MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 7వ తేదీ)లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన దీప. జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండమని దశరథతో చెప్పిన డాక్టర్. దశరథను రెచ్చగొట్టి నిజం చెప్పించాలి అనుకున్న జ్యోత్స్న. ఆపిన శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Mar 07 2026, 08:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో వానంటే కొందరికే ఇష్టం, కానీ హరివిల్లంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. హరివిల్లు రావాలంటే వాన రావాలి. మన సమస్య కూడా అంతే అత్త బ్రతకాలి అంటే ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు బాధపడ్డవాళ్లే అప్పుడు సంతోషపడతారు. నిజం తెలిశాక అందరూ అర్థం చేసుకుంటారు అంటాడు కార్తీక్. మీ అమ్మ నిన్ను నాకోసమే కన్నదిరా అని కార్తీక్, దీపలను హగ్ చేసుకుంటాడు దశరథ. లేదు మామయ్య నీ కూతురు కోసం కన్నది అని నవ్వులు పూయిస్తాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
దీపకు సమస్యలంటే ఇష్టం
Image Credit : Jiohotstar

దీపకు సమస్యలంటే ఇష్టం

మరోవైపు ఇక్కడ జరిగిన దాంట్లో నా తప్పు ఏమైనా ఉందా నాన్న అని అడుగుతుంది కాంచన. ఇక్కడ ఎవరి తప్పు లేదమ్మా.. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేవి తెరపై జరిగే నాటకంలా ఉంటాయి. అప్పుడు మనం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండాలి అంతే అంటాడు శివన్నారాయణ. సమస్యలను కావాలని ఎవరు తెచ్చుకోరు కదా కాంచన అంటాడు శ్రీధర్.

లేదండి దీప తెచ్చుకుంటుంది. తనకు సమస్యలంటే ఇష్టం. ఆరోజు పంతులు గారు దీపకు బిడ్డ గురించి ఎందుకు జాగ్రత్త చెప్పారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అని బాధపడుతుంది కాంచన. నేను కోరుకునేది ఒక్కటే నాన్న తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలి అంటుంది కాంచన. దేవుడి దయ వల్ల అందరికి మంచే జరుగుతుంది నువ్వు బాధపడకు అంటాడు శివన్నారాయణ.

38
స్వప్న, కాశీల ప్రేమ
Image Credit : Jiohotstar

స్వప్న, కాశీల ప్రేమ

మరోవైపు స్టూల్ పై ఎక్కి బూజు దులుపుతూ ఉంటుంది కావేరి. ఏం చేస్తున్నావమ్మా.. ఇలా చేస్తే కిందపడిపోతావు. నాకు ఇవ్వు ఆ పని నేను చేస్తాను అంటుంది స్వప్న. బూజు దులుపుతూ స్టూల్ పై నుంచి కిందపడబోతుంది స్వప్న. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కాశీ, స్వప్నను పట్టుకుంటాడు. ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోతారు. ఆ తర్వాత డ్రైవర్ గాడివి నన్ను పట్టుకుంటావా అంటుంది స్వప్న. దాంతో వదిలేస్తాడు కాశీ. కిందపడి అరుస్తుంది స్వప్న. పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయా అని అడుగుతాడు కాశీ. ఎప్పటికీ రావు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

48
హాస్పిటల్లో దీప
Image Credit : Jiohotstar

హాస్పిటల్లో దీప

హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది దీప. డాక్టర్ దీపను చెక్ చేసి అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఇకపై ఇదే నీ రూమ్. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం అయితే నర్స్ తో చెప్పండి. లేదా నాకు ఫోన్ చేయండి అని చెప్పి బయటకు వెళ్తుంది డాక్టర్.

58
జ్యో గురించి చెప్పిన డాక్టర్
Image Credit : Jiohotstar

జ్యో గురించి చెప్పిన డాక్టర్

బయట కార్తీక్, దశరథ్‌ ఉంటారు. సుమిత్ర గారిని ఎప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయాలో నేను చెబుతాను. అప్పటివరకు నేను చెప్పిన మెడిసిన్స్ వాడుతూ ఉండండి అని చెప్తుంది డాక్టర్. అలాగే.. జ్యోత్స్నతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు తను హాస్పిటల్ కి వచ్చింది. ప్రెగ్నెంట్స్ బోన్ మ్యారో డొనేట్ చేయొచ్చా అని అడిగింది. ఇక్కడ ఏం జరుగుతుందో తను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది అని చెప్తుంది డాక్టర్. 

అన్నీ నేను చూసుకుంటాను డాక్టర్. దీపకు హెల్త్ బాలేదు కాబట్టి ఇక్కడ అడ్మిట్ అయింది అంతే.. మీరు కూడా అదే చెప్పండి అని చెప్తాడు కార్తీక్. నా కూతురు, తన కడుపులో బిడ్డ ఇద్దరూ బ్రతకాలి డాక్టర్.. అందుకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అడుగుతాడు డాక్టర్. అవకాశం ఉంటే నేను వదిలేస్తానా.. మీరు మాత్రం హోప్స్ పెట్టుకోకండి అని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్. క్యారేజ్ తీసుకొస్తానని ఇంటికి బయల్దేరుతారు కార్తీక్, దశరథ.

68
ఆలోచనల్లో జ్యోత్స్న
Image Credit : Jiohotstar

ఆలోచనల్లో జ్యోత్స్న

మరోవైపు దీప గురించి దశరథ, దాసు, డాక్టర్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏదో జరుగుతోంది. ఎలా తెలుసుకోవాలి. డాడీని రెచ్చగొట్టి ఆయనకు ఏం తెలిసిందో తన నోటితోనే చెప్పించాలి అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ్ వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ డాడీ అని అడుగుతుంది జ్యోత్స్న. దీపను హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి వెళ్లాను అని చెప్తాడు దశరథ.

78
దశరథను రెచ్చగొట్టిన జ్యో
Image Credit : Jiohotstar

దశరథను రెచ్చగొట్టిన జ్యో

దీపను చూసుకోవడానికి ఆమె భర్త, అత్త, మామ ఉన్నారు. మమ్మీని చూసుకోవడానికి నువ్వు, నేను మాత్రమే ఉన్నాము. ఆ పని మనిషి కోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది జ్యోత్స్న. దీప పని మనిషి కాదు అంటాడు దశరథ. దీప పనిమనిషే అని పదే పదే అని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. దశరథ కోపంగా నిజం చెప్పబోతుంటే శివన్నారాయణ వచ్చి ఏంటి దశరథ ఇది. ఎందుకు అంతా కోపం అంటాడు.

జ్యోత్స్న అడిగిన విధానం తప్పు కానీ అడిగిన ప్రశ్న తప్పుకాదు అంటాడు శివన్నారాయణ. దీప సంగతి కార్తీక్ చూసుకుంటాడు. నువ్వు వెళ్లింది దీప కడుపులో బిడ్డకు సమస్య ఉందని.. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు శివన్నారాయణ. 

88
దీప గురించి ఆరాతీసిన సుమిత్ర
Image Credit : Jiohotstar

దీప గురించి ఆరాతీసిన సుమిత్ర

దీప కడుపులో బిడ్డకు ఏమైంది అని అడుగుతుంది సుమిత్ర. ఏం లేదు చిన్నగా నొప్పి వస్తే తీసుకెళ్లాము. ఇప్పుడు ఓకే అని చెప్తాడు దశరథ. దీప నా గురించి కూడా కంగారు పడుతుంటుంది. నాకేం కాదని చెప్పండి. దీప కడుపులో బిడ్డకు కూడా ఏం కాదు నా మాటగా తనకి చెప్పండి అని లోపలికి వెళ్తుంది సుమిత్ర. దశరథ ఏదో దాస్తున్నాడని మనసులో అనుకుంటుంది పారు.

దీపకు ఏం కానప్పుడు మమ్మీతో ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతుంది జ్యోత్స్న. కొన్ని విషయాలు ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. నేను కరెక్ట్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్తాడు దశరథ. టైమ్ దగ్గరపడింది జ్యోత్స్న అని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు దశరథ. నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్లకు అని చెప్తాడు. దేనికి టైం దగ్గర పడింది అని అడుగుతుంది జ్యోత్స్న. ఆపరేషన్‌కు అని కవర్ చేస్తాడు దశరథ. డాడీకి నా గురించి తెలిసిపోయినట్లే ఉంది. ఒకసారి దాసును కలవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:జ్యోకు స్ట్రాంగ్ కౌంటర్-కాంచన ఏడుపు-దీపను జీవితంలో క్షమించనన్న కాంచన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved