1000 కోట్ల ఆస్తి, 3 పెళ్లిళ్లు, 6 పిల్లలు, ఆస్కార్ సాధించిన ఈ నటి ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతందో చెప్పడం కష్టం. అది టాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితం డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ క్రమంలో 1000 కోట్ల ఆస్తి సంపాదించుకున్న ఓ హీరోయిన్ జీవితం గురించి ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా హీరోయిన్ల జీవితం డిఫరెంట్ గానే ఉంటుంది. అందులో వేల కోట్ల ఆస్తులు సంపాదించిన వారు ఉన్నారు, పేదరికంలో మగ్గిన తారలు ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేసినవారు ఉన్నారు, లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా బ్రతికినవారు కూడా ఉన్నారు. ఈక్రమంలో 3 పెళ్లిళ్లు చేసుకున్న ఓ హీరోయిన్ 6 పిల్లలతో లైఫ్ ను ఎలా లీడ్ చేస్తుందంటే?
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ. హాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ సాధించిన ఈ నటి పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. ఇప్పటి వరకు ఆమె ముగ్గురిని వివాహం చేసుకుని, ఆరుగురు పిల్లలకు తల్లిగా మారింది. ఆమె ఆస్తుల విలువ సుమారుగా రూ.1100 కోట్లు. ఆమె జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులు, వ్యక్తిగత కష్టాలను తట్టుకుని ప్రపంచం మెచ్చుకునే నటిగా ఎదిగారు.
1982లో తండ్రి జాన్ వోయిట్‌తో కలిసి లుకింగ్ టు గెట్ అవుట్ చిత్రం ద్వారా నటనను ప్రారంభించిన జోలీ, 1999లో గర్ల్, ఇంటరప్టెడ్ సినిమాలో చూపించిన అద్భుతమైన అభినయానికి ఆస్కార్ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత లారా క్రాఫ్ట్: టూంబ్ రైడర్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్, మేల్‌ఫిసెంట్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో అత్యధిక పారితోషికం తీసుకునే హాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా మారారు.
సినిమాలతో పాటు బ్రాండ్లు, వ్యాపార ఒప్పందాల ద్వారా ఆమె సంపాదన భారీగా పెరిగింది. ఫ్యాషన్ బ్రాండ్ సెయింట్ జాన్ తో 102 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆమె, అనాధలను ఆదుకోవడం కోసం అటెలియర్ జోలీ అనే స్వంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు.
ఏంజెలీనా జోలీ వ్యక్తిగత జీవితం అప్ అండ్ డౌన్స్ నో నడిచింది. ఆమె మొదటి పెళ్లి 1996లో నటుడు జానీ లీ మిల్లర్‌తో జరిగింది. తర్వాత 2000లో బిల్లీ బాబ్ థోర్న్టన్‌ను వివాహం చేసుకున్నారు. 2003లో ఆ పెళ్లి ముగిసింది. ఆ తర్వాత బ్రాడ్ పిట్‌తో 2014లో మూడో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మాడాక్స్, పాక్స్, జహారాను దత్తత తీసుకోగా, షిలో, నాక్స్, వివియెన్ అనే ముగ్గురు సంతానానికి జన్మనిచ్చారు.
2016లో వీరిద్దరూ కూడా విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ పేరెంట్ గా ఆమె పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది. జోలీ, UN ప్రత్యేక రాయబారిగా సేవలందిస్తూ యుద్ధ ప్రభావిత ప్రాంతాలు, శరణార్థి శిబిరాల్లో సేవ చేశారు. మహిళల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడారు. తన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసిన ఆమె..వారిలో టాలెంట్ ను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ వస్తోంది. వారికి తల్లి, తండ్రి పాత్రను ఒక్కటిగా నిర్వహిస్తున్నారు.
జీవితంలో ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై జోలీ, ఒక కిల్లర్‌ను తనను హత్య చేయమని ఒప్పందం చేసుకుంది. కాని ఆ హంతకుడి ఒక్క మాటతో జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించుకుంది జోలీ. ఒక్క క్షణం మీ జీవితం గురించి ఆలోచించండి అనే మాటలు ఆమె జీవితం మలుపు తిప్పినట్లు ఆమె గతంలో వెల్లడించారు.
సిల్వర్ స్క్రీన్‌పై ఎవరికీ అందని స్థానం సంపాదించిన ఏంజెలీనా జోలీ, తన పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో బాధలను ఎదుర్కొని ముందుకు సాగారు. ముగ్గురు భర్తలకు విడాకులిచ్చినా, ఆరుగురు పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకురాలిగా నిలిచారు.