- Home
- Entertainment
- Nidhhi Agerwal: ప్రభాస్ హీరోయిన్ న్యూ ఇయర్ ట్రీట్.. వామ్మో క్రేజీ శారీలో పోజులు ఆరాచకం
Nidhhi Agerwal: ప్రభాస్ హీరోయిన్ న్యూ ఇయర్ ట్రీట్.. వామ్మో క్రేజీ శారీలో పోజులు ఆరాచకం
నిధి అగర్వాల్ ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌తో `హరి హర వీరమల్లు`తో అలరించింది. ఇప్పుడు ప్రభాస్‌తో `ది రాజాసాబ్` చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఆమె న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది.

`ది రాజా సాబ్`తో రాబోతున్న నిధి అగర్వాల్
ప్రభాస్‌తో ఇప్పుడు `ది రాజా సాబ్` చిత్రంలో నటిస్తోంది నిధి అగర్వాల్. చివరగా ఆమె పవన్‌తో `హరి హర వీరమల్లు`లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ది రాజాసాబ్`తో అలరించేందుకు వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నిధి సోషల్ మీడియాని షేక్ చేసే పని పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె నయా ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్
నిధి అగర్వాల్ తాజాగా పలుచని శారీలో ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. అదిరిపోయే లుక్‌లో పోజులివ్వగా ఆయా పిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, నిధి అగర్వాల్ ఇదేం అరాచకం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోయిన్ న్యూ ఇయర్ ట్రీట్ ముందుగానే ఇచ్చిందంటున్నారు. ప్రస్తుతం ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ కి మొదటిసారి జోడీగా నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ ఇప్పుడు మొదటిసారి ప్రభాస్‌కి జోడీగా `ది రాజా సాబ్` చిత్రంలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ఇతర హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
ప్రభాస్‌పై నిధి అగర్వాల్ ప్రశంసలు
ఇటీవల హైదరాబాద్‌లో `ది రాజా సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో నయా లుక్‌లో మెరిసింది నిధి అగర్వాల్. ఈ ఈవెంట్‌లో నిధి మాట్లాడుతూ, `ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి సినిమా చేయడం కల. అది నిజమైన అనుభూతి కలిగిస్తోంది. ఆయన ఎంతమంచి వారో మాటల్లో చెప్పలేను. మీ అందరి అభిమానం, ప్రేమతో ఇంకా మరిన్ని విజయాలు ప్రభాస్ అందుకోవాలి` అని తెలిపింది.
స్టేడియంలో సిక్స్ కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది- నిధి అగర్వాల్
ఇంకా నిధి అగర్వాల్ చెబుతూ, `గల్లీలో సిక్స్ కొట్టడం కాదు స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ రేంజ్ అది. `ది రాజా సాబ్` లో నటించే అవకాశం కల్పించిన మారుతికి థ్యాంక్స్. సప్తగిరి, వీటీవీ గణేష్..ఇలా వీరందరితో కలిసి నటించడం ఎంతో సరదాగా సాగింది. నా కో యాక్టర్స్ మాళవిక, రిద్ధితో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేను. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఎంతో సపోర్ట్ చేశారు. తమన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మనమంతా రాజా సాబ్ ను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం` అని తెలిపింది.

