- Home
- Entertainment
- ఫిష్ వెంకట్‌కి సినిమాల్లో లైఫ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ ఒక్క మూవీతో జాతకమే మారిపోయింది
ఫిష్ వెంకట్‌కి సినిమాల్లో లైఫ్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ ఒక్క మూవీతో జాతకమే మారిపోయింది
కామెడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ కి నటుడిగా బ్రేక్ ఇచ్చిన సినిమా, అలాగే ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ ఎవరో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

విలన్ నుంచి కామెడీ విలన్‌గా టర్న్ తీసుకున్న ఫిష్ వెంకట్
కామెడీ విలన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా ఫిష్ వెంకట్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.
దాన్నుంచి కోలుకున్నారు, కానీ మళ్లీ అరోగ్యం వికటించింది. కిడ్నీలు మరింత డ్యామేజ్ అయ్యాయి. దీంతో తన ట్రీట్‌మెంట్ కి దాతల కోసం వారి ఫ్యామిలీ వేడుకుంది.
కానీ పెద్దగా స్పందన లేదు. దీంతో ఆసుపత్రిలో ఇన్నాళ్లు పోరాడిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటు అని చెప్పొచ్చు.
డైలాగ్ డెలివరీనే ఫిష్ వెంకట్ అసెట్
ఫిష్ వెంకట్ సినిమాల్లో మొదట విలన్‌గా పరిచయం అయ్యారు. చాలా సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత కామెడీ విలన్‌గా టర్న్ తీసుకున్నారు. ఆద్యంతం ఆకట్టుకున్నారు. తన డైలాగ్ డెలివరీనే ఫిష్ వెంకట్ అసెట్. అందులోనే కామిక్ టైమింగ్ ఉంది. దాన్ని వాడుకుని సక్సెస్ అయ్యారు వెంకట్.
శ్రీహరి కారణంగా సినిమాల్లోకి ఫిష్ వెంకట్
అయితే షిఫ్ వెంకట్ సినిమాల్లోకి రావడానికి, ఆయనకు లైఫ్ ఇచ్చింది ఎవరనేది చూస్తే, అది ఎవరో కాదు రియల్ స్టార్ శ్రీహరి. సినిమాల్లోకి రాకముందు ఫిష్ వెంకట్ చేపల వ్యాపారం చేసేవారు.
ఆయన నివాసం ఉండేది రామ్ నగర్. అలా ఆయనకు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది. అప్పట్నుంచి శ్రీహరి పరిచయం. ఆయన సినిమాలు చేస్తుంటే మధ్య మధ్యలో వెంకట్‌ని తీసుకెళ్లేవారు.
అలా మొదట్లో కొన్ని సినిమాల్లో నటింప చేశాడు, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో మధ్య గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ శ్రీహరి కారణంగానే సినిమాలు చేశారు.
`ఆది` సినిమాతో ఫిష్ వెంకట్ కి బిగ్ బ్రేక్
తొలుత `సమ్మక్క సారక్క`, `ఖుషి` చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఫిష్ వెంకట్‌కి `ఆది`లో అవకాశం వచ్చింది. ఈ ఆఫర్ వెనుక శ్రీహరి ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తెలిపారు. ఇందులో హీరోకి సపోర్ట్ గా ఉండే పాత్రలో కనిపించారు ఫిష్ వెంకట్.
ఒక్కసారి తొడగొట్టన్న అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అదే ఫిష్ వెంకట్‌కి లైఫ్ ఇచ్చింది. ఆయన జాతకం మారిపోయేలా చేసింది. `ఆది` సినిమాతో బిగ్ బ్రేక్ అందుకున్నారు ఫిష్ వెంకట్. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వినాయక్ ప్రోత్సాహంతోనే విలన్ నుంచి కామెడీ విలన్‌గా ఫిష్ వెంకట్ టర్న్
`ఆది`తో నటుడిగా పాపులర్ అయ్యారు ఫిష్ వెంకట్. వరుసగా ఫ్యాక్షన్ సినిమాలు చేసే అవకాశాలు అందుకున్నారు. `చెన్నకేశవ రెడ్డి`, `దిల్`, `బన్నీ`, `భగీరథ`, `అశోక్`, `సామాన్యుడు`, `అసాధ్యుడు`, `ఢీ`, `యోగి`, `దుబాయ్ శీను`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `రెడీ`, `శౌర్యం`, `హీరో`, ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాలన్నింటిలోనూ నటించాడు ఫిష్ వెంకట్.
ప్రారంభంలో ఫిష్ వెంకట్‌ని బాగా ఎంకరేజ్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్. ఆయన్ని విలన్‌గా చేసింది ఆయనే, గుర్తింపు ఇచ్చింది ఆయనే, ఆ తర్వాత కామెడీ విలన్‌గా మార్చింది కూడా ఆయనే అని, ఆయనే తనకు గురువు అని తెలిపారు ఫిష్ వెంకట్.
రెండున్నర దశాబ్దంలో వందకుపైగా చిత్రాల్లో ఫిష్ వెంకట్ సందడి
ఇలా ఫిష్ వెంకట్ లైఫ్ టర్న్ అయ్యిందంటే? ఆయన నటుడిగా సెటిల్ అయ్యారంటే? దానికి కారణం శ్రీహరి, దర్శకుడు వినాయక్ అని చెప్పొచ్చు. ఇక ఆయనకు లైఫ్ ఇచ్చిన మూవీ, కెరీర్‌ని మలుపుతిప్పిన మూవీ `ఆది`గా చెప్పొచ్చు.
2000లో కెరీర్‌ని ప్రారంభిస్తే మొన్నటి వరకు నటిస్తూనే ఉన్నాడు. దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక చివరగా ఆయన ఈ ఏడాది వచ్చిన `కాఫీ విత్ ఏ కిల్లర్` చిత్రంలో నటించారు. అయితే ఫిష్ వెంకట్ మరణం తెలుగు వారికి, ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పొచ్చు.