- Home
- Entertainment
- ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది
ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది
Prabhas : ప్రభాస్ తాను నటించిన ఓ మూవీ ఫ్లాప్ అవుతుందని భయపడ్డారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కృష్ణంరాజు వారసుడిగా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే తొలి హిట్ అందుకోవడం కోసం ప్రభాస్ కొంత సమయం ఎదురుచూడాల్సి వచ్చింది. మూడవ చిత్రంతో ప్రభాస్ కి తొలి హిట్ ముచ్చట తీరింది. అది కూడా అలాంటి ఇలాంటి హిట్ కాదు.. తన సినిమాతో ప్రభాస్ ఏకంగా చిరంజీవి, బాలయ్య లకే చెమటలు పట్టించారు.
ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ హైలైట్
ఆ చిత్రం మరేదో కాదు వర్షం. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో అద్భుతం. ఈ చిత్రం విషయంలో ప్రభాస్ కి సిరివెన్నెల సీతా రామశాస్త్రికి మధ్య ఒక సరదా సంఘటన జరిగింది.
ఇదేంటి ఇంత దారుణంగా ఉంది పాట
ఈ చిత్రంలోని అన్ని పాటలని సిరివెన్నెలే రాశారు. ఈ మూవీ సమయంలోనే తాను సిరివెన్నెల గారిని తొలిసారి మీట్ అయ్యానని ప్రభాస్ అన్నారు. శాస్త్రి గారిని తొలిసారి కలిసినప్పుడు మెల్లగా కరగనీ అనే సాంగ్ వినిపించారు. ఆయన బేస్ వాయిస్ తో మెల్లగా కరగనీ అని పాడుతుంటే.. నాకు అస్సలు నచ్చలేదు. అప్పటికి ఆ సాంగ్ ని దేవిశ్రీ ఇంకా రికార్డింగ్ చేయలేదు. ఆ ట్యూన్ ఎలా ఉంటుందో తెలియదు. సిరివెన్నెల గారు తన బేస్ వాయిస్ తో నాకు పాడి వినిపించినప్పుడు.. ఇదేంటి బాబోయ్ ఇంత దారుణంగా ఉంది పాట అని అనుకున్నా. ఈ సాంగ్ పోయినట్లే.. దీని ఎఫెక్ట్ మూవీపై పడుతుందేమో.. మూవీ కూడా పోతుందేమో అని అనుకున్నా.
చిరు, బాలయ్య చిత్రాలని మించేలా..
కానీ దేవిశ్రీ ఆ పాటని రికార్డ్ చేసి రిలీజ్ చేసిన తర్వాత అది నా ఫేవరిట్ సాంగ్ అయిపోయింది అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ భయపడినట్లు ఏమీ జరగలేదు. ఒక వైపు చిరంజీవి అంజి చిత్రం మరోవైపు బాలయ్య లక్ష్మీ నరసింహ చిత్రం ఉన్నప్పటికీ వర్షం మూవీ సంచలన విజయం సాధించింది. చిరు, బాలయ్య చిత్రాలని మించేలా వసూళ్లు రాబట్టింది.
నంది అవార్డు
వర్షం మూవీలో లంగా ఓణీ అనే సాంగ్ లోని లిరిక్స్ అంటే కూడా తనకి చాలా ఇష్టం అని ప్రభాస్ తెలిపారు. వర్షం చిత్రానికి గాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా కెఎస్ చిత్ర నంది అవార్డు అందుకున్నారు.