- Home
- Entertainment
- గ్లామర్ బ్యూటీ ట్రెడిషనల్ టచ్ ఇస్తే ఈ రేంజ్ లో ఉంటుందా... శారీలో కొత్త లుక్ ట్రై చేసిన ఢీ యాంకర్ పూర్ణ
గ్లామర్ బ్యూటీ ట్రెడిషనల్ టచ్ ఇస్తే ఈ రేంజ్ లో ఉంటుందా... శారీలో కొత్త లుక్ ట్రై చేసిన ఢీ యాంకర్ పూర్ణ
అవకాశం ఏదైనా వదలకుండా చేయడమే బెటర్... అనే ఫిలాసపీ ఫాలో అవుతున్నారు హీరోయిన్ పూర్ణ. హీరోయిన్ గా చిత్రాలు చేస్తూనే, కొన్ని చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు.

కెరీర్ లో మంచి హిట్స్ దక్కినా, స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయారు పూర్ణ. అలా అని ఆమె కెరీర్ పూర్తి నిరాశాజనకంగా ఏమీ లేదు. ఆమె ఇమేజ్ తగ్గ ఆఫర్స్ తో నటిగా బిజీగా గడుపుతున్నారు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సీమ టపాకాయ్ సూపర్ హిట్ కాగా, పూర్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఆమె నటించిన హారర్ చిత్రం అవును సిరీస్ పాజిటివ్ టాక్ అందుకుంది.
Poorna స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె లేటెస్ట్ సినిమాల ఎంపిక చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె లేడీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం.
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషమే అని చెప్పాలి. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న అఖండ మూవీలో పూర్ణ రోల్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. మరో వైపు వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు.
ఇక డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.
తెలుగులో టాప్ రేటెడ్ డాన్స్ రియాలిటీ షోకి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో హీరోయిన్ ప్రియమణితో కలిసి ఆమె వేదికపై సందడి చేస్తున్నారు. కేవలం జడ్జిగా మాత్రమే కాకుండా యాంకర్స్ తో రొమాన్స్, గ్లామర్ తో రచ్చ చేస్తూ ఉంటారు పూర్ణ.
కాగా 2020లో పూర్ణ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కొందరు దుండగులు పూర్ణను కిడ్నాప్ చేయడంతో పాటు, ఓ హోటల్ గదిలో బందించి, మనీ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం నుండి పోలీసుల చొరవతో పూర్ణ బయటపడ్డారు.
తాజాగా చిలకపచ్చ చీరలో, సాంప్రదాయంగా కనిపించి షాక్ ఇచ్చింది పూర్ణ. గ్లామర్ బ్యూటీ సరికొత్త లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ప్రపంచంలో ఎన్ని ట్రెండ్స్ ఉన్నా, ఇలా క్లాసిక్ గా ఉండిపోవాలని అనిపిస్తుంది.. అంటూ తన ఇంస్టాగ్రామ్ ఫోటోలపై కామెంట్ చేశారు ఈ క్రేజీ హీరోయిన్.