MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Agadha Review: అగధ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఎంఎస్‌ రాజు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షికి హిట్‌ పడిందా?

Agadha Review: అగధ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఎంఎస్‌ రాజు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షికి హిట్‌ పడిందా?

ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకుడిగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన `అగధ` అనే చిత్రాన్ని రూపొందించారు. హర్రర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

5 Min read
Author : Aithagoni Raju
Published : Aug 14 2026, 06:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అగధ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

అగధ మూవీ రివ్యూ

ఒకప్పుడు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తెరకెక్కించిన నిర్మాత ఎంఎస్‌ రాజు ఇటీవల నిర్మాణం పక్కన పెట్టి దర్శకుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `అగధ` చిత్రాన్ని రూపొందించారు. మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించగా, శ్రావణ్‌ రెడ్డి, షిజ్జు, ఉల్కా గుప్తా, వనితా విజయ్‌ కుమార్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 14)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ఎంఎస్‌ రాజు దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షి భాస్కర్ల ఆడియెన్స్ ని మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అగధ మూవీ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

అగధ మూవీ కథ ఏంటంటే?

ఆంధ్రా, ఓరిస్సా బార్డర్‌లో శుక్లా అనే గ్రామంలోని దేవత వద్దకు వస్తుంది మహాదేవి(కామాక్షి భాస్కర్ల). ఆమెని చిన్నప్పుడు అమ్మవారే పిలిపించుకుంటుంది. అక్కడ దెయ్యాలను, భూతులను వదిలిస్తుంటుంది మహాదేవి. ఆమె గురించి తెలుసుకోవడానికి ఒక రైటర్‌ వస్తుంది. మరోవైపు అదే ఫారెస్ట్ లోని మిస్టరీ గుహ రహస్యాన్ని రివీల్‌ చేయడానికి మహాదేవి బాబాయ్‌(భానుచందర్‌) కూతురు మహిమ(ఉల్కా గుప్తా) తన ప్రియుడు సింహా(శ్రావణ్‌ రెడ్డి), ఫ్రెండ్‌(వైవా రఘు)తో కలిసి వెళ్తుంది. అక్కడ గుహలోకి వెళ్లిన సింహా కనిపించకుండా పోతాడు. వైవా రఘు గుహ నుంచి బయటకు రాగానే తల ఎగిరిపడుతుంది. ఇది గర్భిణి అయిన మహిహ చూసి షాక్‌ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వస్తుంది. కానీ అదోలా ఉన్న మహిమ ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది. ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా ఇంట్లో వాళ్లు చనిపోతుంటారు. మహిమ చనిపోయిన విషయం తెలిసి ఆ సాలూరు గ్రామానికి వెళ్తుంది మహాదేవి. అక్కడ బాబాయ్‌ మరో కూతురు హరిణి(జోవికా విజయ్‌ కుమార్‌) వింతగా ప్రవర్తిస్తుంటుంది. దీంతో ఏదో శక్తి వారి కుటుంబాన్ని పీడిస్తుందని తెలుసుకుంటుంది. ఆ శక్తి పేరే అగధ. మరి ఇంతకి అగధ ఎవరు? సింహా ఎలా చనిపోతాడు? ఆ గుహలో ఏం జరిగింది? చనిపోయిన సింహా అక్కడికి ఎలా వచ్చాడు? మహార్షి ద్వారా గతంలోకి వెళ్లిన మహాదేవి అగధ గురించి తెలుసుకున్న నిజాలేంటి? తన కుటుంబాన్ని ఆమె ఎలా రక్షించుకుంది? ఈ క్రమంలో ఎలాంటి ఆసక్తికర, భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయనేది సినిమా.

Related Articles

Related image1
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Related image2
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
37
అగధ మూవీ ఎలా ఉందంటే(విశ్లేషణ)
Image Credit : Asianet News

అగధ మూవీ ఎలా ఉందంటే(విశ్లేషణ)

మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. అదే సమయంలో ఇందులో డివైన్‌ అంశాలు కూడా ఉన్నాయి. ఒక నెగటివ్‌ ఫోర్స్.. చనిపోయిన ఆత్మలను తనలో ఐక్యం చేసుకొని మరింత శక్తిమంతంగా తయారై.. తనని పాతాళంలోకి నెట్టివేసిన దేవతల అంతు చూడాలని, ఈ విశ్వాన్ని తానే శాసించాలని భావిస్తుంది. అందుకోసం తాను చేసిన ఆరాచకాలే ఈ మూవీ. ఆ నెగటివ్‌ ఫోర్సే అగధ. మరి దాన్ని మహాదేవి ఎలా అడ్డుకుందనేది సినిమా. ప్రారంభం నుంచి ఇంట్రెస్టింగ్‌ గా ఈ మూవీ సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠతో రన్‌ అవుతుంది. కథలో పూర్వపరాలను వివరిస్తూ సినిమాలోకి ఆడియెన్స్ ని తీసుకెళ్లిన తీరు బాగుంది. మహాదేవి తన జర్నీని చెప్పడం, తాను అమ్మవారి వద్దకు ఎలా వచ్చాననేని, ఈ లోకంలో దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? అనే ఆసక్తికర ప్రశ్నతో కథ ప్రారంభం కావడం బాగుంది.

ఇంతకి మహాదేవి ఎవరు? అనేది ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. అయితే తనని పెంచిన బాబాయ్‌ ఇంటికి వెళ్లిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. అగధ ఫోర్స్ ఎంట్రీతో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. బాబాయ్‌ ఇంట్లో చోటు చేసుకునే సంఘటనలు, హరిణి వింతంగా ప్రవర్తించడం వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవడం, చనిపోయిన మహిమ అక్కడే తిరగడం వంటి సంఘటనలు ఆసక్తిని క్రియేట్‌ చేస్తాయి. దీనికితోడు ప్రతి సంఘటనని, ఈవిశ్వంలో ఉండే అతీత శక్తులు, ఆత్మలు, భూతల గురించి మహాదేవి వివరించిన తీరు బాగుంటుంది. అగధ శక్తిని మహాదేవి ఎదుర్కోవడంతో ఇంటర్వెల్‌ పడుతుంది. ఆ తర్వాత సెకండాఫ్‌లో ఆమెతో చేసే యుద్ధం ప్రధానంగా సాగుతుంది. మహిమ తన ఫారెస్ట్ జర్నీ ఎలా సాగింది? ఆ అడవిలో ఏం జరిగింది? గుహలోకి ఎందుకు వెళ్లారు? ఆ గుహలో ఏం జరిగిందనే సన్నివేశాలు రివీల్‌ అవుతాయి. అవి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఆద్యంతం భయానకంగా, రక్తికట్టించేలా ఉంటాయి. అగధ శక్తిని ఎదుర్కొనే సన్నివేశాలు గూస్‌ బంమ్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ కూడా అంతే ఉత్కంఠభరితంగా థ్రిల్లర్‌గా సాగుతూ ముగుస్తుంది.

47
అగధలో ప్లస్‌ లు, మైనస్‌ లు
Image Credit : Asianet News

అగధలో ప్లస్‌ లు, మైనస్‌ లు

సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ కొన్ని బాగున్నాయి. బీజీఎం ఆకట్టుకుంటుంది. కొత్తగా ఉంటుంది. మహాదేవి పాత్రలో కామాక్షి అదరగొట్టింది. శ్రావణ్‌ రెడ్డి పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. గుహలోని సన్నివేశాలు థ్రిల్‌కి గురి చేస్తాయి. చెరకు తోటలో ఫైట్‌ బాగుంది. క్లైమాక్స్ లో అమ్మవారు ఇచ్చే ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. అలాగే అడవిలో చేసే పూజలు, బలిచ్చే సన్నివేశాలు కూడా భయానికి గురి చేస్తూనే థ్రిల్‌ చేస్తాయి. విజువల్‌గా మూవీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా అదిరిపోయింది. సీజీ కూడా క్వాలిటీగా ఉంది. నటీనటులు బాగా చేశారు.

ఇక మైనస్‌ విషయానికి వస్తే, సినిమాలో పెద్దగా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు లేవు, హై మూమెంట్స్‌ లేవు, హర్రర్‌ థ్రిల్లర్‌ అంటేనే అవి ఊహిస్తారు, అవే ఇందులో కొరవడ్డాయి? చిన్న కథని బాగా సాగదీసినట్టుగా ఉంది. ల్యాగ్‌ ఎక్కువగా ఉంది. స్లోగా సాగుతుంది. ట్విస్ట్ లు, టర్న్ లు లేకపోవడంతో సప్పగా సాగినట్టుగా అనిపిస్తుంది. ఏవో సీన్లు వస్తూ పోతున్నట్టు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ కూడా కొన్ని చోట్ల తేలిపోయింది. యాక్షన్‌ సీన్లు పెద్దగా లేవు, ఉన్నవి ఆకట్టుకునేలా లేవు. అదే సమయంలో మెయిన్‌గా కథకి ప్రారంభం, ఎండింగ్‌ లేదు. లాజిక్‌ లెస్‌గా ఉంది. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే హర్రర్‌, థ్రిల్లర్‌ పరంగా కొంత వరకు ఆకట్టుకుంటుంది. ఇలాంటి జోనర్‌ని ఇష్టపడేవారికి నచ్చుతుంది.

57
అగధ లో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

అగధ లో నటీనటులు ఎలా చేశారంటే?

మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల అదరగొట్టింది. పాత్రలో జీవించింది. ఆమె సినిమాని తన భుజాలపై మోసింది. సెటిల్డ్ గా చేసి మెప్పించింది. మహిమగా ఉల్కా గుప్తా బాగా చేసింది. టెన్షన్‌ పడే అమ్మాయిగా, స్ట్రగుల్స్ ఫేస్‌ చేసే ఆత్మగా ఆమె ఇరగదీసింది. సింహాగా శ్రావణ్‌ రెడ్డి నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. బోల్డ్ గా కనిపించి మెప్పించాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ మెప్పిస్తుంది. వైవా రఘు కాసేపు కనిపించి ఓకే అనిపించాడు. వనితా విజయ్‌ కుమార్‌ పాత్ర కూడా బాగుంది. ఆమె సైతం డిఫరెంట్‌ షేడ్‌ ఉన్న రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది. భాను చందర్‌ పాత్ర పరిధి మేరకు మెప్పించాడు. గంగవ్వ అలరిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఫర్వాలేదనిపించారు.

67
టెక్నీకల్‌గా అగధ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా అగధ ఎలా ఉందంటే?

రాకేష్‌ వెంకటాపురం సంగీతం బాగుంది. బీజీఎం ఆకట్టుకుంది. అయితే సినిమాకి కావాల్సిన రేంజ్‌లో లేదు. చాలా సీన్లు తేలిపోయాయి. సౌండ్‌ పరంగా ఇంకా వర్క్‌ చేయాల్సింది. కాకపోతే బీజీఎం కొత్తగా ఉంది. నాని చమిడిశెట్టి విజువల్స్ బాగున్నాయి. కొత్తగా చూపించే ప్రయత్నం చేవారు. జునైడ్‌ సిద్ధిఖీ ఎడిటింగ్‌ ఇంకా వర్క్ చేయాలి. ఇంకా షార్ప్ చేయాలి. నిర్మాణ విలువలకు కొదవలేదు. ప్రతి పైసా సినిమాలో కనిపిస్తుంది. చాలా రిచ్‌గా, గ్రాండియర్‌గా ఉంది. దర్శకుడు ఎంఎస్‌ రాజు ఒక కొత్త తరహా కథని ఎంచుకున్నారు. కానీ బాగా రాసుకోలేకపోయారు. సినిమా చాలా ప్లాట్‌గా ఉంది, ఎలాంటి హై మూమెంట్స్ లేవు. దీంతో చప్పగా మారిపోయింది. అయితే అలాగని బోరింగ్‌గా లేదు. ఎంగేజింగ్‌గా సాగుతూ వచ్చింది. కథలో లీనం చేసేలా సినిమాని తెరకెక్కించడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. కొన్ని థ్రిల్‌ మూమెంట్స్ ఇచ్చారు. వాహ్‌ అనిపించారు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి సరిపోవని చెప్పొచ్చు. ఎంఎస్‌ రాజు చెప్పింతనంతగా అయితే సినిమా లేదు.

77
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

డివైన్‌ హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది. అగధ కొత్త అనుభవాన్నిస్తుంది. కొంత వరకు ఎంగేజ్‌ చేస్తుంది.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Hema Hemeelu Review: శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ..
Recommended image2
Ohh My Dog: క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓ మై డాగ్ సినిమా రివ్యూ
Recommended image3
KJQ Movie Review: `కేజేక్యూ` మూవీ రివ్యూ.. కేకే డైరెక్ట్ చేసిన చివరి మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image2
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved