనం.. ఇదెక్కడి సినిమా రా బాబు, ఎక్కడ చూడాలంటే..?
నార్త్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. సౌత్ లో కూడా సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరు. ఆ పాటలే నోరాకు కోట్లు కురిపిస్తున్నాయి. తెలుగులో ఆమె టెంపర్, బాహుబలి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది.
Also Read: మగాడితో పనేంటి.. ఒంటరి జీవితమే హాయిగా ఉంది, సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?
కెనడా నుంచి కేవలం 5 వేల రూపాయలతో ఇండియాకు వచ్చిన ఈ బ్యూటీ.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు పడింది. అవకాశాల కోసం తెగ తిరిగింది. ఆడిషన్స్ కు వెళ్ళి అక్కడ కూడా అవమానాలు ఫేస్ చేసింది. గుడ్డు, బ్రెడ్ తో సరిపుచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయట నోరా ఫతేహీ లైఫ్ లో. ఇలా అంచంచలుగా ఎదుగుతూ వస్తోంది ఈ బ్యూటీ.
Nora Fatehi
ప్రస్తుతం నోరా ఫతేహీ సాంగ్స్ కు భారీగా డిమాండ్ ఉంది. ఆమె 5 నిమిషాల పాటకు దాదాపు 2 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తోందట. ఇలానే తన డిమాండ్ పెరగడంతో ఇప్పటి వరకూ 60 కోట్లకు పైగా ఆస్తులు కూడా కూడబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా డిమాండ్ పెరిగింది.
ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి.. ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో ఎదగడం అంటే మాటలు కాదు. ఈ స్టార్ డమ్ వెనుక నోరా కష్టం మాత్రమే ఉంది. ఆమె పట్టుదల ఆమెను ఇంత వరకూ తీసుకువచ్చింది. ప్రస్తుతం నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఆమెకు డిమాండ్ పెరిగేలా చేసింది.