చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ ఎవరో తెలుసా? చిరు మెగా హీరో ఎలా అయ్యారు?
చిరంజీవిని టాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ మెగాస్టార్ అని పిలుచుకుంటుంటారు. అయితే చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ లో మరో మెగాస్టార్ ఉన్నారని మీకు తెలుసా? ఇంతకీ ఆ హీరో ఎవరు?
- FB
- TW
- Linkdin
Follow Us
)
చిరంజీవి సాదారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. హీరోగా ఎదిగి.. స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. తన కష్టం మీద ఇంత సాధించాడు చిరంజీవి. అంతే కాదు టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగి తన నీడలో మెగా సినిమా ఫ్యామిలీని క్రియేట్ చేశాడు. టాలీవుడ్ లో ఎక్కువ హీరోలు ఉన్న కుటుంబంగా మెగా ఫ్యామిలీ నిలిచింది. మెగా అంటే చిరంజీవి గుర్తుకు వచ్చేలా చేశాడు. అయితే చిరంజీవికంటే ముందు టాలీవుడ్ లో మరో మెగాస్టార్ ఉండేవారని మీకు తెలుసా?
Also Read: మహేష్ బాబు ఫైనల్ లుక్ లీక్, సింహంలా జూలు విదుల్చుతున్న సూపర్ స్టార్
అసలు మెగాస్టార్ అనే ట్యాగ్ చిరంజీవి కాకుండా టాలీవుడ్ లో మరో స్టార్ హీరో అందుకునే వారట. వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మెగస్టార్ అయ్యేవారంట, కానీ చిరంజీవికి తన అభిమానులే స్వయంగా ఈ ట్యాగ్ ఇచ్చారు. అయితే చిరు కాకుండా మెగాస్టార్ ట్యాగ్ అందుకున్న హీరో ఎవరంటే నటభూషన్ శోభన్ బాబు.
Also Read:100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?
అవును టాలీవుడ్‌లో నట భూషనుడు, అందగాడు, సోగ్గాడు, ఇలా అనేక బిరుదులతో పాటు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో అప్పట్లో శోభన్ బాబు మాత్రమే. ఆయన అందానికి, నటనకు అప్పటి వారు ఫిదా అయిపోయేవారంట. అంతేకాకుండా అప్పటి లేడీ ఫ్యాన్స్ తో పాటు ఆయనతో నటించే లేడీ స్టార్లు కూడా శోభన్ బాబును తమ కలల రాజుగా ఊహించుకునేవారట. అంత పేరు సంపాదించుకున్నారు శోభన్ బాబు.
Also Read:శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
శోభన్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో మెగాస్టార్ బిరుదు ఆయననే పిలవడం స్టార్ట్ చేశారట కొంతమంది. కాని చాలామంది శోభన్ బాబుకు ఉన్న లేడీ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రా అందగాడు అనే బిరుదు ఇచ్చారట. సోగ్గాడు సినిమా టైమ్ నుంచి శోభన్ బాబును సోగ్గాడు అని ముద్దుగా పిలుచుకున్నారు మహిళా అభిమానులు. ఇక ఆతరువాత ఆయన సీనియర్ నటుడు అవ్వగానే నట భూషనుడు అయ్యాడు.
Also Read:53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?
అలా మెగాస్టార్ ట్యాగ్ ను శోభన్ బాబు మిస్ అవ్వడంతో.. ఆతరువాత వరుస సినిమాలు, సూపర్ హిట్లు కొడుతూ.. టాలీవుడ్ ను ఊపేసిన చిరంజీవికి మెగా ట్యాగ్ ఇచ్చేశారు. అప్పటి వరకూ సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవికి మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చి..మెగాస్టార్ చిరంజీవిని చేశారు. అలా చిరంజీవి మెగా హీరో అయ్యాడు. ఆయన సుప్రీం హీరో ట్యాగ్ ను మాత్రం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అందుకున్నారు.
Also Read:బిగ్ బాస్ తెలుగు నుంచి నాగార్జున ఔట్, కొత్త హోస్ట్ గా పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోలు?
Also Read:20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?