- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 11: పార్కులో విశ్వతో అమూల్య, చూసేసిన రామరాజు పెద్దకొడుకు
Illu Illalu Pillalu Today Episode Dec 11: పార్కులో విశ్వతో అమూల్య, చూసేసిన రామరాజు పెద్దకొడుకు
Illu Illalu Pillalu Today Episode Dec 11: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో రామరాజు ఇంట్లోని కొడుకులు, కోడళ్ళు అందరూ ఒకే పార్కుకు చేరుకుంటారు. తిరుపతి అదే పార్కుకు వస్తాడు. అమూల్య, విశ్వ అదే పార్కులో ఉంటారు. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

పార్కులోనే జంటలన్నీ
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ మొదలవగానే జంటలన్నీ పార్కులో ఆనందంగా మాట్లాడుకుంటూ కనిపిస్తాయి. ఇక తిరుపతి తన కలల రాణిని వెతికేందుకు పార్కులో తిరుగుతూ ఉంటాడు. అనుకోకుండా వల్లి -పెద్దోడిని చూసి షాక్ అవుతాడు. మీరు ఇక్కడున్నారేంటని అడుగుతాడు తిరుపతి. దానికి వల్లి మీకు పెళ్లా పెటాకులా? తాడా బొంగరమా? పెళ్లయిన వాళ్ళ ఎంజాయ్ చేయడానికి పార్కుకు రారా? అంటూ క్లాసు పీకుతుంది. ఇక తిరుపతిని పార్క్ కి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.తను అర్జెంటు పని మీద వచ్చానని చెప్పి తిరుపతి వెళ్ళిపోతాడు. తన స్వప్న సుందరిని కనిపెట్టడానికి తిరుపతి వెతుకులాట మళ్లీ మొదలు పెడతాడు. తిరుపతి అలా ముందుకెళ్లి స్వప్న సుందరి కోసం వెతుకుతూ ఉంటే నర్మదా, సాగర్ కనిపిస్తారు. తిరుపతిని చూసి నర్మదా, సాగర్ కూడా షాక్ అవుతారు. ఇదేంటి మీరు కూడా ఈ పార్క్ కి వచ్చారా? అని అని అక్కడి నుంచి గాభరా పడుతూ ఏదేదో మాట్లాడుతూ తిరుపతి వెళ్ళిపోతాడు.
తిరుపతి స్వప్న సుందరి వచ్చేసింది
మళ్ళీ పార్కులో తిరగడం మొదలుపెడతాడు. కాస్త అలా ముందుకు వెళ్లేసరికి ప్రేమ, ధీరజ్ కూర్చొని కనబడతారు. అందరూ జంటలు ప్రేమగా మాట్లాడుకుంటుంటే వీళ్ళు మాత్రం చెరో వైపు తిరిగి కూర్చుంటారు. పార్క్ కి ఎవరు పిలిచారనే విషయంపై వీరిద్దరూ గొడవ పడతారు. ఇంతలో అక్కడికి ఒక పాప వచ్చి ఇద్దరికీ చెరో పువ్వు ఇస్తుంది. ఇద్దరికీ ఒకరికొకరు సారీ చెప్పుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు పువ్వులు ఇచ్చుకొని సారీ చెప్పుకుంటారు. వీరిద్దరిని చూసి తిరుపతి ‘మీరు కూడా వచ్చారా’ అంటూ గోల మొదలు పెడతాడు. తను చాలా ఇంపార్టెంట్ పనిమీద వచ్చానని తిరుపతి చెప్పి వెళ్ళిపోతాడు.
ఇంకా పార్కులో అలా వెతుకుతూనే ఉంటే అమూల్య ఎవరితోనో మాట్లాడుతున్నట్టు తిరుపతికి కనిపిస్తాడు. కానీ విశ్వకు చెట్లు అడ్డొస్తాయి. అమూల్య మాట్లాడుతున్నది ఎవరితోనో చూడ్డానికి దగ్గరికి వెళ్లేసరికి ఎవరో వెనకనుంచి బంతితో తిరుపతిని కొడతారు. దీంతో విశ్వను చూడకముందే తిరుపతి వెనక్కి తిరుగుతాడు. ఈ లోపు ఒక అమ్మాయి ముఖంపై కొంగు కప్పుకొని పరిగెడుతూ ఉంటుంది. ఆమె తన స్వప్న సుందరి అనుకుని ఆమె వెనక పరిగెడతాడు. కానీ ఆమె కనిపించకుండా పోతుంది.
నర్మద ప్రేమ ముందే అమూల్య జంట
ఈ లోపు వల్లీ, పెద్దోడు తాము కూర్చున్న ప్లేస్ నుంచి లేచి అలా తిరుగుతూ ఉంటారు. ఈలోపు బల్లికి అమూల్య, విశ్వ కనిపిస్తారు. దీంతో చాలా కంగారు పడిపోతుంది వల్లి. వెంటనే పెద్దోడుకి వారు కనిపించకుండా వేరే వైపు తిప్పి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి నర్మద, సాగర్ ఎదురవుతారు. అమూల్య, విశ్వను వాళ్ళు ఎక్కడ చూస్తారోనని చాలా గాభరా పడుతూ ఉంటుంది వల్లి. ఇక ప్రేమ, ధీరజ్ కూడా అక్కడికే వస్తారు. వీళ్ళందరూ అమూల్య ను చూడకుండా ఉండాలని వల్లి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందరినీ ఇంటికి వెళ్లి పోదామని త్వర పెడుతుంది. కానీ పెద్దోడు ఒప్పుకోడు. అందరూ కలిశాం కదా పార్కులోనే కాసేపు గడుపుదామని అంటాడు. కానీ వల్లి అమూల్య విషయం బయటపడుతుందేమోనని చాలా కంగారు పడుతుంది.
అమూల్య విశ్వను చూసేసిన పెద్దోడు
అమూల్య, విశ్వ మాట్లాడుకుంటూ వీరున్నచోటకే నడుచుకొని వెళ్తూ ఉంటారు. నర్మద, ప్రేమలకు అమూల్య కనబడకుండా ఉండేందుకు వల్లి బెలూన్లు అడ్డుపెట్టి యాక్టింగ్ చేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక బెలూన్లను విసిరేస్తుంది. అమూల్య, విశ్వ జంటను ఎవరు చూడలేదని చాలా ధీమాగా ఉంటుంది వల్లి. కానీ అప్పటికే పెద్దోడు వారిద్దరిని చూసేస్తాడు. ఆ విషయం వల్లీ కూడా కనిపెట్టేస్తుంది. కానీ వల్లీ వారిద్దరినీ చూశాడో లేదో క్లారిటీగా చూపించరు. ఇక్కడితో ఈ సీన్ కట్ చేసేస్తారు.
ధీరజ్ మనసులో ప్రేమ
ఇక్కడి నుంచి సీన్ ధీరజ్, ప్రేమ దగ్గరికి మారుతుంది. ఇంట్లో ప్రేమ ఏదో రాసుకుంటూ ఉంటే ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ ఇచ్చిన పువ్వును చూస్తూ మైమరచిపోతూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్లో పొట్టి పిల్లా పాటను వేసి పూర్తిగా రొమాంటిక్ గా ఈ సీన్ ను మార్చేశారు.ప్రేమను చూస్తూ మై మరచిపోతూ ఉంటాడు ధీరజ్. వెంటనే ఓయ్ రాక్షసి అంటూ ప్రేమను పిలుస్తాడు. నిన్న నీకు పార్కులో ఒక ఫ్లవర్ ఇచ్చాను కదా.. దాన్ని ఏం చేసావు అని అడుగుతాడు. దానికి ప్రేమ ఆ పువ్వుని అక్కడే పార్కులో పడేసాను వెళ్లి చూసుకో అని అంటుంది. దానికి ఫీల్ అవుతాడు ధీరజ్. ప్రేమ ఇచ్చిన పువ్వును కూడా ఆమె మీదకే కోపంతో విసిరేస్తాడు. దీంతో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

