- Home
- Entertainment
- టాప్ 10 ఇండియన్ పాపులర్ హీరోలు, దూసుకొచ్చిన నాని.. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్, తారక్, చరణ్ స్థానాలివే
టాప్ 10 ఇండియన్ పాపులర్ హీరోలు, దూసుకొచ్చిన నాని.. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్, తారక్, చరణ్ స్థానాలివే
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జూన్ నెలలో ఇండియా మోస్ట్ పాపులర్ హీరోల టాప్ 10 జాబితా వచ్చింది. ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్, మహేష్‌ల స్థానం ఎక్కడంటే?
- FB
- TW
- Linkdin
Follow Us

ఓర్మాక్స్ మీడియా టాప్ 10 ఇండియా మోస్ట్ పాపులర్ హీరోలు
Top 10 Most popular Indian Stars: ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాని విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా తాజాగా జూన్ నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది.
ఇందులో అనూహ్యంగా ఎప్పుడూ లేని నాని ఇండియా మోస్ట్ పాపులర్ స్టార్స్ టాప్ 10 జాబితాలోకి దూసుకురావడం విశేషం. అలాగే అల్లు అర్జున్ ఓ స్థానం మెరుగుపడగా, మిగిలిన టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ చరణ్‌ల స్థానం ఏంటనేది చూద్దాం.
మరోసారి నెంబర్ 1 గా ప్రభాస్
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా మోస్ట్ పాపులర్ స్టార్స్ టాప్ 10 జాబితాలో నెంబర్ వన్‌గా మరోసారి ప్రభాస్ నిలిచారు. ఆయన చాలా నెలలుగా మొదటి స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు కూడా తన స్థానం పదిలపర్చుకున్నారు.
ఇండియాలో ప్రభాస్ గురించి చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. ఆయన సినిమాల అప్ డేట్లు ఇండియావైడ్‌గా వైరల్ అవుతూనే ఉన్నాయి. అందుకే ఆయన్ని టచ్ చేయడం మిగిలిన ఏ హీరోకి సాధ్యం కావడం లేదు. బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సైతం ఆయన దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నారు.
ఒక్క స్థానం మెరుగుపడ్డ అల్లు అర్జున్
ఈ లిస్ట్ లో రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నిలిచారు. ఆయన స్థానం కూడా చాలా నెలలుగా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మరోసారి తన సత్తాని చాటుకున్నారు.
ఇక మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఆయన అంతకు ముందు నెలలో నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక స్థానం మెరుగుపడ్డారు. అట్లీతో ఆయన చేయబోతున్న సినిమాకి సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బన్నీ స్థానం మెరుగుపడింది.
ఆరో స్థానంలో మహేష్ బాబు
నాల్గో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నిలిచారు. ఆయన రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తూ వస్తున్నారు. గత నెలతో పోల్చితే ఒక స్థానం పడిపోయింది.
ఐదో స్థానంలో కోలీవుడ్ స్టార్ అజిత్ నిలిచారు. ఆయన చాలా నెలలుగా ఒకే స్థానంలో ఉంటున్నారు. ఆరో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఆయన గత నెల కూడా అదే స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్.. రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఏమాత్రం తగ్గడం లేదు
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో ఏడో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. తారక్ గత నెల కూడా ఏడో స్థానంలోనే నిలిచారు. తన పొజీషియన్లని కాపాడుకుంటున్నారు. తారక్ ఇప్పుడు `వార్ 2` తో రాబోతున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నారు.
వీరితోపాటు రామ్ చరణ్ స్థానం కూడా మారలేదు. గత నెలలో ఎనిమిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు కూడా అదే స్థానంలో కటిన్యూ అవుతున్నారు. చరణ్ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు.
టాప్ 10లోకి దూసుకొచ్చిన నాని అందరికి షాక్
తొమ్మిదో స్థానంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. ఆయన వరుసగా సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల `కన్నప్ప`లో శివుడిగా కనిపించి మెప్పించారు.
పదో స్థానంలో మరో టాలీవుడ్ హీరో నాని నిలవడం విశేషం, గత నెలలో సల్మాన్ ఉండగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నాని దక్కించుకున్నారు.
ఇక్కడ విశేషం ఏంటంటే నాని ఇప్పటి వరకు ఈ లిస్ట్ లోకి రాలేదు. మొదటిసారి ఆయన ఇండియా టాప్ 10 లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇది నాని ఎదుగుదలకు, ఆయన ఇమేజ్, స్టార్‌డమ్ పెరగడానికి నిదర్శనంగా చెప్పొచ్చు.