రీతూ వర్మ ఫస్ట్ టైం ఇంత బోల్డ్ గా.. వైరల్ ఫొటోస్, డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్
Ritu Varma : రీతూ వర్మ తొలి సారి బోల్డ్ గా చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. వైట్ షర్ట్ ధరించిన రీతూ వర్మ గ్లామరస్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోస్ పై ఆమె ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Ritu Varma
రీతూ వర్మ గురించి పరిచయం అవసరం లేదు. తన నటన, గ్లామర్ తో రీతూ వర్మ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. రీతూ వర్మ స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు కానీ మంచి అవకాశాలే అందుకుంటోంది.
పెళ్లి చూపులు మూవీతో బ్రేక్
ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకి గుర్తింపు లభించలేదు. పెళ్లి చూపులు మూవీతో రీతూ వర్మకు అసలైన బ్రేక్ వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.
మార్క్ ఆంటోని చిత్రంతో విజయం
నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోల చిత్రాల్లో రీతూ వర్మ నటించింది. పెళ్లి చూపులు తర్వాత రీతూ వర్మకి అంతటి భారీ హిట్ దక్కలేదు. తమిళంలో మార్క్ ఆంటోని చిత్రంతో విజయం అందుకుంది.
రీతూ వర్మ చివరి చిత్రం మజాకా
చివరగా రీతూ వర్మ.. సందీప్ కిషన్ కి జోడిగా నటించిన మజాకా చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రీతూ వర్మ ధ్రువ నక్షత్రం అనే చిత్రంలో నటిస్తోంది.
ఫోటోలు వైరల్
అయితే తాజాగా రీతూ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రీతూ వర్మ తొలిసారి బోల్డ్ గా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది.
బోల్డ్ గా ఫోటో షూట్
రీతూ వర్మని ఇలా బోల్డ్ గా చూస్తున్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు డిస్సప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. రీతూ వర్మ ఎప్పుడూ గ్లామర్ విషయంలో హద్దులు దాటలేదు. కానీ ఇప్పుడు మాత్రం బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. నీ నుంచి ఇది ఊహించలేదు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.