- Home
- Entertainment
- 14 లోకాలు దాటి చిరంజీవి యుద్ధం, విశ్వంభర స్టోరీ చెప్పేసిన డైరెక్టర్.. త్రిష గురించి తెలిస్తే మైండ్ బ్లాక్
14 లోకాలు దాటి చిరంజీవి యుద్ధం, విశ్వంభర స్టోరీ చెప్పేసిన డైరెక్టర్.. త్రిష గురించి తెలిస్తే మైండ్ బ్లాక్
చిరంజీవి విశ్వంభర మూవీ స్టోరీ స్టోరీ ఏంటో తెలిసిపోయింది. డైరెక్టర్ వశిష్ఠ కథ రివీల్ చేశారు. ఇందులో చిరంజీవి 14 లోకాలు దాటి వెళ్లి పోరాటం చేస్తాడట. అది ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో అద్భుతమైన ఫాంటసీ చిత్రం చేస్తున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఈ చిత్ర రిలీజ్ తరచుగా వాయిదా పడుతుండడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
ఆ మధ్యన విడుదలైన టీజర్ కి కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా టీజర్ లో విజువల్స్ ఎఫెక్ట్స్, సిజి వర్క్ పై విమర్శలు వచ్చాయి. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం అవుతుండడంతో మూవీ రిలీజ్ కూడా లేట్ అవుతోంది. ఇప్పటికీ విశ్వంభర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది స్పష్టమైన క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో విశ్వంభర మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. విశ్వంభర చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది అని, ఒక స్పెషల్ సాంగ్, చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని డైరెక్టర్ వశిష్ఠ తెలిపారు. విశ్వంభర కథ గురించి వస్తున్న అనేక ఊహాగానాలకు చెక్ పెడుతూ వశిష్ఠ ఈ మూవీ స్టోరీ రివీల్ చేశారు. ఈ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండబోతోందని రూమర్స్ వచ్చాయి.
వశిష్ఠ ఆ రూమర్స్ కి క్లారిటీ ఇస్తూ అసలు విశ్వంభరకి, జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధమే లేదు అని అన్నారు. విశ్వంభర అనేది ఒక లోకం. మనకు తెలిసిన లోకాలు 14.. అవి కాకుండా మరో లోకమైన విశ్వంభర నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. హీరోయిన్ త్రిష కోసం చిరంజీవి ఈ 14 లోకాలు దాటి వెళ్లి విశ్వంభరలో యుద్ధం చేస్తాడు. ఆమెని భూమిపైకి తీసుకుని వస్తాడు. ఇదే ఈ చిత్ర కథ అని వశిష్ఠ తెలిపారు.
అసలు త్రిష ఆ విశ్వంభర లోకంలో ఎందుకు ఉంది.. అక్కడ చిరంజీవి యుద్ధం చేయాల్సింది ఎవరితో అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. వశిష్ఠ చెప్పింది చూస్తుంటే త్రిష పాత్ర ఈ చిత్రంలో చాలా క్రేజీగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. ఆమె కోసం చిరంజీవి ఎందుకు ఆ లోకానికి వెళ్ళాడు, అక్కడ ఎలాంటి పోరాటం చేశాడు అనే అంశాలు కనెక్ట్ అయితే చాలు, రికార్డుల మోత ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. అదే విధంగా వశిష్ఠ విశ్వంభర టీజర్ పై జరిగిన ట్రోలింగ్ గురించి కూడా స్పందించాడు. టీజర్ పై వచ్చిన విమర్శలని తీసుకున్నా.. ట్రైలర్ ఉంది కదా అప్పుడు చూపిస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.