చీరలో సెక్సీగా దర్శన మిచ్చిన మలయాళ మారుతం నజ్రియా
మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ శారీలో హొయలు పోతూ సెగలు రేపింది. సోషల్ మీడియాలో నజ్రియా సెక్సీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన నజ్రియా తమిళ్, మలయాళ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటుంది. మలయాళంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నజ్రియా సోషల్ మీడియాలో సెక్సీ ఫోటోలు పంచుకొని రచ్చ చేస్తున్నారు.
లైట్ బ్రౌన్ శారీ, గోల్డ్ కలర్ బ్లౌజ్ ధరించి సెక్సీ లుక్స్ ఇచ్చింది. నజ్రియా ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
త్వరలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది నజ్రియా నజీమ్. బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అంటే సుందరానికీ' మూవీలో నజ్రీయా హీరోయిన్ గా ఎంపికయ్యారు.
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.
అరంగేట్రంతోనే క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్న నజ్రియా సక్సెస్ అయితే తెలుగు తెరను ఏలేయడం ఖాయం.
మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాసిల్ తో 2014లోనే నజ్రియాకు వివాహం జరిగింది.