Game Changer OTT: గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ ఫిక్స్, కానీ మెగా ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే..?
Ram Charan Game Changer OTT Release Date: గ్లోబర్ హీరో రామ్ చరణ్ ను తీవ్ర నిరాశకు గురిచేసిన సినిమా గేమ్ ఛేంజర్. మెగా ఫ్యాన్స్ ను కూడా అలరించలేకపోయిన ఈమూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. కాని అభిమానులు మాత్రం ఒకటి డిమాండ్ చేస్తున్నారట. ఏంటది.

Game Changer, Ramcharan, OTT Release Date
Ram Charan Game Changer OTT Release Date: మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈసినిమా .. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దాదాపు 3 ఏళ్ళు షూటింగ్ జరుపుకుంది మూవీ. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది సినిమా.
Also Read: మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్
game changer opening box office collection shankar ram charan
రామ్ చరణ్ కష్టం ఈ సినిమాలో కనిపించింది. కాని కథ, స్క్రీన్ ప్లే తో పాటు.. రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టు.. పాన్ ఇండియా రేంజ్ లో ఈమూవీలో ఏం కనిపించలేదు. దాంతో సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు మూవీపై దృష్టి పెట్టాడు. ఈసినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు చరణ్. చాలా త్వరగా థియేటర్ల నుంచి ఎగ్జిట్ అయిన గేమ్ చేంజర్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు.
Also Read: కోర్టుకెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య, గూగుల్, యూట్యూబ్ కు కోర్టు నోటీసులు
ఇక ఈమూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ కంటేముందు మరో పని చేయాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట. ఇంతకీ ఏంటా డిమాండ్. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, కన్నడ సహా తమిళ భాషల్లో ఈ ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా అనౌన్స్ చేసేసారు.
Also Read:3 సినిమాలు, ఒక్కో సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ హీరోయిన్
మరి ఓటిటిలో వచ్చాక ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. హిందీ, మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ కోసం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ కు ముందే మరోసారి ఎడిటింగ్ చేయించాలని కోరుతున్నారట. మెగా ఫ్యాన్స్. ఈమూవీలో కట్ చేసిన మిగతా భాగాలను కూడా సెట్ చేసి.. రీ ఎడిట్ చేయమని అంటున్నారట.
Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్
ఎడిటింగ్ బాగుండటంతో పాటు.. డిలెట్ సీన్స్ కనుక బాగుండి.. మూవీలో సెట్ అయితే..ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ వస్తుందన్న ఆశతో ఉన్నారట ఫ్యాన్స్. మరి ఇది ఎంత వరకూ నిజమె కాని.. ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం పక్కా.. పిబ్రవరి 7న డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద సందడి చేయబోతుంది సినిమా. ఇక ఈసినిమాకు తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మించారు.