- Home
- Entertainment
- మర్యాద మనీష్ పై విరుచుకుపడ్డ ఇమ్మాన్యుయేల్.. బాబోయ్ జబర్దస్త్ కమెడియన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..
మర్యాద మనీష్ పై విరుచుకుపడ్డ ఇమ్మాన్యుయేల్.. బాబోయ్ జబర్దస్త్ కమెడియన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..
Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు 9 నాల్గవ ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయేల్ బరస్ట్ అయ్యారు. కెప్టెన్సీ టాస్క్ లో మనీష్ మర్యాదపై ఇమ్మాన్యుయేల్ విరుచుకుపడ్డ విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

బిగ్ బాస్ తెలుగు 9 నాల్గవ రోజు ఎపిసోడ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో నాల్గవ రోజు కెప్టెన్సీ టాస్క్ షురూ అయింది. ఆసక్తికర పరిణామాల మధ్య కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడే కంటెండర్ల ఎంపిక జరిగింది. బుధవారం రోజు జరిగిన పరిణామాలని హౌస్ మేట్స్ గుర్తు చేసుకుంటూ చర్చించుకుంటున్నారు. సంజన రూల్స్ బ్రేక్ చేశారనే కారణంతో ఆమెని హౌస్ లోకి రానివ్వకూడదనే చర్చతో గురువారం బిగ్ బాస్ నాల్గవ ఎపిసోడ్ మొదలైంది. హౌస్ మేట్స్ మధ్య సరదా సంభాషణలు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు, వాగ్వాదాలతో నాల్గవ ఎపిసోడ్ సాగింది. చివర్లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ పోటీ ఈ ఎపిసోడ్ లో హైలైట్ అనే చెప్పాలి. హౌస్ లో రాము రాథోడ్, భరణి శంకర్ మధ్య ఎమోషనల్ బాడింగ్ బలపడుతోంది. రాము.. భరణి శంకర్ ని తన సొంత సోదరుడిగా భావిస్తున్నారు. ఏ కష్టం వచ్చినా నీకు ఈ అన్నయ్య ఉన్నాడు అని గుర్తు పెట్టుకో అంటూ భరణి శంకర్ రాముకి తెలిపారు. ఇమ్మాన్యుయేల్ తనదైన శైలిలో అమ్మాయి గెటప్ లో కనిపించి కాసేపు నవ్వించారు.
సంజనకి బిగ్ బాస్ స్పెషల్ పవర్
ఇంతలో బిగ్ బాస్ నటి సంజనని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. హౌస్ లో ఇతర సభ్యులు ఎలా ఉన్నారు అని బిగ్ బాస్ సంజనని అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా ఆడుతున్నారని.. ఇంకా బాగా ఆడటానికి సమయం పడుతుంది అని బిగ్ బాస్ కి సంజన తెలిపారు. హౌస్ లో అందరూ తనని కార్నర్ చేయడం గురించి కూడా సంజన బిగ్ బాస్ తో మాట్లాడింది. ఆమె ధైర్యాన్ని, నిజాయతీని బిగ్ బాస్ అభినందించారు. సంజన తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆమె కుటుంబ సభ్యురాలు అంతా బావున్నారని, కేవలం గేమ్ పై మాత్రమే ఫోకస్ చేయాలని బిగ్ బాస్ సంజనకి సూచించారు. ఆమె ధైర్యం, నిజాయతీ కారణంగా బిగ్ బాస్ సంజనకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. హౌస్ లో ఐదుగురు సభ్యులని కెప్టెన్సీ పోటీ దారులుగా ఎంచుకునే పవర్ ఇస్తున్నట్లు బిగ్ బాస్ సంజనకు తెలిపారు. దీనితో సంజన కెప్టెన్సీ పోటీదారులుగా తనతో పాటు ఐదుగురు సభ్యులని ఎంచుకుంది. సంజన, శ్రేష్ఠి వర్మ, హరీష్, పవన్, ఇమ్మాన్యుయేల్ లని సంజన ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని బయటకి వచ్చి సంజన ఇంటి సభ్యులకు తెలియజేసింది. ఇతర సభ్యులు తనని ఎందుకు ఎంపిక చేయలేదు అని సంజనని ప్రశ్నించారు. సంజన వివిధ కారణాలు చెప్పింది. ఇంతలో మర్యాద మనీష్ చపాతీ ముక్క పడేశాడని అతడితో శ్రీజ దమ్ము, ప్రియాతి వాగ్వాదానికి దిగారు.
కెప్టెన్సీ టాస్క్ షురూ
ఇంతలో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ గురించి వివరించారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న ఐదుగురు మిగిలిన సభ్యుల లోనుంచి తమకి సపోర్ట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంచుకున్నారు. ఇమ్మాన్యుయేల్ కి సపోర్ట్ గా భరణి.. శ్రేష్ఠి వర్మకి సపోర్ట్ గా రాము రాథోడ్.. సంజనకు సపోర్ట్ గా శ్రీజ దమ్ము.. పవన్ కి సపోర్ట్ గా ప్రియా ఎంపికయ్యారు. టాస్క్ ప్రకారం సపోర్ట్ గా ఎంపికైన వారు గోడకి అమర్చిన రాడ్ లపై ఎక్కాలి. కాలు కింద పెట్టకుండా అలాగే నిలబడి ఉండాలి. ఎవరు ఎక్కువ సేపు నిలబడితే ఆ టీమ్ విజేత అని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్ కి మనీష్ మర్యాదని సంచాలకులుగా నియమించారు.
ఇమ్మాన్యుయేల్ అవుట్
సపోర్టర్లు రాడ్ లపై ఉన్నప్పుడు సంచాలకుడు పోటీ దారులుగా ఉన్న వారిలో ఒక్కొక్కరిని పిలుస్తారు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి.. తమకు సపోర్ట్ ఇస్తున్న వారిని కాకుండా ఇతరులు నిలబడి ఉన్న రాడ్ లని తొలగించాలి. వాళ్ళు కింద పడిపోయేలా చేయాలి. ఇది కేవలం రెడ్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. మనీష్ రెడ్ లైట్ ఆన్ అయినప్పుడు ఇమ్మాన్యుయేల్ ని పిలిచారు. ఇమ్మాన్యుయేల్ వెళ్లి రాడ్ తొలగించే లోపు గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ ఉన్నప్పుడు రాడ్ తొలగించకూడదు. దీనితో ఇమ్మాన్యుయేల్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయినట్లు మనీష్ ప్రకటించారు.
మనీష్ పై విరుచుకుపడ్డ ఇమ్మాన్యుయేల్
మనీష్ తనని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో ఇమ్మాన్యుయేల్ భరించలేకపోయాడు. గ్రీన్ లైట్ పడ్డ విషయాన్ని తనకు తెలియజేయాల్సిన బాధ్యత సంచాలకుడిది అని.. ఇందులో తన తప్పేమీ లేదని ఇమ్మాన్యుయేల్ వాదనకు దిగాడు. ఈవాదన క్రమంగా పెద్ద గొడవగా మారిపోయింది. ఇమ్మాన్యుయేల్ లో మరో యాంగిల్ బయట పడింది. మనీష్ పై ఇమ్మాన్యుయేల్ కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. కామెడీ చేసే ఇమ్మాన్యుయేల్ లో ఇంత ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సంచాలకుడిగా నువ్వు ఫెయిల్ అంటూ మనీష్ పై ఇమ్మాన్యుయేల్ విరుచుకుపడ్డాడు. మనీష్ కూడా గట్టిగా ఇమ్మాన్యుయేల్ కి కౌంటర్ ఇచ్చారు. అంతటితో గురువారం ఎపిసోడ్ పూర్తయింది. హౌస్ కి తొలి కెప్టెన్ ఎవరు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.