- Home
- Entertainment
- హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథులు వీరే.. 3 రాష్ట్రాల మంత్రులు, త్రివిక్రమ్ ఇంకా ఎవరెవరంటే
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథులు వీరే.. 3 రాష్ట్రాల మంత్రులు, త్రివిక్రమ్ ఇంకా ఎవరెవరంటే
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 3 రాష్ట్రాల మంత్రులు అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఆ మంత్రులు ఎవరెవరు అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ చివరగా నటించిన బ్రో మూవీ విడుదలై 2 ఏళ్ళు గడిచిపోయింది. హరహర వీరమల్లు చిత్రం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా వీరుడిగా కనిపించబోతున్నారు. ఈ అంశాలన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరిహర వీరమల్లు టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధం అవుతోంది. జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో జూలై 20న నిర్వహించాలని అనుకున్నారు. కానీ చివరికి జూలై 21న హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే గెస్ట్ ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల నుంచి మంత్రులు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారట. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కర్ణాటక అటవీ శాఖా మంత్రి ఈశ్వర ఖండ్రే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈశ్వర ఖండ్రేని స్వయంగా ఏఎం రత్నం ఇన్వైట్ చేశారు.
ఇక పవన్ స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతారు. అదే విధంగా మరి కొందరు రాజకీయ నేతలు కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.