- Home
- Entertainment
- జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కాంబోలో గుండమ్మ కథ సీక్వెల్, ఆ ఒక్కరి వల్ల ఆగిపోయిన సినిమా
జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కాంబోలో గుండమ్మ కథ సీక్వెల్, ఆ ఒక్కరి వల్ల ఆగిపోయిన సినిమా
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ గుండమ్మ కథను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కలిసి చేయబోతున్నట్టు గతంలోనే టాక్ వచ్చింది. కాని ఆ సినిమా ఒక్కరి వల్ల ఆగిపోయిందని మీకు తెలుసా? ఆ ఒక్కరు ఎవరు? వారు ఏం చేశారు?

తరాలు మారినా తరగని అభిమానాన్ని సంపాదించుకున్న సినిమా గుండమ్మ కథ. సినీ ప్రేమికులను కట్టిపడేసిన ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎన్నాళ్ళైనా.. ఎన్నిసార్లు చూసినా కూడా కొత్త అనుభూతిని అందిస్తుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ల నటన, సావిత్రి, జమునల అభినయం, రమణారెడ్డి , అల్లు కామెడీ ఇదంతా ఒక ఎత్తు అయితే గుండమ్మగా సూర్య కాంతం పాత్ర మరో ఎత్తు.
సూర్యకాంతం గుండమ్మ పాత్రకు దుర్మమ్మత్తగా ఛాయాదేవి పాత్ర కూడా తోడై సినిమా మహాద్భుతంగా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా చరిత్రలో గుండమ్మ కథ చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆ కాలంలో టెక్నాలజీ లేదు, గ్రాఫిక్స్ కూడా లేవు కానీ ఇప్పటికంటే అద్భుతంగా అప్పటి సినిమాలు తెరకెక్కాయి. మాయా బజార్, దానవీర శూర కర్ణ, మిస్సమ్మ, గుండమ్మ కథ ఇలాంటి అద్భుతాలు అప్పుడు మాత్రమే సాధ్యం అయ్యాయి.
పాత సినిమాలను రీమేక్ , సీక్వెల్స్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. కాని కొన్ని సినిమాలను టచ్ చేయాలంటే ఇప్పటి దర్శకులు, హీరోలు భయపడుతున్నారు. ఆ లిస్ట్ లో దానవీర శుర కర్ణ సినిమాతో పాటు గుండమ్మ కథ కూడా ఉంది.
1962 సంవత్సరంలో గుండమ్మ కథ రిలీజ్ కాగా, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, జమున ఒకే సినిమాలో నటించడంతో సినిమాపై అప్పట్లోనే అంచనాలు భారీగా పెరిగాయి.
అనుకున్నట్టుగానే ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 60 ఏళ్ల క్రితమే ఈసినిమా 90 లక్షలకు పైగా షేర్ ను రాబట్టిందంటే ఈమూవీ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించారు. వారి సినీ వారసత్వం తీసుకున్న, జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కాంబోలో ఈ సినిమాను మళ్ళీ చేయాలని ప్రయత్నం జరిగింది.
ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. అంతే కాదు నాగేశ్వరావు పాత్ర కోసం నాగచైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని ఒకరి వల్ల ఈ సినిమా సీక్వెల్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.
గుండమ్మ కథ ఆగిపోవడానికి కారణమైన ఆ ఒక్కరు ఎవరో కాదు, గుండమ్మ కథ టైటిల్ క్యారెక్టర్ అయిన సూర్య కాంతం. అవును ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, జమున వీరి పాత్రలను రీ ప్లేస్ చేయడానికి ఎవరో ఒకరు ఉన్నారు. కాని గుండమ్మ పాత్రను రీ ప్లేస్ చేసే విధంగా, పవర్ ఫుల్ క్యారెక్టర్ మాత్రం దొరకడం కష్టం.
సూర్యకాంతం పాత్ర చేయగలిగే నటి మాత్రం వారికి దొరకలేదట. ఈ సినిమాకు ప్రాణం పోసింది గుండమ్మ పాత్రే. అటువంటి పాత్ర కోసం వేరే ఆప్షన్ దొరకలేదట. దాంతో ఈసినిమా సీక్వెల్ ప్రయత్నం విరమించుకున్నట్టు తెలుస్తోంది.
సూర్యకాంతంను మరిపించేలా కాకపోయినా.. గుండమ్మ పాత్రకు న్యాయం చేసేలా ఎవరైనా నటి దొరికితే చాలు, ఈసినిమా సీక్వెల్ అడుగులు ముందుకు పడతాయి. కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గుండమ్మ పాత్ర దొరక్కనే ఈసినిమాను వద్దు అన్నట్టు సమాచారం.
ఈసినిమాకు ఆమె పాత్ర ప్రాణం లాంటిది. అందకే ఎన్టీఆర్, ఎఎన్నార్ లాంటి పెద్దలు ఉన్నా కాని.. ఈసినిమాకు సూర్య కాంతం చేసిన గుండమ్మ పాత్ర పేరును టైటిల్ గా పెట్టారు. అలా ఈసినిమా సీక్వెల్ ప్రస్తుతానికి బ్రేక్ పడింది. మరి ముందు ముందు గుండమ్మ కథ సీక్వెల్ కు ముందడుకు పడుతుందా లేదా చూడాలి.

