పాటకు 50 లక్షలు వసూలు చేస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా?
సినిమాకు డైరెక్టర్, మ్యుూజిక్ డైరెక్టర్ ఎంత ముఖ్యమో కొరియోగ్రాఫర్ కూడా అంతే ముఖ్యం. వారి వల్లే పాటలకు జీవం వస్తుంది. మన ఇండియన్ కొరియోగ్రాఫర్లలో మల్టీ టాలెంట్ ఉన్నవారు ఎక్కువ. వారిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరో తెలుసా?

సినిమాకు ప్రాణం పోసేది పాటలయితే, ఆ పాటలకు జీవం డాన్స్. ఒక సినిమాలో పాటలు, డాన్స్ కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పాటలు తెరకెక్కించడంలో సంగీత దర్శకుల పాత్ర ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ల పాత్ర కూడా కీలకమే. కథలో పాటల స్థానం ఎంత ముఖ్యమో, వాటి విజువల్స్‌ను మలిచే కొరియోగ్రాఫర్లు అంతే ముఖ్యం.
సాంగ్స్ కు అంత డిమాండు ఉండబట్టే ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్లు ఒక్కో పాటకు లక్షలలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో శేఖర్ మాస్టార్, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, గణేష్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేసిన పాటలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం పొందుతున్న కొరియోగ్రాఫర్‌గా ఫరా ఖాన్ నిలిచారు. బాలీవుడ్‌కి చెందిన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఒక్క పాటకు సుమారుగా 50 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆమె దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు.
ఫరా ఖాన్ డాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1987లో విడుదలైన జల్వా చిత్రంతో తొలిసారి తెరపై కనిపించిన ఆమె, కభీ హాన్ కభీ నా (1994) సినిమాతో తొలి బ్రేక్‌ను అందుకున్నారు. అప్పట్లో ఒక్కసారి 6 పాటలకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆమెకు కేవలం 30,000 మాత్రమే అందినట్లు ఫరా గుర్తుచేసుకున్నారు.
సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా, ఫరా ఖాన్ దర్శకురాలిగా, నటిగా, టెలివిజన్ రియాలిటీ షోల జడ్జిగా కూడా రాణించారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన మేన్ హూ నా, ఓం శాంతి ఓం, తీస్ మార్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. డైరెక్టర్ గా ఫరా ఖాన్ ను నిలబెట్టాయి.
ఇక ఫరా ఖాన్‌తో పాటు రెమో డిసౌజా, గణేష్ హెగ్డే, వైభవి మర్చంట్ వంటి కొరియోగ్రాఫర్లు కూడా బాలీవుడ్ లో స్టార్ కంపోజర్లుగా మంచి పారితోషికాన్ని అందుకుంటున్నారు. అయితే పారితోషిక విషయంలో ఫరా ఖాన్ మిగతావాళ్లకంటే ముందున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచన. ఫరా ఖాన్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆమె కష్టపడి పని చేయడమే కాదు, డాన్స్‌పై ఉన్న ప్యాషన్ కూడా ముఖ్యమైన కారణం.