- Home
- Entertainment
- బన్నీ, చెన్నకేశవ రెడ్డి షూటింగ్ లో చుక్కలు చూపించిన ఫిష్ వెంకట్.. ఏకంగా బాలయ్యనే, వివి వినాయక్ రియాక్షన్
బన్నీ, చెన్నకేశవ రెడ్డి షూటింగ్ లో చుక్కలు చూపించిన ఫిష్ వెంకట్.. ఏకంగా బాలయ్యనే, వివి వినాయక్ రియాక్షన్
నటుడు విష్ వెంకట్ కి బన్నీ, చెన్నకేశవరెడ్డి చిత్రాల షూటింగ్ సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఏకంగా బన్నీ, బాలయ్యనే వెయిట్ చేసిన సంఘటనని గుర్తు చేసుకున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

చిత్ర పరిశ్రమలో మరో విషాదం
చిత్ర పరిశ్రమ మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ఇటీవల కోట శ్రీనివాసరావు, బి సరోజాదేవి లాంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకుంది. కమెడియన్ గా చాలా కాలం తెలుగు సినిమాల్లో ఫిష్ వెంకట్ రాణించారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తూ వచ్చింది. కాగా శుక్రవారం రాత్రి ఫిష్ వెంకట్ మరణించారు.
వివి వినాయక్ నా గాడ్ ఫాదర్
ఫిష్ వెంకట్ మరణంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అభిమానులు సోషల్ మీడియాలో ఫిష్ వెంకట్ సినిమాలని, కెరీర్ విశేషాలని గుర్తు చేసుకుంటున్నారు. ఫిష్ వెంకట్ తనకి ఇండస్ట్రీలో డైరెక్టర్ వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని చెబుతుంటారు. ఆయన తెరకెక్కించిన ఆది చిత్రంతోనే ఫిష్ వెంకట్ గుర్తింపు పొందారు. ఆ చిత్రంలో ఫిష్ వెంకట్ చెప్పిన 'చిన్నా తొడకొట్టు చిన్నా' అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది.
వాళ్ళిద్దరి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాలు
ఆ తర్వాత దిల్, బన్నీ, చెన్నకేశవరెడ్డి లాంటి చిత్రాల్లో ఫిష్ వెంకట్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించారు. వివి వినాయక్ తర్వాత తనకి అంతటి ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ అని ఫిష్ వెంకట్ గతంలో తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఫిష్ వెంకట్ మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో నటించారు. గబ్బర్ సింగ్ లో ఫిష్ వెంకట్ అంత్యాక్షరి సీన్ లో చేసిన సందడి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
బాలయ్య, అల్లు అర్జున్ ని వెయిట్ చేయించిన ఫిష్ వెంకట్
గతంలో తాను అల్లు అర్జున్, బాలయ్య, డైరెక్టర్ వివి వినాయక్ లని గంటల సేపు వెయిట్ చేయించిన సంఘటనని ఫిష్ వెంకట్ గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ బన్నీ మూవీ షూటింగ్ కోటీలో జరుగుతోంది. నేను ఉదయాన్నే లేచి షూటింగ్ కి వెళ్ళాలి. కానీ రాత్రి ఫంక్షన్ లో డ్రింకింగ్ ఓవర్ అయింది. నిద్ర లేపడానికి కూడా ఇంట్లో ఎవరూ లేరు. నేను లేచే సరికే ఉదయం 10 గంటలు అయింది.
అక్కడ షూటింగ్ లొకేషన్ లో అల్లు అర్జున్, వినాయక్ గారు, ఆర్టిస్టులు, కో డైరెక్టర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను లేటుగా వెళ్లే సరికి అందరూ తిట్టారు. వినాయక్ గారు అయితే పోరా ఒకే ఒక్క మాట అన్నారు అని ఫిష్ వెంకట్ గుర్తు చేసుకున్నారు. సేమ్ సీన్ బాలయ్య చెన్నకేశవరెడ్డి షూటింగ్ లో కూడా రిపీట్ అయింది.
శ్రీహరితో అనుభందం
రాత్రి మద్యం ఓవర్ డోస్ కావడంతో మార్నింగ్ లేటుగా లేచాను. ఉస్మాన్ సాగర్ గెస్ట్ హౌస్ వద్ద చెన్నకేశవరెడ్డి షూటింగ్ జరుగుతోంది. వివి వినాయక్, బాలయ్య అందరూ వెయిట్ చేస్తున్నారు. నా వల్ల బాలయ్య ఎదురుచూడాల్సి రావడంతో అంతా కోపంతో ఉన్నారు. నేను వెళ్ళాక కో డైరెక్టర్లు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, వినాయక్ ఇద్దరూ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఫిష్ వెంకట్ తెలిపారు. ఈ రెండు సంఘటనలు తప్ప తాను ఇంకెప్పుడూ షూటింగ్స్ కి ఆలస్యంగా వెళ్లలేదని తెలిపారు. ఫిష్ వెంకట్ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన స్వస్థలం మచిలీపట్నం. దివంగత నటుడు శ్రీహరితో ఫిష్ వెంకట్ కి మంచి అనుభందం ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చినట్లు వెంకట్ తెలిపారు.